For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్ 1 నుండి గుర్తుంచుకోండి! విదేశాలకు పంపే నిధులపై 5% పన్ను, విద్యార్థులకు ఊరట

|

విదేశీ టూర్ ప్యాకేజీ కోసం విదేశాలకు పంపిన మొత్తం, రూ.7 లక్షలకు మించి చేసే ఫారెన్ రెమిటెన్స్ పైన అక్టోబర్ 1వ తేదీ నుండి పన్ను వసూలు చేయనున్నారు. ఈ మేరకు వచ్చే నెల నుండి లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మార్పులు చేస్తోంది. ఈ స్కీం కింద విదేశాలకు పంపే డబ్బు పైన 5 శాతం చొప్పున ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్(TCS)ను వసూలు చేయనున్నారు.

రూ.7 లక్షలు దాటిన ఇతర విదేశీ రెమిటెన్స్‌పై టీసీఎస్ వసూలు చేస్తారు. టీడీఎస్‌తో సంబంధం లేకుండా ఈ పన్నుల్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చాలా ఆర్థిక సంస్థలు టీసీఎస్ సమాచారాన్ని తమ కస్టమర్లకు అందించే పనిలో పడ్డాయి. ఈ మేరకు నిబంధనను ఫైనాన్స్ యాక్ట్ 2020లో తీసుకు వచ్చారు.

గంటకు రూ.1,100కి పైన: మంచి శాలరీతో అమెజాన్‌లో 33,000 ఉద్యోగాలుగంటకు రూ.1,100కి పైన: మంచి శాలరీతో అమెజాన్‌లో 33,000 ఉద్యోగాలు

అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా..

అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా..

ఆర్బీఐ సరళీకృత చెల్లింపుల పథకం కింద ఏడాదికి ప్రతి వ్యక్తి గరిష్టంగా 250,000 డాలర్లను విదేశాలకు పంపించవచ్చు. పన్నుపై వసూలు చేయాలనే నిబంధనను 2020 ఫైనాన్స్ యాక్ట్‌లో ప్రవేశ పెట్టారు. అక్టోబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా మార్చి 27వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం 206 సీ సెక్షన్‌కు సవరణను ప్రతిపాదించింది.

విద్యార్థులకు ఊరట

విద్యార్థులకు ఊరట

రుణాల ద్వారా నిధులు సమకూర్చిన విద్యా సంబంధిత ఖర్చుల చెల్లింపుల కోసం పంపించే నిధులు రూ.7 లక్షలు దాటితేనే పన్ను వర్తిస్తుంది. అది కూడా కేవలం 0.5 శాతం పన్నునే వేయనున్నారు. విదేశీ చదువుల కోసం రుణాలపై ఆధారపడే భారతీయ విద్యార్థులకు ఇది ఊరట కలిగించే విషయం.

పాన్, ఆధార్ లేకుంటే 10 శాతం

పాన్, ఆధార్ లేకుంటే 10 శాతం

పాన్ కార్డు, ఆధార్ కార్డురహిత నగదు బదలీలపై 10 శాతం టీసీఎస్ పడుతుంది. 5 శాతం టీసీఎస్‌ను అదనపు భారంగా లేదా కొత్త పన్నుగా భావించక్కరలేదని, దీనిని మొత్తం ఆదాయం పన్ను బకాయిల్లో సర్దుబాటు చేసుకోవచ్చునని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఈ-కామర్స్ చెల్లింపులపై 1 శాతం టీడీఎస్ అక్టోబర్ 1వ తేదీ నుండి వర్తిస్తుంది.

క్లెయిమ్ చేసుకోవచ్చు.. మరిన్ని అంశాలు

క్లెయిమ్ చేసుకోవచ్చు.. మరిన్ని అంశాలు

- విదేశాలకు పంపిన మొత్తం రూ.7 లక్షల కంటే తక్కువ ఉంటే... టూర్ ప్యాకేజీ కొనడానికి కాకుంటే టీసీఎస్ వసూలు ఉండదు.

- రూ.7 లక్షలకు మించితే టీసీఎస్ విధింపు ఉంటుంది.

- విద్యార్థులకు రూ.7 లక్షల పరిమితికి మించి ఉన్నా 0.5 శాతం మాత్రమే విధిస్తారు.

- పాన్, ఆధార్ లేకుంటే టీసీఎస్ రేటు 10 శాతం విధిస్తారు.

- టీసీఎస్‌గా తగ్గిన మొత్తానికి జీఎస్టీని విధిస్తారు.

- ప్రభుత్వం విదేశాలకు డబ్బులు పంపితే టీసీఎస్ వర్తించదు.

- విదేశాలకు పంపిన వ్యక్తి పన్ను రిటర్న్స్‌లో బ్యాంకు తీసివేసిన టీసీఎస్‌కు క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.

English summary

అక్టోబర్ 1 నుండి గుర్తుంచుకోండి! విదేశాలకు పంపే నిధులపై 5% పన్ను, విద్యార్థులకు ఊరట | Now pay 5 percent tax at source on foreign remittances from October 1

The government will levy 5 per cent tax on foreign remittances, subject to riders, starting October 1. While foreign tour packages will attract a tax-collected-at source (TCS) of 5 per cent for any amount, other remittances will only be taxed if the amount is more than Rs 7 lakh.
Story first published: Friday, September 11, 2020, 9:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X