For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బులు తప్పుడు అకౌంట్‌కు పంపిస్తే ఏం చేయాలి? ఇదీ పద్ధతి

|

ఇప్పుడు డబ్బులు ట్రాన్సుఫర్ చేయడం చాలా సులభమైన పని. అకౌంట్ నుండి మరో అకౌంట్‌కు క్షణాల్లో పంపించవచ్చు. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ వచ్చి మరింత ఈజీ అయింది. ఇదివరకు బ్యాంకులకు వెళ్లి వరుసలో నిలబడి, పామ్ నింపి, కౌంటర్ దగ్గరకు వెళ్లి డబ్బులను డిపాజిట్ చేసేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం. ఈ టెక్నాలజీని బ్యాంకులు అందిపుచ్చుకున్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఆర్బీఐ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి పటిష్టమైన భద్రతను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉండి, మొబైల్ డేటా ఉంటే వెంటనే ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకోవచ్చు. అయితే అనుకోకుండా డబ్బును రాంగ్ అకౌంట్‌కు పంపిస్తే? అప్పుడు ఏం చేయాలి?

ఆన్‌లైన్ ట్రాన్సుఫర్

ఆన్‌లైన్ ట్రాన్సుఫర్

నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, యూపీఐ ఇలా వివిధ ర‌కాల ఆప్షన్స్ ఉన్నాయి. వీటి ద్వారా డ‌బ్బుల‌ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫ‌ర్ చేయవచ్చు. ఒక్కోసారి పొరపాటున కొంద‌రు ఒక అకౌంట్ బదులు మరో అకౌంట్‌కు డబ్బులు ట్రాన్సుఫర్ చేస్తారు. అకౌంట్ నెంబర్ సరిగ్గా చూసుకోకుండా పంపించడం, తప్పుడు అకౌంట్ నెంబర్ రాసుకోవడం లేదా ఇవ్వడం, IFSC కోడ్ తప్పుగా ఉండటం వంటి వివిధ కారణాల వల్ల ఒక్కోసారి రాంగ్ అకౌంట్‌కు డబ్బులు వెళ్తాయి. అలాంటి సమయంలో డబ్బులు తిరిగి వస్తాయా, అందుకు ఏం చేయాలో తెలుసుకోండి.

ఇన్-వాలిడ్ అకౌంట్‌కు పంపిస్తే

ఇన్-వాలిడ్ అకౌంట్‌కు పంపిస్తే

పొరపాటున తప్పుడు అకౌంట్‌కు డ‌బ్బులు పంపిస్తే మొదట మనం చేయాల్సిన పని బ్యాంకుకు సమాచారం ఇవ్వడం. బ్యాంకు క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి ట్రాన్సాక్ష‌న్ చేసిన తేదీ, సమయం వివరాల‌కు అందించాలి. మెయిల్ చేయాల్సి వస్తే అందులోను ట్రాన్సాక్షన్ వివ‌రాల‌ను ఇవ్వాలి. డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన అకౌంట్ నెంబ‌ర్‌తో స‌హా అన్ని వివ‌రాల‌తో మెయిల్ చేయాలి.

కొందరు ఇన్-వాలిడ్ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తారు. అలాంటి సమయంలో డబ్బులు ఏ అకౌంట్‌కు ట్రాన్సుఫర్ కావు. వెంటనే తిరిగి ఆ డబ్బులు సొంత అకౌంట్లోకి రీఫండ్ అవుతాయి. డబ్బులు తిరిగి ట్రాన్సుఫర్ కాకుంటే హోంబ్రాంచీని సంప్రదించాలి.

వ్యాలిడ్ అకౌంట్‌కు పంపిస్తే

వ్యాలిడ్ అకౌంట్‌కు పంపిస్తే

డబ్బులు పొరపాటున మనకు తెలియని వ్యాలిడ్ అకౌంట్‌కు పంపిస్తే ఆ డబ్బులు తిరిగి రావడానికి సమయం పడుతుంది. ఏ అకౌంట్‌కు, ఏ బ్యాంకు బ్రాంచీ వెళ్లాయో వివరాలు తెలుసుకోవచ్చు. మీరు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే, బ్యాంకు సదరు ఖాతాదారును అనుమతి అడుగుతుంది. ఆ తర్వాత డబ్బులను అకౌంట్‌కు ట్రాన్సుఫర్ చేస్తుంది.

కొందరు ఖాతాదారులు డబ్బులు తిప్పి పంపించేందుకు సిద్ధపడరు. అప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కేసు ఫైల్ చేయవచ్చు. తప్పుడు అకౌంట్‌కు పంపిస్తే బ్యాంకు మాత్రం బాధ్యత వహించదు. అయితే బ్యాంకు ట్రాన్సుఫర్ అయిన ఖాతాదారుకు రిక్వెస్ట్ పంపిస్తుంది. అంగీకరించకుంటే లీగల్‌గా వెళ్లాలి.

రాంగ్ అకౌంట్‌కు డబ్బులు పంపించే కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎవరికైనా డబ్బులు ట్రాన్సుఫర్ అయితే ఆర్బీఐ సందేశం వస్తుంది. డబ్బులు తప్పుడు అకౌంట్‌కు వెళ్తే ఈ నెంబర్‌ను సంప్రదించాలని సందేశం వస్తుంది. బ్యాంకులు కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది.

English summary

డబ్బులు తప్పుడు అకౌంట్‌కు పంపిస్తే ఏం చేయాలి? ఇదీ పద్ధతి | If money is transferred to an invalid account, What to do?

In case you have transferred money to some invalid account then the money will automatically come back to your own account.
Story first published: Wednesday, September 15, 2021, 14:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X