For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లి ఆధారంగా జగనన్న అమ్మఒడి: మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేయండి

|

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య దాదాపు ఖరారయింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 50.91 లక్షల మంది తల్లులకు జనవరి 9వ తేదీన రూ.15వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

అమ్మఒడికి దరఖాస్తు.. అర్హతలు: 75% హాజరు ఉంటేనే, తెల్లరేషన్ కార్డ్ లేకుంటే

కుటుంబంలో ఒకరికే వర్తిస్తుంది

కుటుంబంలో ఒకరికే వర్తిస్తుంది

ఒక కుటుంబంలో ఒకటి నుంచి ఇంటర్ వరకుచదివే పిల్లలు ఎందరు ఉన్నా ఒక్కరికే పథకం వర్తిస్తుంది. తల్లి ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 70.41 లక్షలు ఉన్నారు. కానీ ఇందులో ఇరవై లక్షల మంది తగ్గనున్నారు.

ఇలా గుర్తించారు

ఇలా గుర్తించారు

విద్యార్థులు, తల్లి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డుల వివరాలను ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రేషన్ కార్డులు ఉన్న వారి వివరాలను ఒక నివేదిక, రేషన్ కార్డు లేని వారు, కార్డు ఉండి ప్రభుత్వ ఆదాయం ఎక్కువ ఉన్న వారి వివరాలతో మరో జాబితాను రూపొందించారు. రేషన్ కార్డులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వారు 8 లక్షల వరకు ఉన్నట్లుగా తేలిందట. గ్రామ వాలంటీర్లతో వీరి వివరాలను పరిశీలించారు. ఇందులో అరవై వేల మందికి పైగా లబ్ధిదారులు తేలారు.

ఇందులో చెక్ చేసుకోవచ్చు..

ఇందులో చెక్ చేసుకోవచ్చు..

- అమ్మ ఒడి స్కీం వెబ్ సైట్‌లో అర్హత కలిగిన వారి జాబితాను చెక్ చేసుకోవచ్చు.

- jaganannaammavodi.ap.gov.in. వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.

- అందులో హోమ్ పేజీలో SEARCH CHILD DETAILS FOR AMMAVODI SCHEME అని ఉంటుంది.

- తల్లి లేదా గార్డియన్ ఆధార్ నెంబర్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత స్క్రీన్ పైన మీరు అర్హులా కాదా తెలుస్తుంది.

- https://ammavodihm3.apcfss.in/searchUidActionForm.htm

English summary

తల్లి ఆధారంగా జగనన్న అమ్మఒడి: మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేయండి | 50.91 lakh eligible for Jagananna Amma Vodi scheme

AMMA VODI Mothers Eligibility Status – Children Provisionally Selected Status Check. Steps to Check Jagananna Amma Vodi Eligible/Beneficiaries list 2019.
Story first published: Wednesday, December 25, 2019, 12:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X