For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్‌ కార్డుకు−డెబిట్‌ కార్డుకు గల ప్ర‌ధాన తేడాలు

న‌వంబ‌రు 8న పెద్ద‌ నోట్ల ర‌ద్దు త‌ర్వాత కార్డుల‌, వాలెట్ల వాడ‌కం ఎక్కువ‌యింది. డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో చెల్లింపులు చేయ‌డం చాలా సులువైన వ్య‌వ‌హారం. అందుకే చాలా మంది కార్డులతో చెల్లింపుల‌కే మొగ్గు

|

న‌వంబ‌రు 8న పెద్ద‌ నోట్ల ర‌ద్దు త‌ర్వాత కార్డుల‌, వాలెట్ల వాడ‌కం ఎక్కువ‌యింది. డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో చెల్లింపులు చేయ‌డం చాలా సులువైన వ్య‌వ‌హారం. అందుకే చాలా మంది కార్డులతో చెల్లింపుల‌కే మొగ్గుచూపుతుంటారు. అయితే క్రెడిట్‌ కార్డుకు, డెబిట్‌ కార్డుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. డెబిట్‌ కార్డులు బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. నగదు విత్‌ డ్రాలకు, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(పీఓఎస్‌) చెల్లింపులకు డెబిట్‌ కార్డులు ఉపయోగపడతాయి.. బ్యాంకు ఖాతాతో ముడిపడినందున డబ్బు ఉంటేనే వాడటానికి వీలుంటుంది.

క్రెడిట్‌ కార్డుల విషయానికొస్తే ఇవి పొదుపు ఖాతాతో అనుసంధానమై ఉండవు. వీటితో చేసే కొనుగోళ్లు బ్యాంకు వద్ద అప్పు చేసి కొన్నట్లే భావించాలి. చేసిన ప్రతి కొనుగోలు లేదా పొందిన నగదుకు డెబిట్‌ కార్డు నేరుగా ఖాతా నుంచి నగదు మినహాయిస్తే, క్రెడిట్‌ కార్డు లావాదేవీల బిల్లులను ఖాతాదారులకు సమర్పించి నగదును మినహాయిస్తారు. క్రెడిట్‌ కార్డు విషయంలో రుణదాతకు ఖాతా నుంచి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. వీటికి నిర్ణీత గడువుంటుంది. ఆలోగా కట్టేస్తే ఎటువంటి వడ్డీలు, పెనాల్టీలు ఉండవు. క్రెడిట్‌ కార్డును ఉపయోగించుకుని ఏటీఎమ్‌ నుంచి నగదును పొందితే చాలా సంస్థలు తీసుకున్న రోజు నుంచే వడ్డీని అమలు చేస్తున్నాయి.

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డు .... మీ కోస‌మే...
సాధ్య‌మైనంత వ‌ర‌కూ డెబిట్ కార్డులు వాడ‌టాన్నే ప్రోత్స‌హించాలి. ఎందుకంటే ఆర్థిక ప‌రిస్థితి స‌మ‌తౌల్యంగా ఉండేందుకు ఇది తోడ్ప‌డుతుంది. క్రెడిట్ కార్డుల బిల్లు క‌ట్టేంత వ‌ర‌కూ మనం ఇంత ఖ‌ర్చు చేశామా అనే ఒక స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌కు రాలేరు. ఒక్కో కార్డులో వాటివైన అనుకూల‌త‌లు, ప్ర‌తికూల‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ ఏవి వాడాల‌నే ఆ అంశంలో తెలివిగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి.

Read more about: card transaction banking
English summary

క్రెడిట్‌ కార్డుకు−డెబిట్‌ కార్డుకు గల ప్ర‌ధాన తేడాలు | What is the Difference Between a Debit Card and Credit Card

On daily basis we use credit and debit cards to make payments, shopping withdrawal of money. The main feature of these cards is to access money and make payments when needed. Let us understand the basic difference between debit and credit cards.
Story first published: Saturday, December 31, 2016, 17:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X