For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ బొనాంజా: రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు? రూ.60వేలు ఆదా

|

ప్రస్తుతం అందరి చూపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పైన ఉంది. బడ్జెట్ అంటే వేటి ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయనే దానిపై సామాన్యుని దృష్టి ఉంటుంది. అలాగే, వేతనజీవులు అయితే ఆదాయపు పన్ను మినహాయింపులు లేదా ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. మోడీ ప్రభుత్వం గత బడ్జెట్ సమయంలోనే వేతనజీవులకు మినహాయింపులతో రెండింతలు పెంచి రూ.5 లక్షల వరకు ఇచ్చి భారీ ఊరట ఇచ్చింది. ఓవైపు కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించడం, మరోవైపు మందగమనం నేపథ్యంలో ఐటీపై ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది.

ఆదాయపు పన్ను గురించి మరిన్ని కథనాలు

కొత్త స్లాబ్స్ తీసుకువస్తారా?

కొత్త స్లాబ్స్ తీసుకువస్తారా?

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగా మధ్య తరగతి వర్గాలకు పన్ను భారం తగ్గించేందుకు, తద్వారా వారి దగ్గర మిగులు మొత్తాన్ని పెంచే చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్ ఇదివరకు చెప్పారు. కొత్త స్లాబ్స్‌ను ప్రభుత్వం తీసుకు రానుందా అనేది అందరిలోను మెదులుతున్న ప్రశ్న. కొత్త స్లాబ్స్ వస్తే అది శాలరైడ్‌కు ప్రయోజనకరంగా ఉంటుందా అనేది చూడాలి.

చాలా ఏళ్లుగా స్లాబ్స్ సవరణ లేదు

చాలా ఏళ్లుగా స్లాబ్స్ సవరణ లేదు

చాలా ఏళ్ళుగా స్లాబ్స్‌లలో సవరణ లేదు. పన్ను పరిమితులను కూడా పెంచలేదు. రిబెట్లు, మినహాయింపులు మాత్రమే ఇచ్చారు. ఈసారి రిబేట్ లాంటి ప్రత్యామ్నాయాలను కాకుండా నేరుగా పన్ను స్లాబ్స్‌లలో మార్పులు చేస్తే బాగుంటుందనేది ఆర్థిక నిపుణుల సూచన.

ఐదు స్లాబ్స్‌తో చాలామందికి ప్రయోజనం

ఐదు స్లాబ్స్‌తో చాలామందికి ప్రయోజనం

పన్నులను 5, 10, 20, 30, 35 శాతం స్లాబ్స్‌గా తీసుకు రావాల్సి ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం 5 శాతం, 20 శాతం, 30 శాతం స్లాబ్స్ ఉన్నాయి. ఆదాయాన్ని ఐదు స్లాబ్స్‌గా విభజిస్తే చాలామందికి ప్రయోజనంగా ఉంటుందని అంటున్నారు.

స్లాబ్ మార్చకుండా రూ.5 లక్షలకు పెంచితే...

స్లాబ్ మార్చకుండా రూ.5 లక్షలకు పెంచితే...

ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచవలసిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇది రూ.2,50వేలుగా ఉంది. రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను విధిస్తున్నారు. పన్ను వర్తించే ఆధాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు రూ.12,500 ప్రత్యేక రిబేట్ ఉంటుంది. దీంతో కొందరికి లాభం. కానీ ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచితే చాలామందికి పన్ను భారం తగ్గుతుందని అంటున్నారు.

పన్ను పరిమితి కాకుండా స్లాబ్స్ సవరించినా..

పన్ను పరిమితి కాకుండా స్లాబ్స్ సవరించినా..

ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచితే చాలామందికి ప్రయోజనమే. అయితే పన్ను పరిమితి పెంచకుండా స్లాబ్స్ సవరించినా చాలామందికి ప్రయోజనంగా ఉంటుందని అంటున్నారు.

రూ.7 లక్షల వరకు ఇస్తే...

రూ.7 లక్షల వరకు ఇస్తే...

ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఉంది. దీనిని రూ.7 లక్షలకు చేస్తారని అంచనా. అంటే రూ.7 లక్షల ఆదాయం వరకు 5 శాతం స్లాబ్‌లోకి వస్తుంది. బడ్జెట్‌లో ఈ ఊరట కలిగిస్తే ఎంతోమంది వేతనజీవులకు ఊరట.

స్లాబ్ మారిస్తే రూ.60వేలు ఆదా

స్లాబ్ మారిస్తే రూ.60వేలు ఆదా

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారికి ప్రస్తుతం 20 శాతం ఉండగా, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారికి 10 శాతం పన్ను ఉండవచ్చునని అంచనా. రూ.10 లక్షల నుంచి ఆ పైన ఆర్జించే వారికి కూడా స్లాబుల్లో మార్పులు ఉండాలని భావిస్తున్నారు. రూ.10 లక్షల లోపు ఆదాయం ఆర్జించే వారికి ప్రతి సంవత్సరం కనీసం రూ.60,000 వరకు పన్ను తగ్గుతుంది. రూ.15 లక్షల ఆదాయం ఉంటే రూ.1.10 లక్షలు, రూ.20 లక్షల ఆదాయం ఉంటే రూ.1.60 లక్షల పన్ను మిగులుతుంది.

English summary

బడ్జెట్ బొనాంజా: రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు? రూ.60వేలు ఆదా | Budget 2020: FM Nirmala Sitharaman may propose 5% tax on income up to Rs 7 lakh

With expectations of a significant income relief for the middle class rising, it appears Finance Minister Nirmala Sitharaman could meet them when she presents Union Budget 2020.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X