For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు వివరాలు ఎలా మార్చుకోవాలి? ఇవి తెలుసుకోండి

|

ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం లేదా అప్‌డేట్ చేసుకోవడం లేదా ఆధార్ కార్డు వివరాలు సరిచేసుకోవడం చాలా సులభం. ఆన్‌లైన్‌లోనే ఆధార్ కార్డ్ అప్ డేట్స్‌ను UIDAI సులభతరం చేసింది. ఆధార్ కార్డ్ అప్ డేట్ లేదా ఆధార్ కార్డ్ కరెక్షన్ ఎలా చేసుకోవచ్చు. అయితే, మొబైల్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోయినా మార్చుకోవచ్చు. కానీ దీనికోసం మాత్రం ఆఫ్‌లైన్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ లింక్ చేయకుంటే ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) రాదు. ఇలాంటి సమయంలో మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

<strong>ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా.. 5 ముఖ్యమైన ఛార్జీలు తెలుసుకోండి?</strong>ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా.. 5 ముఖ్యమైన ఛార్జీలు తెలుసుకోండి?

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకుంటే ఆధార్‌కార్డుని ఎలా అప్‌డేట్ చేస్తారంటే

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకుంటే ఆధార్‌కార్డుని ఎలా అప్‌డేట్ చేస్తారంటే"?

1. మీకు దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లండి

2. అక్కడ మీరు ఆధార్ కరెక్షన్ లేదా అప్‌డేట్ ఫాం ( Aadhaar correction/updation) తీసుకోవాలి.

3. ఆ ఫాంలో అవసరమైన వివరాలు ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏం మార్పులు చేయాలనుకుంటున్నారో మెన్షన్ చేయాలి.

4. ఆధార్ కార్డుతో పాటు మీరు పూర్తి చేసిన ఫాంను సబ్‌మిట్ చేయండి. వీటితో పాటు పాన్ కార్డ్ లేదా ఓటరు కార్డు వంటి గుర్తింపు కార్డులు ఇవ్వవలసి ఉంటుంది.

5. ఆ తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కాన్, ఐరిస్ స్కాన్ ద్వారా వెరిఫికేషన్ ఉంటుంది.

6. మీకు రసీదును ఇస్తారు.

7. మీరు అడిగిన అప్‌డేట్స్ లేదా పేర్కొన్న సవరణలు 2 నుంచి 5 రోజుల్లో పూర్తవుతాయి.

ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి?

ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి?

ఆన్‌లైన్ ద్వారా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసే సౌకర్యాన్ని నిలిపివేశారు. మొబైల్ రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు ఆధార్ ఎన్‌రోల్ లేదా అప్‌డేట్ సెంటర్‌కు వెళ్లవలసిందే. ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అప్‌డేషన్‌కు 90 రోజుల సమయం పడుతుంది.

1. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి.

2. ఆధార్ కరెక్షన్ ఫాంను పూర్తి చేయాలి.

3. మీరు ఏ మొబైల్ నెంబర్‌ను లింక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్‌ను ఆ ఫాంలో రాయాలి.

4. ఆ ఫాంను సబ్‌మిట్ చేసి, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాలి.

5. రసీదును ఇస్తారు. ఈ రసీదులో మీరు అప్ డేట్ చేయాలనుకున్న మొబైల్ నెంబర్ (URN) ఉంటుంది.

6. URN ద్వారా మీ ఆధార్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

7. మొబైల్ నెంబర్ మారిన తర్వాత మీరు మరో ఆధార్ కార్డును తీసుకోవడం తప్పనిసరి కాదు.

8. ఓసారి మీ మొబైల్ నెంబర్ ఆధార్‌తో రిజిస్టర్ అయిందంటే.. అందుకు సంబంధించిన ఓటీపీలు ఈ ఫోన్ నెంబర్‌కు వస్తాయి.

 డీయాక్టివేట్ ఫోన్ నెంబర్‌ను ఎలా మార్చుకోవాలి?

డీయాక్టివేట్ ఫోన్ నెంబర్‌ను ఎలా మార్చుకోవాలి?

ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్‌ను మార్చుకోవచ్చు. డియాక్టివేట్ అయిన లేదా ప్రస్తుతం ఉపయోగిస్తూ ఎక్కువకాలం ఈ ఫోన్ నెంబర్ ఉపయోగించమని భావించి, మరో నెంబర్ మార్చుకోవాలని అనుకున్నా ఈ క్రింది స్టెప్స్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు.

1. ఆధార్ అప్ డేట్ లేదా కరెక్షన్ ఫాంను UIDAI నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.

2. ఆ ఫాంలో మీ మార్చుకోవాలనుకున్న మొబైల్ నెంబర్‌తో సహా అన్ని వివరాలు నింపండి.

3. అదే ఫాంలో మీ పాత మొబైల్ నెంబర్‌ను కూడా పేర్కొనవలసి ఉంటుంది.

4. అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేయండి.

5. వీటిని UIDAI ఫాంలో పేర్కొన్న అడ్రస్‌కు పోస్ట్ ద్వారా పంపించండి.

6. ఆ తర్వాత మీకు కన్‌ఫర్మ్ చేస్తూ మీకు మార్చుకున్న మొబైల్ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. ఎస్సెమ్మెస్ వచ్చే వరకు చూడండి. అప్ డేట్ అయినట్లుగా వస్తుంది.

 పోస్ట్ ద్వారా ఆధార్ సమాచారాన్ని ఎలా అప్ డేట్ చేసుకోవాలి?

పోస్ట్ ద్వారా ఆధార్ సమాచారాన్ని ఎలా అప్ డేట్ చేసుకోవాలి?

ఆధార్ కార్డులో కావాల్సిన మార్పులు లేదా అప్ డేట్‌ను పోస్ట్ ద్వారా చేసుకోవచ్చు. UIDAI కి రిక్వెస్ట్ లెటర్ పంపడం ద్వారా మార్పులు కోరవచ్చు. ఇందుకోసం ఇలా చేయాలి..

1. UIDAI నుండి ఆధార్ కార్డు అప్ డేట్ లేదా కరెక్షన్ ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. అవసరమైన వివరాలు నింపండి. మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారో వాటిని పేర్కొనాలి.

3. ఫోటోలు కూడా అటాచ్ చేయాలి.

4. ఆ తర్వాత దానిని UIDAI అడ్రస్‌కు పంపించాలి.

5. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలోని వారు...

UIDAI

పోస్ట్ బాక్స్ నెంబర్ 99,

బంజారాహిల్స్, హైదరాబాద్ 500034 అడ్రస్‌కు పంపించవచ్చు.

మొబైల్ నెంబర్ రిజిస్టర్ తర్వాత ఇతర వివరాల మార్పు

మొబైల్ నెంబర్ రిజిస్టర్ తర్వాత ఇతర వివరాల మార్పు

అందరు కూడా ఆధార్ కార్డు కోసం ముఖ్యంగా తమ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీలు ఇస్తారు. ఇందులో ఏవైనా మార్పులు కోరుకుంటే ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఇందుకు ఇలా చేయాలి...

1. UIDAI పోర్టల్‌లోకి వెళ్లండి. అక్కడి సూచనలను చదవండి.

2. Proceed బటన్ పైన క్లిక్ చేయాలి.

3. మీ 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయండి.

4. టెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. అది పూర్తయ్యాక ఓటీపీ లేదా టీవోటీపీ పైన క్లిక్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. అక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డు అకౌంట్లోకి వెళ్లండి

5. అడ్రస్ ఆప్షన్‌పై టిక్ చేసి Submit బటన్ క్లిక్ చేయండి.

6. ప్రూఫ్‌లో పేర్కొన్న మీ రెసిడెన్షియల్ అడ్రస్ పేర్కొనండి.

7. Submit Update Request బటన్ పైన క్లిక్ చేయండి.

8. మీరు అడ్రస్ మార్చుకోవాలనుకుంటే Modify పైన క్లిక్ చేయండి.

9. డిక్లరేషన్ పైన టిక్ చేసి, Proceed పైన క్లిక్ చేయండి.

10. అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ కోసం అవసరమైన లేదా పేర్కొన్న డాక్యుమెంట్ సెలక్ట్ చేసుకోండి. అడ్రస్ ప్రూఫ్‌కు సంబంధించిన స్కాన్ చేసిన కాపీని అప్ లోడ్ చేయండి. Submit బటన్ పైన క్లిక్ చేయండి.

11. ఇచ్చిన సమాచారం చదవండి. ఆ తర్వాత Yes పైన క్లిక్ చేయండి.

12. మీ వివరాలు వెరిఫై చేసేందుకు ఆ తర్వాత బీపీఓ సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత Submit పైన క్లిక్ చేయండి.

13. మీ రిక్వెస్ట్ ఓకే అవుతుంది. ఆ తర్వాత మీకు ఓ రసీదు పంపిస్తారు.

14. ఆ రసీదులో అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (URN) ఉంటుంది.

English summary

మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు వివరాలు ఎలా మార్చుకోవాలి? ఇవి తెలుసుకోండి | How to change Aadhaar details without a registered mobile number?

The process of applying for Aadhaar card or updating or correcting Aadhaar card details is quite simple. The process is made really simple by UIDAI through introducing the online method of Aadhaar card update.
Story first published: Sunday, April 7, 2019, 14:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X