For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 రోజుల్లో నెంబర్ పోర్టబిలిటీ, కస్టమర్‌కూ షరతులు: MNP కొత్త రూల్స్ ఇవే

|

ప్రస్తుతం మీరు ఉన్న నెట్ వర్క్‌తో సంతృప్తిగా లేరా? నెంబర్ పోర్టబిలిటీ కోసం నాలుగు రోజుల నుంచి దాదాపు వారం ఆగాలా.. అనుకుంటున్నారా? అయితే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మీకు ఓ శుభవార్త తెలిపింది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (MNP)కి సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పటి వరకు ఆలస్యమైన నిబంధనలు ఇప్పుడు అమలు చేయాలని ఆదేశించింది.

అలా ఐతే కరెంట్ ఛార్జీల పెరుగుదల, సబ్సిడీలకు ఫుల్‌స్టాప్అలా ఐతే కరెంట్ ఛార్జీల పెరుగుదల, సబ్సిడీలకు ఫుల్‌స్టాప్

రెండు రోజుల్లోనే నెట్ వర్క్ మార్చుకోవచ్చు

రెండు రోజుల్లోనే నెట్ వర్క్ మార్చుకోవచ్చు

తాజా నిబంధనల ప్రకారం కస్టమర్ రెండు రోజుల్లోనే ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్‌కు మారిపోవచ్చు. కొంతకాలంగా నెట్ వర్క్ ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కస్టమర్లను ఆకర్షించేందుకు టెలికం సంస్థలు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించాయి. దీంతో కస్టమర్లు నెంబర్ పోర్టబిలిటీని కోరుకున్నారు. నెంబర్ మారకుండానే నెట్ వర్క్ మార్చుకునే ఈ సేవలకు డిమాండ్ పెరిగింది.

ట్రాయ్ నిబంధనలు...

ట్రాయ్ నిబంధనలు...

ఇప్పటి వరకు MNP కోసం 96 గంటల సమయం తీసుకునేది. దీనిని 48 గంటలకు కుదిస్తూ ట్రాయ్ నిబంధనల్లో మార్పులు చేసింది. దాని ప్రకారం MNPకి దరఖాస్తు చేసుకున్న కస్టమర్‌కు యూనిక్యూ పోర్టింగ్ కోడ్ (UPC) వస్తుంది. ఇది మొబైల్ నెంబర్ వినియోగంలో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. దీని కోసం కస్టమర్‌కు కూడా ట్రాయ్ కొన్ని షరతులు విధించింది.

కస్టమర్‌కు ట్రాయ్ షరతులు

కస్టమర్‌కు ట్రాయ్ షరతులు

- MNPతో ఓ నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్‌కు మారాలనుకుంటే కస్టమర్ నెలవారీ బిల్లుతో పాటు పాత బకాయిలు కూడా చెల్లించాలి.

- 90 రోజుల నుంచి ప్రస్తుత నెట్ వర్క్‌ను ఉపయోగిస్తుండాలి.

- నెంబర్ ఒకరి పేరు మీద ఉంటే మరొకరి పేరు మీదకు మార్చుకునే అవకాశం లేదు.

- MNP కోరుకుంటున్న నెంబర్ చట్టం చేత నిషేధించబడింది కాకూడదు. ఆ నెంబర్ పైన ఎలాంటి న్యాయపరమైన వివాదాలు ఉండి ఉండకూడదు.

- ఈ నిబంధనల ప్రకారం కస్టమర్లు MNPకి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇలా పోర్ట్ కోసం దరఖాస్తు...

ఇలా పోర్ట్ కోసం దరఖాస్తు...

- నిబంధనల ప్రకారం MNPకి దరఖాస్తు చేసుకుంటే ఐదు నిమిషాల్లో UPC జారీ చేస్తారు.

- ఆ తర్వాత పోర్ట్ (PORT) అని ఇంగ్లీష్‌లో టైప్ చేసి, స్పేస్ ఇచ్చి మొబైల్ నెంబర్ టైప్ చేసి 1900కి ఎస్సెమ్మెస్ చేయాలి.

- ఎస్సెమ్మెస్ ద్వారా UPC వస్తుంది. గతంలో UPC చెల్లుబాటు కాలం 15 రోజులుగా ఉంది. ఇప్పుడు దీనిని 4 రోజులకు కుదించారు.

- జమ్ము కాశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సమయాన్ని 30 రోజులుగా నిర్ణయించారు.

ఈ డాక్యుమెంట్స్ అవసరం

ఈ డాక్యుమెంట్స్ అవసరం

- MNP ప్రక్రియను ప్రారంభించేందుకు అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ వంటివి అవసరం.

- ఒకే సర్కిల్లోని ఆపరేటర్లకు MNP మూడు రోజుల్లో పూర్తవుతుంది. అదే ఇతర సర్కిల్స్ ఆపరేటర్లకు 5 రోజుల సమయం పడుతుంది.

- కార్పోరేట్ పరిధిలోని మొబైల్ కనెక్షన్స్‌కు పాత నిబంధనలు వర్తిస్తాయి.

24 గంటల టైమ్

24 గంటల టైమ్

- ఒకవేళ ఎవరైనా MNPకి దరఖాస్తును ఉపసంహరించుకోవాలంటే 24 గంటల లోపల దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి.

- MNPకి ట్రాయ్ రూ.6.46 ట్రాన్సాక్షన్ ఫీజుగా వసూలు చేస్తుంది.

English summary

2 రోజుల్లో నెంబర్ పోర్టబిలిటీ, కస్టమర్‌కూ షరతులు: MNP కొత్త రూల్స్ ఇవే | New MNP rules comes into effect: Here are the details

The Telecom Regulatory Authority of India (TRAI) has revised the Mobile Number Portability (MNP) process which allows mobile subscribers to switch operators while retaining their mobile numbers. The new rules will come to effect from today.
Story first published: Tuesday, December 17, 2019, 13:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X