For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారిన పాన్ - ఆధార్ కార్డు నిబంధనలు, కొత్త రూల్స్ ఇవే

|

న్యూఢిల్లీ: పాన్ కార్డు లేని వారు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఆధార్ కార్డును కూడా ఉపయోగించే వెసులుబాటును కల్పించారు ఇటీవలి బడ్జెట్‌లో. దేశంలో 120 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయని, కాబట్టి పాన్ కార్డ్ లేనివారు రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అనుగుణంగా ఆధార్ కూడా ఉపయోగించవచ్చునని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో పాన్ - ఆధార్ రూల్స్ మారిపోయాయి. అవేమిటో తెలుసుకుందాం....

LIC పాలసీదారులకు గుడ్‌న్యూస్, చెల్లింపుకు ఇలా చేయండి..LIC పాలసీదారులకు గుడ్‌న్యూస్, చెల్లింపుకు ఇలా చేయండి..

రూ.50,000కు మించి క్యాష్ ట్రాన్సాక్షన్

రూ.50,000కు మించి క్యాష్ ట్రాన్సాక్షన్

రూ.50,000కు మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు. ఇదివరకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉంది. అలాగే, ఐటీ రిటర్న్స్ వంటి చోట పాన్ కార్డు ఇప్పటి వరకు తప్పనిసరి. అలాంటి సమయాల్లోను ఆధార్ కార్డును ఉపయోగించవచ్చు.

అప్‌గ్రేడ్ చేయనున్న బ్యాంకులు

అప్‌గ్రేడ్ చేయనున్న బ్యాంకులు

బ్యాంకులు, ఇతర ఇనిస్టిట్యూషన్‌లలో పాన్ కార్డు తప్పనిసరిగా ఉన్నచోట్ల ఆధార్ కార్డు కూడా ఉపయోగించేలా బ్యాక్ఎండ్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు జారీ చేసినట్లు రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ వెల్లడించారు. పాన్ - ఆధార్.. ఈ రెండింట్లో ఏదైనా ఉపయోగించేలా మార్పులు చేస్తారు.

మ్యుచువల్ ఫండ్స్, బంగారం వంటి వాటిల్లో ఇన్వెస్ట్

మ్యుచువల్ ఫండ్స్, బంగారం వంటి వాటిల్లో ఇన్వెస్ట్

పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు పాన్ కార్డుకు బదులు ఆధార్ ఎక్కడైనా ఉపయోగించవచ్చు. మ్యుచువల్ ఫండ్స్, బంగారం తదితర వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

పన్ను చెల్లింపుదారులను మెరుగుపరచడం అలాగే, పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పాన్ బదులు ఆధార్ ఉపయోగించి బ్యాంకు నుంచి రూ.50వేలు విత్ డ్రా చేయవచ్చు.. డిపాజిట్ చేయవచ్చు. ఆధార్ కార్డుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి పాన్ కార్డ్ లేకుంటే ఇక నుంచి ఐటీ అధికారులే జారీ చేస్తారు. పాన్ లేకున్నా ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.

సుప్రీం కోర్టు ఆదేశాలు

సుప్రీం కోర్టు ఆదేశాలు

ఆధాయపన్ను చట్టం సెక్షన్ 139 AA (2) ప్రకారం పాన్ కార్డు తప్పనిసరి. ఆధార్ నెంబర్ లింక చేసుకోవాలి. ఈ అంశం కోర్టు దాకా వెళ్లడంతో లింకింగ్ గడువు సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు మాత్రం ఆధార్ తప్పనిసరి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఆధార్ ద్వారానే ఏటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.

రాజ్యసభ

రాజ్యసభ

ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్‌గా స్వచ్చంధంగా వినియోగించేలా రాజ్యసభ సోమవారం బిల్ (సవరణ) పాస్ చేసింది. వాయిస్ ఓట్ ద్వారా ఈ సవరణకు ఆమోదం తెలిపింది. నో యువర్ కస్టమర్ గైడ్‌లైన్స్‌లో భాగంగా బ్యాంకు అకౌంట్, మొబైల్ కనెక్షన్ వంటి వాటికి ఆధార్ ఉపయోగించేలా ఈ మార్పులు చేశారు. ఆధార్ అథంటికేషన్ లేకపోవడం వల్ల ఏ సేవలు తిరస్కరించలేదని చట్టం చెబుతోంది. ఆధార్ హోల్డర్ QR కోడ్ ద్వారా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను ఎంచుకోవచ్చు.

English summary

మారిన పాన్ - ఆధార్ కార్డు నిబంధనలు, కొత్త రూల్స్ ఇవే | Union Budget 2019: New Aadhaar, PAN Card rules you need to know to pay your income tax

Union Finance Minister Nirmala Sitharaman in her Budget speech last Friday had announced that taxpayers who don't own a PAN card can now file Income Tax returns with their Aadhaar Card also. Here's all you need to know about new Aadhaar, PAN rules.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X