For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?

|

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు రోజుకు కొన్ని లక్షలమందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ప్రయాణీకులు స్టేషన్లలో టిక్కెట్ తీసుకోవడంతో పాటు ముందస్తు టిక్కెట్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రయాణాలు, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తు బుకింగ్ తప్పనిసరి! సాధారణంగా ఒక IRCTC అకౌంట్ ద్వారా నెలకు 6 టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకోగలుగుతాం. కానీ ఒక అకౌంట్ నుంచి 12 టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

 గ్రామసచివాలయం: 15 ని.ల్లో పని పూర్తి.. 3 విభాగాలుగా 500 రకాల సేవలు గ్రామసచివాలయం: 15 ని.ల్లో పని పూర్తి.. 3 విభాగాలుగా 500 రకాల సేవలు

6 టిక్కెట్లు బుక్ చేసేందుకు అనుమతి...

6 టిక్కెట్లు బుక్ చేసేందుకు అనుమతి...

రైళ్లలో కుటుంబంతో సహా ప్రయాణించేవారు, సెలవుల కోసం స్నేహితులతో కలిసి వెళ్లేవాళ్లు, పండుగ సందర్భంగా ఫ్యామిలీతో వెళ్లేవాళ్లు ఎందరో. ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశం వెళ్లేందుకు నెలలో ఆరు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో సింగిల్ ట్రాన్సాక్షన్ పైన ఎక్కువ టిక్కెట్స్ బుక్ చేసుకునేందుకు ఇష్టపడతారు. కానీ సాధారణంగా ఒక వ్యక్తి IRCTC అకౌంట్ ద్వారా నెలలో గరిష్టంగా ఆరు టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకునేందుకు అనుమతిస్తారు.

ఇలా చేస్తే 12 టిక్కెట్లు..

ఇలా చేస్తే 12 టిక్కెట్లు..

అయితే ఆధార్ కార్డును IRCTC ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా ఒక వ్యక్తి గరిష్టంగా 12 రైల్వే టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ సంబంధిత IRCTC ఖాతాలో ఆధార్ కార్డు వివరాలను ధృవీకరించవచ్చు. సింగిల్ IRCTC అకౌంట్ ద్వారా 12 ట్రెయిన్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి.. టిక్కెట్లు బుక్ చేసే వ్యక్తి మరియు ప్రయాణీకుల జాబితాలోని వారిలో ఒక్కరి ఆధార్ అయినా వెరిఫై అయి ఉండాలి.

IRCTC

IRCTC

IRCTC ఈ-టిక్కెటింగ్ వెబ్‌సైట్ www.irctc.co.inలో ట్రెయిన్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి సదరు వ్యక్తి ప్రయాణీకుల మాస్టర్ జాబితాలో ధృవీకరించబడిన ప్రయాణీకులను నవీకరించాలి. ఆధార్ ధృవీకరించబడిన ప్రయాణీకులను బుకింగ్ సమయంలో మాస్టర్ జాబితాలో చేర్చవచ్చు. ఇతర ప్రయాణికుల పేర్లను మాస్టర్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవడం మరిచిపోవద్దు. అక్కడే వారి ఆధార్ కూడా వెరిఫై చేసుకోవచ్చు.

IRCTC - ఆధార్ లింక్ ఎలా?

IRCTC - ఆధార్ లింక్ ఎలా?

మొదట IRCTC అకౌంట్‌లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత My Account ట్యాబ్‌లో లింక్‌లో Link Your Aadhaar అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ OTP సాయంతో ఆధార్‌ను అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. ఆధార్ లింక్ అయ్యాక ఓ పాపప్ సందేశం వస్తుంది. తర్వాత అకౌంట్‌ నుంచి బయటకు వచ్చి మళ్లీ లాగిన్ కావాలి. ఇప్పుడు రైలు టికెట్స్ బుక్ చేసుకోవాలి.

English summary

IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా? | How to book 12 train tickets by 1 IRCTC account in a month

The IRCTC provides a facility under which individuals are allowed to book up to 12 train tickets in a month from a single IRCTC account.
Story first published: Thursday, October 3, 2019, 16:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X