నేటి నుంచి (డిసెంబర్ 16) ఏ బ్యాంకు నుంచి అయినా NEFT ట్రాన్సుఫర్ 24x7 అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఏ రోజైనా, ఏ సమయంలోనైనా, సెలవు రోజైనా నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సమయం చూసుకొని, టైమ్ చూసుకొని డబ్బు బదలీ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆర్బీఐ 365 రోజులు, 24 గంటలూ నెఫ్ట్ ఉపయోగించవచ్చు.

ఆ గంట మాత్రం...
NEFT ట్రాన్సాక్షన్స్‌ను ప్రస్తుతం అరగంట బ్యాచులుగా విభజించారు. మొదటి బ్యాచ్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉదయం 00.30 (లేదా 12.30 AM) గంటలకు ప్రారంభమవుతుంది. చివరి బ్యాచ్ అర్ధరాత్రి సెటిల్ చేస్తారు. రౌండ్ ది క్లాక్ విధానంలో నెఫ్ట్ పని చేస్తుంది. అయితే చివరి సెటిల్మెంట్ అర్ధరాత్రి గం.11.30కు పూర్తవుతుంది. తొలి బ్యాచ్ ఉదయం గం.12.30కు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆర్ధరాత్రి గం.11.30 నుంచి గం.12.30 మధ్య (గంటసేపు) మాత్రం కస్టమర్లు ట్రాన్సుఫర్ చేయలేరు.

అవి మరుసటి రోజు ఉదయం పూర్తవుతాయి
ఒకవేళ అర్ధరాత్రి గం.11.30 తర్వాత చేసిన ట్రాన్సాక్షన్స్ మరుసటి రోజు ఉదయం గం.12.30కు పూర్తవుతాయి. అంటే ఆ గంటలో మాత్రమే లావాదేవీలు పూర్తికావు. బ్యాంకు సెలవు రోజుల్లో కూడా నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అలాగే, ఆన్ లైన్ ద్వారా చేసే నగదు ట్రాన్సాక్షన్స్‌కు బ్యాంకు శాఖ తెరిచే వరకు వేచి చూడాల్సిన ఇప్పుడు లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహించేందుకు ఐఎంపీఎస్ సౌకర్యం ద్వారా గరిష్టంగా రూ.2 లక్షల పరిమితి ఉంది. నెఫ్ట్ ద్వారా ఆ పరిమితి లేదు.

నెఫ్ట్ ఛార్జీలు
ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి పలు బ్యాంకులు ఆన్ లైన్ నెఫ్ట్ బదలీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలు వసూలు చేయకూడదని, ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. అంతకుముందు ఆర్టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్‌కు ఆర్బీఐ బ్యాంకుల నుంచి కనీస ఛార్జీలు వసూలు చేసేది. బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి ఈ ఛార్జీలను వసూలు చేసేవి. జనవరి 2020 నుంచి బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వినియోగదారులకు ఆన్ లైన్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్‌కు ఉచితంగా అందించడాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసింది.

నెఫ్ట్ ఆయా బ్యాంకు పరిమితులు
నెఫ్ట్ ద్వారా చేసే నగదు ట్రాన్సాక్షన్స్ పైన కనీస పరిమితి లేదు. అయితే చాలా బ్యాంకులకు గరిష్ట పరిమితి రూ.2 లక్షల వరకు ఉంది. అందకుమించి లావాదేవీలకు ఆర్టీజీఎస్‌ను ఉపయోగించుకోవచ్చు. గరిష్ట పరిమితి కస్టమర్ కేటగిరి, బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. ఐసీఐసీఐ అకౌంట్ హోల్డర్స్‌కు రూ.10 లక్షల వరకు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.25 లక్షల వరకు, ఎస్బీఐ రిటైల్ అకౌంట్‌దారుల గరిష్ట నెఫ్ట్ ట్రాన్సక్షన్స్ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications