For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్ను ఆదా కోసం చివరి నిమిషంలో పరుగు: రిస్క్ తగ్గించే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్

|

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆర్థిక (2019) సంవత్సరం ముగియడానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో సెక్షన్ 80సి కింద ఆదాయ పన్నులో కొంతమొత్తాన్ని ఆదా చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. పన్ను ఆదా పథకాలకు ప్రతి ఏటా మార్చి నెలలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అందరికీ కనిపించేవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్). సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈఎల్ఎస్ఎస్‌లో సేవ్ చేయడం ద్వారా 46,800 వరకు సేవ్ చేయవచ్చు. వీటిల్లో మార్చి నెలలో ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతుంటారు.

యథాతథంగా ఫెడ్ వడ్డీరేట్లు: నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వరమేనాయథాతథంగా ఫెడ్ వడ్డీరేట్లు: నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వరమేనా

ఈఎల్ఎస్ఎస్ పథకాలు

ఈఎల్ఎస్ఎస్ పథకాలు

పన్ను ఆదాతో పోటు మెరుగైన రాబడులకు ఈఎల్ఎస్ఎస్ పథకాలు ఎంతో అనువైనవిగా భావిస్తారు. భిన్న మార్కెట్ పరిమాణంతో కూడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఈ పథకాలకు సహజంగా ఉంటుంది. దీంతో అగ్రెసివ్ పథకాలు మిడ్, స్మాల్‌క్యాప్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తుంటాయి. అయితే మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‍‌లో ఆటుపోట్లు అధికంగా ఉంటాయని భావించేవారు, లార్జ్ క్యాప్‌కు ఎక్కువ ప్రధాన్యం ఇచ్చే ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఎంచుకోవచ్చు. నిర్వహణ ఆస్తుల్లో మూడింట రెండొంతులు లార్జ్ క్యాప్‌కు కేటాయించే మూడు పథకాలను వ్యాల్యూ రీసెర్చ్ సంస్థ తెలిపింది. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్, మోతీలాల్ ఓస్వాల్ లాంగ్ టర్మ్‌లు ఉన్నాయి.

యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీలో ఇలా

యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీలో ఇలా

పన్ను ఆదా చేసే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల విభాగంలో అత్యధిక ఆస్తులతో కూడిన భారీ పథకం యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ. రూ.17,600 కోట్ల పెట్టుబడులు ఈ ఒక్క పథకంలోనే ఉన్నాయి. 65-75 శాతం ఆస్తుల్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వె‍స్ట్‌ చేస్తుంది. 25-30 శాతం ఆస్తులను మిడ్ క్యాప్‌లో, మిగిలిన మేర స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో పెడుతుంది. పనితీరులో స్థిరత్వం ఉంది. తొమ్మిదేళ్ల కాలంలో బెంచ్‌ మార్క్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగం రాబడులతో పోలిస్తే ఈ పథకం ఒక్క సంవత్సరం మాత్రమే వెనుకబడింది. మిగతా అన్ని సంవత్సరాల్లోనూ అద్భుత పనితీరుతో ఉంది.ఐదేళ్ల పనితీరులో ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో​ మూడో స్థానంలో నిలిచింది. మూడేళ్లలో 14.5 శాతం, ఐదేళ్లలో 18.5 శాతం చొప్పున వార్షిక రాబడులను పంచింది.

 మరో రెండు పథకాలు

మరో రెండు పథకాలు

ఈఎల్ఎస్ఎస్ విభాగంలో స్థిరమైన పని తీరుతో కూడిన పథకం ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్. లార్జ్ క్యాప్స్ స్టాక్స్ అధికంగా కలిగిన పథకాల్లో ఇధి కూడా ఉంది. మూడేళ్లలో 15.1 శాతం, అయిదేళ్లలో 17.5 శాతం చొప్పున వార్షిక రాబడులు ఉన్నాయి. మూడోది మోతీలాల్ ఓస్వాల్ లాంగ్ టర్మ్. ఈఎల్ఎస్ఎస్ విభాగంలోకి ఆలస్యంగా వచ్చినందున ట్రాక్ రికార్డ్ కలిగిలేదు. కానీ ఈ పథకం వచ్చినప్పటి నుంచి రాబడులు మెరుగ్గా ఉన్నాయి. లార్జ్ క్యాప్‌కు 65-75 శాతం, మిడ్ క్యాప్‌కు 20 శాతం, స్మాల్ క్యాప్‍‌కు 4 శాతం మేర కేటాయించింది. మిరాయి అసెట్స్ ట్యాక్స్ సేవర్, మోస్ట్ ఫోకస్డ్ లాంగ్ టర్మ్, హెచ్‌డిఎఫ్‌సి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్, ప్రిన్సిపుల్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్, టాటా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి.

ఆఖరి గంటలో ట్యాక్స్ సేవింగ్స్ కోసం..

ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఉద్యోగులు, బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు మాత్రం ఇది మేజర్ డేట్. ఎందుకంటే పన్నులు చెల్లించడానికి, ట్యాక్స్‌ తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన పెట్టుబడులకు తేదీ దగ్గర పడ్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్ను ఆదా చేసుకునేందుకు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తారు. దీంతో పాటు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంకుల్లో ఐదేళ్ల పోస్టెడ్ డిపాజిట్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మీడియం రిస్క్‌తో బెస్ట్ రిటర్న్స్‌ ఇచ్చే అవకాశం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌కు మాత్రమేనని చాలామంది భావిస్తారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీటికి లాక్ ఇన్ పీరియడ్ కూడా మూడేళ్లు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌తో పోలిస్తే తక్కువ లాకిన్ పీరియడ్ ఉన్నది వీటికే. సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టొచ్చు. దీంతో ఆర్థిక సంవత్సరంలో రూ.46,800 వరకూ పన్నును ఆదా చేసుకోవచ్చు. అందుకే ఆఖరి నిమిషంలో చాలామంది ఈ ప్లాన్స్ తీసుకునే ఆలోచన చేస్తారు. మరింత స్పష్టమైన ప్రణాళిక కావాలంటే మీ దగ్గర్లోని ఫైనాన్షియల్ ప్లానర్ సలహాలు కూడా తీసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత వెనక్కి తీసుకోవాలంటే ఖచ్చితంగా మూడేళ్లు ఖచ్చితంగా ఆగాల్సిందే.

కాగా, అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ సహా మూడేళ్ల యావరేజ్ రిటర్న్స్‌ను పరిగణలోకి తీసుకుని చూస్తే ఓ ఐదు ఫండ్స్ బాగా పనితీరును కనబరుస్తున్నాయి. వాటిల్లో మిరే అసెట్ ట్యాక్స్ సేవర్, మోస్ట్ ఫోకస్డ్ లాంగ్ టర్మ్, హెచ్ డి ఎఫ్ సి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్, ప్రిన్సిపుల్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, టాటా ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఉన్నాయి. ఇవి యాభై శాతానికిపైగా రిటర్న్స్‌ను గత మూడేళ్ల కాలంలో ఇచ్చాయి.

English summary

పన్ను ఆదా కోసం చివరి నిమిషంలో పరుగు: రిస్క్ తగ్గించే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ | Last minute rush for tax saving? You can look at these ELSS funds

With just a few days left of the current financial year, many investors would be searching last minute for investment option under Section 80C to save on their income-tax outgo.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X