For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు ఖాతా బ‌దిలీ ఒక బ్యాంకు శాఖ‌ నుంచి మ‌రో శాఖ‌కు ఎలా?

కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా కొత్త బ్యాంకు ఖాతా తెరవడం సాధ్యం కాదు. పాత ఖాతానే కొనసాగించే వెసులుబాటు ఉంటే బాగుంటుందని చాలా మంది భావిస్తారు. అలాంటి వారికోసమే ఆర్‌బీఐ ఖాతా బదిలీ సదుపాయాన్ని ప్రవే

|

ఉద్యోగం మారిన‌ప్పుడో, బ‌దిలీ అయిన‌ప్పుడో కొత్త ప్రాంతానికి వెళ్లాల్సి వ‌స్తుంది. ఇలాంట‌ప్పుడు చాలా వాటికి అడ్ర‌స్‌లు మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ బ్యాంక్‌, ఇన్సూరెన్స్‌, మ్యూచువ‌ల్ ఫండ్‌లు ఇలా కాదు. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకే తీసుకుంటే ఒక్కోసారి కేవ‌లం ఆన్‌లైన్‌లో అడ్ర‌స్ అప్‌డేట్ చేస్తే ప‌రిపోదు. ఎందుకంటే హోం బ్రాంచీ కాక‌పోతే డిపాజిట్లు చేయాలంటే కూడా బ్యాంకులు ప‌రిమితులు విధిస్తున్నాయి. అలాగ‌ని కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా కొత్త బ్యాంకు ఖాతా తెరవడం సాధ్యం కాదు. పాత ఖాతానే కొనసాగించే వెసులుబాటు ఉంటే బాగుంటుందని చాలా మంది భావిస్తారు. అలాంటి వారికోసమే ఆర్‌బీఐ ఖాతా బదిలీ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

ఖాతా బదిలీకి సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాలు

ఖాతా బదిలీకి సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాలు

* ఒకే బ్యాంకులో ఒక శాఖ నుంచి మరో శాఖకు ఖాతాను మార్చుకోవచ్చు. ఒకసారి కేవైసీ నిబంధనల ప్రకారం తెరిచిన ఖాతాకు మళ్లీ అలాంటి ప్రక్రియ అవసరం లేదు.

* కొత్త చిరునామాకు సంబంధించి డిక్లరేషన్‌ను సమర్పించాలి.

బ్యాంకుల విధివిధానాలు

* ఖాతాల బదిలీకి సంబంధించి ఒక్కో విధానాన్ని పాటిస్తున్నాయి. బ్యాంకు వెబ్‌సైట్‌లో ఖాతా బదిలీ గురించి చూసి బ్యాంకు శాఖను సంప్రదించాలి.

* ఇదివరకే ఖాతా ఉన్న కేవైసీ పత్రాలు సమర్పించి ఉంటే, కొత్త శాఖలో వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదు.

* కొత్త శాఖకు ఖాతాను మార్చుకున్నా అకౌంట్ నంబరు, కస్టమర్ ఐడీ లాంటివి మారవు.

* ఖాతా బదిలీ సమయంలో దాదాపు అన్ని బ్యాంకులు పాత చెక్కు పుస్తకాలను వెనక్కు తీసుకుని, కొత్త చెక్కు పుస్తకాలను జారీ చేస్తున్నాయి.

* ఇంతకు మునుపు లాగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను కొనసాగించవచ్చు.

ఉమ్మడి ఖాతా విషయంలో ఖాతాదారులందరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది.

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా :

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా :

స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో ఖాతాల బదిలీకి సంబంధించి నిర్దిష్ట ఫారం ఏదీ లేదు.

స్థానిక శాఖలో తెల్ల కాగితంపై ఖాతా బదిలీ అభ్యర్థనను రాసి ఇవ్వాలి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు :

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు :

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు సంబంధించిన ఖాతాలను బదిలీ చేసుకునేందుకు నిర్దిష్ట ఫారం ఉంది. ఇది ఆన్‌లైన్‌లో సైతం లభ్యమవుతుంది. లేదా దగ్గరలో ఉన్న బ్యాంకు శాఖలో సైతం లభిస్తుంది. ఆ ఫారంను పూరించి ఖాతాను బదిలీ చేసుకోవాలనుకుంటున్న శాఖలో సమర్పించాలి. హెచ్‌డీఎఫ్‌సీలో ఖాతాదార్ల‌కు క‌స్ట‌మ‌ర్ ఐడీని కేటాయిస్తారు. ఒక‌సారి ఖాతా తెరిచి ఉంటే,మ‌ళ్లీ కొత్త ఖాతా తెరిస్తే దాన్ని ఆ క‌స్ట‌మ‌ర్ ఐడీతో అనుసంధానిస్తారు.

ఐసీఐసీఐ బ్యాంకు :

ఐసీఐసీఐ బ్యాంకు :

ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేసుకునేందుకు నిర్దిష్ట ఫారం ఉంది.

ఫారంను నింపి దానిని ఇదివరకూ ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో సమర్పించాలి.

కెనరా బ్యాంకు :

కెనరా బ్యాంకు :

కోర్ బ్యాంకింగ్ కలిగిన శాఖల ఖాతాదారులు బ్యాంకు శాఖ‌కు బదిలీ అభ్యర్థనను తెల్లకాగితంపై రాసి సమర్పిస్తే సరిపోతుంది. కోర్‌బ్యాంకింగ్‌ లేని శాఖల ఖాతాదారులు స్థానిక శాఖలో ఉన్న బదిలీ ఫారంను నింపి ఇవ్వాలి.

యాక్సిస్‌ బ్యాంకు :

యాక్సిస్‌ బ్యాంకు :

యాక్సి స్ బ్యాంకులో ఖాతా బదిలీ కొరకు స్థానిక శాఖలో ఉన్న ఫారంను నింపి ఇవ్వాలి. మ‌రిన్ని సందేహాలుంటే 18001035577 నంబ‌రులో క‌స్ట‌మ‌ర్లు సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఖాతా బదిలీ అభ్యర్థన‌ను బ్యాంకుకు సమర్పించిన తర్వాత వారం నుంచి రెండు వారాల్లోపు పూర్తవుతుంది.

ఆంధ్రా బ్యాంకు

ఆంధ్రా బ్యాంకు

ఈ కింది డాక్యుమెంట్ల‌ను సిద్దంగా ఉంచుకోవాలి. బ్రాంచీ మేనేజ‌ర్‌ను ఉద్దేశిస్తూ బ్యాంకు ఖాతా బ‌దిలీ కోసం అభ్య‌ర్థిస్తూ రాసిన లేఖ‌, ఏ ప్రాంతానికి మారుతున్నారో అక్క‌డి చిరునామా గుర్తింపు, పాన్ కార్డు కాపీ, బ్యాంకు పాస్ బుక్ న‌క‌లు వంటివి తీసుకుపోవాలి. బ్యాంకు పాస్ బుక్ ఒరిజిన‌ల్ తీసుకెళితే మంచిది. ఇది త‌ప్ప‌నిస‌రి కాదు. బ్యాంకు ఉద్యోగులు అడిగితే చూపాలి. వీట‌న్నింటితో మీ హోం బ్రాంచీకి వెళ్లాలి. అన్ని ఫారంల‌పైన సెల్ఫ్ అటెస్టేష‌న్ ఉండాలి. డాక్యుమెంట్ల‌న్నీ బ్యాంకు మేనేజ‌ర్‌కు స‌మ‌ర్పించాలి. సాధార‌ణంగా 1 నుంచి 3 రోజుల్లో ఖాతా బ‌దలాయింపు పూర్త‌వుతుంది.

Read more about: bajaj account savings account
English summary

బ్యాంకు ఖాతా బ‌దిలీ ఒక బ్యాంకు శాఖ‌ నుంచి మ‌రో శాఖ‌కు ఎలా? | How to transfer bank account from one branch to another

Some banks were insisting on opening of fresh accounts by customers when approached for transfer from one branch of the bank to another. "Such insistence on opening of fresh account or making the customer undergo full KYC process again causes inconvenience to them, resulting in poor customer service.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X