For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాక్స్‌పేయర్ చార్టర్.. పన్ను చెల్లింపుదారుకు ప్రయోజనం: ఏమిటీ ఫేస్‌లెస్ అసెస్‌మెంట్?

|

పన్ను చెల్లింపుల్లో సమూల మార్పుల దిశగా దేశం మరోఅడుగు ముందుకేసింది. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అవినీతికి, వేధింపులకు తావులేని పన్ను విధానమే తమ లక్ష్యమని ప్రకటించిన ప్రధాని మోడీ పారదర్శకమైన, విశ్వసనీయమైన స్వేచ్చాయుత వాతావరణంలో పన్ను చెల్లింపుదారుల హక్కులకు రక్షణ కల్పిస్తామని నిన్న ట్యాక్స్‌పేయర్ చార్టర్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులు కూడా నిజాయితీగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 'పారదర్శక పన్నువిధానం - నిజాయితీపరులకు గౌరవం' అన్న ట్యాక్స్ పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 130 కోట్ల మంది జనాభాలో కోటిన్నర రెండున్నర కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారన్నారు.

20 ఏళ్లలో తొలిసారి దారుణంగా కుప్పకూలిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ

మూడు ప్రధాన అంశాలు

మూడు ప్రధాన అంశాలు

మోడీ ఆవిష్కరించిన పారదర్శక పన్నువిధానంలోని 3 ప్రధాన అంశాలు... అధికారుల్ని కలిసే అవసరం లేకుండా ఆదాయపన్ను మదింపు (ఫేస్‌లెస్ అసెస్‌మెంట్), వారికి విజ్ఞప్తి చేసుకునే వీలు కల్పించడం(ఫేస్‌లెస్ అప్పీల్), పన్నుచెల్లింపుదారుల చార్టర్. పన్ను చెల్లింపుదారులు ఎవరిముందు హాజరు కాకుండానే ట్యాక్స్ చెల్లింపులు చేయవచ్చు. అలాగే ఎవరి ముందు హాజరు కాకుండా అప్పీల్ చేసుకునే సౌకర్యం రానుంది.

ఫేస్‌లెస్ అసెస్‍‌మెంట్ అంటే.. ఇరువురికీ ప్రయోజనం

ఫేస్‌లెస్ అసెస్‍‌మెంట్ అంటే.. ఇరువురికీ ప్రయోజనం

మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత ఐటీ విభాగం మన ఐటీ రిటర్న్స్, అప్పీల్స్ స్క్రూటినీ, నోటీస్ జారీ, సర్వే, జఫ్తు వంటి అంశాలను చూసుకునేది. స్థానిక అధికారి కీలకంగా ఉండేవారు. తాజా సంస్కరణలతో ఈ విధానం పూర్తిగా మారిపోతుంది. కొత్త విధానంలో ఇకపై స్క్రూటినీ కేసులను దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న ఏ అధికారికో ర్యాండమ్‌గా కేటాయిస్తారు. ఆ అధికారి ఎవరో ట్యాక్స్ పేయర్‌కు తెలిసే అవకాశాలు ఉండవు. అలాగే ఆ అధికారి నుండి వచ్చే ఆదేశాలన్ని మరో రాష్ట్రానికి చెందిన అధికారులు సమీక్షిస్తారు. టీంలో ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ర్యాండమ్‌గా కంప్యూటరే నిర్ణయిస్తుంది. కృత్రిమ మేధ(AI), డేటా అనలటిక్స్ వంటి టెక్నాలజీ వినియోగంతో స్క్రూటినీని పూర్తి చేస్తారు. దీంతో పన్నుచెల్లింపుదారుకు, ఐటీ విభాగానికీ ప్రయోజనమే. పన్ను చెల్లింపుదారు ఆదాయపు పన్ను శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఐటీ అధికారులపై ప్రత్యేక ఒత్తిడి ఉండదు.

గోప్యంగా..

గోప్యంగా..

పన్ను చెల్లింపులకు అయ్యే వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతుంది ట్యాక్స్ పేయర్స్ చార్టర్. దీంతో నిజాయితీగా పన్నులు చెల్లించి దేశ ప్రగతికి తోడ్పడే వారితో పాటు ఆదాయ పన్ను విభాగానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.

ట్యాక్స్ పేయర్స్ చార్టర్‌తో...

ట్యాక్స్ పేయర్స్ చార్టర్‌తో...

- ఈ చార్టర్ ప్రకారం.. ట్యాక్స్ పేయర్స్ సమస్యల పరిష్కారంలో అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ఐటీ విభాగం నుండి పొందవచ్చు.

- ప్రత్యేక కారణాలు తప్పితే ప్రతి పన్ను చెల్లింపుదారుడిని నిజాయితీపరుడిగా పరిగణిస్తుంది.

- అప్పీల్స్ విషయంలో నిష్పాక్షిక సమీక్ష వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది.

- ట్యాక్స్ పేయర్‌కు అవసరమైన కచ్చితమైన సమాచారం అందిస్తుంది.

- ఐటీ ప్రొసీడింగ్‌కు సంబంధించి చట్ట ప్రకారం నిర్దేశిత సమయంలో నిర్ణయం ఉంటుంది.

- చట్ట ప్రకారం పన్ను బకాయిలు మాత్రమే వసూలు చేస్తుంది.

- అధికారుల వేధింపులు ఉండవు.

- పన్ను చెల్లింపుదారు తనకు నచ్చిన అధీకృత ప్రతినిధిని ఎంచుకోవచ్చు.

- ఫిర్యాదుకు, సమస్యను సకాలంలో పరిష్కరించుకునేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.

- పన్ను చెల్లింపుకు అయిన ఖర్చును చట్టం అమలు సందర్భంగా పరిగణలోకి తీసుకుంటుంది.

- ట్యాక్స్ పేయర్స్ చార్టర్‌లో ప్రభుత్వం, ఐటీ శాఖ పాటించాల్సిన 14 సూత్రాలు, ట్యాక్స్ పేయర్‌కు ఆరు సూత్రాలు పొందుపరిచారు.

English summary

IT department adopts new charter: What is faceless tax assessment?

Faceless tax assessment and appeals unveiled by Prime Minister Narendra Modi on Thursday will promote transparency and certainty, and empower honest taxpayers, India Inc and experts said.
Story first published: Friday, August 14, 2020, 16:09 [IST]
Company Search