ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వినియోగదారులకు అన్ని సేవలను సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యలు ప్రకటిస్తోంది. డిసెంబర్ 2020 నుండి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) 24x7 పని చేయనుంది. ప్రస్తుత నిబంధనలు ఉదయం గం.7 నుండి సాయంత్రం గం.6 వరకు, అన్ని వర్కింగ్ డేస్‌లో అందుబాటులో ఉంది. వచ్చే నెల నుండి ఇది నిత్యం అందుబాటులో ఉండనుంది. నెఫ్ట్ (NEFT) సౌకర్యం డిసెంబర్ 16, 2019 నుండి 24x7 అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

24x7 అందుబాటులో ఆర్టీజీఎస్
RTGS డిసెంబర్ 2020 నుండి 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. అంటే డిసెంబర్ నుండి పెద్ద మొత్తాన్ని బదలీ చేయడానికి మీరు బ్యాంకు పని వేళల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆర్టీజీఎస్ బ్యాంకు సెలవు రోజులు, రెండువ, నాలుగో శనివారం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఇప్పుడు అందుబాటులో ఉంటుంది.

ఆర్టీజీఎస్ అంటే
ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. మనీని ట్రాన్సుఫర్ చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఆర్టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షల మొత్తాన్ని పంపించవచ్చు. ఆర్బీఐ FAQ ప్రకారం గరిష్ట పరిమితి లేదు. అయితే బ్యాంకులు సాధారణంగా రూ.10 లక్షల గరిష్టాన్ని అనుమతిస్తున్నాయి.

బ్యాంకు ప్రయోజనం అందిస్తే..
ఇక నెఫ్ట్ గత ఏడాది నుండి 24X7 అందుబాటులోకి వచ్చింది. ఇది ఉచితం. ఆర్టీజీఎస్ బదలీపై ఛార్జీ ఉంటుంది. ఈ ఛార్జీలు బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతుంటాయి. అక్టోబర్ 30, 2019 ప్రకారం జూలై 1, 2019 నుండి ఆర్టీజీఎస్ పైన విధించే ప్రాసెసింగ్ ఛార్జీలను ఆర్బీఐ మాఫీ చేసింది. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించవచ్చు.
- రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పన్ను మినహాయించి ఏదైనా ఉంటే రూ.24.50 దాటవద్దు.
రూ.5 లక్షలు మించితే రూ.49.50 దాటకూడదు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications