For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైలు టిక్కెట్ బుక్ చేయాలా, వెంటనే IRCTC అకౌంట్ క్రియేట్ చేయండిలా

|

రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) వెబ్‌సైట్ లేదా దీని అప్లికేషన్ సాఫ్టువేర్ (APP)లోకి రిజిస్టర్ కావాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో రైళ్లు బంద్ అయ్యాయి. అయితే ఆ తర్వాత రైళ్ల రాకపోకలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణీకులు తమ ఇంట్లోనే కూర్చొని కొత్త IRCTC అకౌంట్‌ను క్రియేట్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్లు, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి టిక్కెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు.

తాజాగా IRCTC ఓ ట్వీట్ చేసింది. 'మీరు రైలు టిక్కెట్‌ను బుక్ చేయాలని భావిస్తున్నారా? ఇప్పటి వరకు మీకు IRCTC అకౌంట్ లేదా? వెంటనే మీరు IRCTC టిక్కెటింగ్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. ఈ కింది సింపుల్ స్టెప్స్ ద్వారా అకౌంట్ తయారు చేసుకొని, టిక్కెట్లు బుక్ చేసుకోండి' అని IRCTC అక్టోబర్ 19న ట్వీట్ చేసింది.

అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి?

అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి?

- తొలుత IRCTC అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

- పేజీ టాప్‌లో రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

- అక్కడ IRCTC రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది.

- మీ యూజర్ నేమ్‌ను ఫిల్ చేయండి. ఇది 3 పదాల నుండి 35 పదాల మధ్య ఉండాలి.

- సెక్యూరిటీ క్వశ్చన్, ఆన్సర్‌ను ఎంచుకోవాలి.

- ఆ తర్వాత మీ పేరును, జెండర్, మారిటల్ స్టేటస్, ఆక్యుపేషన్, డేట్ ఆఫ్ బర్త్‌ను ఎంటర్ చేయాలి.

- మీ లాగ్-ఇన్ పాస్‌వర్డ్ కోసం వ్యాలీడ్ ఈ-మెయిల్ అడ్రస్‌ను, మొబైల్ నెంబర్‌ను ఫిల్ చేయాలి.

- మీ పూర్తి అడ్రస్‌ను ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత అక్కడ కనిపించే టెక్స్ట్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Submit బటన్ పైన క్లిక్ చేయాలి.

- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు లేదా ఈ-మెయిల్ ఐడికి వచ్చే కోడ్‌ను వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Submit పైన క్లిక్ చేయాలి.

- మీకు ఆ తర్వాత సందేశం వస్తుంది. విజయవంతంగా రిజిస్టర్ అయినట్లు ఆ సందేశం వస్తుంది.

రైలు టిక్కెట్ బుకింగ్ ఇలా

రైలు టిక్కెట్ బుకింగ్ ఇలా

- irctc.co.in వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.

- హోమ్ పేజీ పైన లాగ్-ఇన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత Book Your Ticket పేజీ పైన క్లిక్ చేయాలి.

- మీరు ఎక్కవలసిన స్టేజీని, దిగవలసిన స్టేజీని, బోర్డింగ్, డెస్టినేషన్ స్టేషన్స్‌ను ఎంటర్ చేయాలి.

- మీరు ప్రయాణీంచాలనుకునే తేదీని ఎంచుకోండి. అలాగే మీరు ఏ క్లాస్‌లో ప్రయాణించాలనుకుంటున్నారో దానిని కూడా ఎంటర్ చేయాలి.

- మీరు కావాలనుకునే రైలులో సీట్స్ అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోండి.

- సీట్లు అందుబాటులో ఉంటే, book now option ఆప్షన్‌ను ఎంచుకోండి.

- అవసరమైన వివరాలు అందించడం ద్వారా రైలు టిక్కెట్లు బుక్ చేయవచ్చు.

- మొబైల్ నెంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

- క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐని ఉపయోగించి ఛార్జీని చెల్లించాలి.

- మీ ఫోన్‌కు టిక్కెట్ బుక్ అయినట్లు సందేశం వస్తుంది.

దూసుకెళ్లి, చతికిల పడిన IRCTC స్టాక్స్

దూసుకెళ్లి, చతికిల పడిన IRCTC స్టాక్స్

IRCTC స్టాక్స్ ఇటీవల పరుగు పెట్టింది. అయితే రెండు రోజులుగా భారీగా పతనమవుతోంది. వరుసగా రెండో రోజు భారీగా నష్టపోయింది. నేడు IRCTC స్టాక్ మరింత దిగజారి రూ.4,627 వద్ద ట్రేడ్ అయింది. నేడు రూ.4,909.40 వద్ద ప్రారంభమై, రూ.4,999.80 వద్ద గరిష్టాన్ని, రూ.4,377.30 వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి రూ.4627 వద్ద ట్రేడ్ అయింది.

English summary

రైలు టిక్కెట్ బుక్ చేయాలా, వెంటనే IRCTC అకౌంట్ క్రియేట్ చేయండిలా | How to create a new IRCTC account to book train tickets

Wondering how to book train tickets? Don’t know how to create a new IRCTC account? Well, don’t worry. Here we have you covered.
Story first published: Wednesday, October 20, 2021, 12:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X