For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gas Cylinder: గ్యాస్ బుకింగ్‌పై Paytm సూపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్ బ్యాక్.. ఎలా పొందాలంటే..

|

Gas Cylinder: కేవలం ఒక్క సంవత్సరంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రేట్లతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. పోయిన నెలలో దేశీయ చమురు కంపెనీలు ఏకంగా డొమెస్టిక్ సిలిండర్ పై రూ.50 పెంచి ఊహించని షాక్ ఇచ్చాయి. ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న ప్రజలకు వంటగ్యాస్ మోయలేని భారంగా మారింది.

 గుదిబండగా మారిన గ్యాస్ బండ..

గుదిబండగా మారిన గ్యాస్ బండ..

గ్యాస్ సిలిండర్ ఖాళీ కావటంతోనే గుబులు మెుదలవుతోంది సగటు బడుగు జీవికి. అసలే సబ్సిడీలను కూడా తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి సమయంలో చిన్న ఊరటనిచ్చే వార్త ఒకటి ఉంది. సిలిండర్ కు చెల్లించిన డబ్బు రిఫండ్ రూపంలో పొందేందుకు ఒక మార్గం ఉంది.

 100 శాతం క్యాష్ బ్యాక్..

100 శాతం క్యాష్ బ్యాక్..

ఇలాంటి పరిస్థితుల్లో పేటీఎం పేమెంట్స్ యాప్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పెషల్ ఆఫర్ కింద రూ.2,700ల క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. తమ యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునేవారికి 100% క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది

ఆఫర్ పొందటం ఎలా..

ఆఫర్ పొందటం ఎలా..

తన వినియోగదారులకు రూ.2700 క్యాష్ బ్యాక్ అందించేందుకు పేటీఎం మెగా ఆఫర్ లాంచ్ చేసింది. దీని కింద.. గ్యాస్ బుక్ చేసుకునే పేటీఎం యూజర్లు మొదటిసారి సిలిండర్లను బుక్ చేసుకుంటున్నట్లయితే.. మూడు సార్లు వేరు వేరు నెలల్లో రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.900 వరకు రిఫండ్ ఆఫర్ అందుబాటులో ఉంది. కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునేవారికి ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పుకోవాలి.

 పాత కస్టమర్లకు ఆఫర్..

పాత కస్టమర్లకు ఆఫర్..

అయితే పాత కస్టమర్లు తమ యాప్ ద్వారా గ్యాస్ బుక్కింగ్ చేసుకుంటున్నట్లయితే.. వారికి రివార్డ్‌లను అందిస్తోంది. ఆన్‌లైన్‌లో గ్యాస్ సిలిండర్‌లను బుక్ చేసుకోవడానికి వారు 5000 క్యాష్‌బ్యాక్ పాయింట్లను పొందవచ్చు. పాయింట్లను రిడీమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. గ్యాస్ వినియోగదారులకు పేటీఎం అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు కొంత ఊరటను ఇస్తున్నాయి. పూర్తి వివరాలకోసం పేటీఎం యాప్ ను చెక్ చేయండి.

English summary

Gas Cylinder: గ్యాస్ బుకింగ్‌పై Paytm సూపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్ బ్యాక్.. ఎలా పొందాలంటే.. | digital payment app Paytm giving full cash back on domestic gas cylinder buckings know details

Paytm giving full cash back on domestic gas cylinder
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X