For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డు.. మీ కోస‌మే...

|

ఒక‌ప్పుడు ధ‌న‌వంతులు మాత్ర‌మే ఆస‌క్తి చూపుతున్న క్రెడిట్ కార్డుల వాడ‌కం ప్ర‌స్తుతం మ‌ధ్య‌తర‌గ‌తిలో సైతం ఎక్కువైపోయింది. చెల్లింపుల‌కు న‌గ‌దు వాడ‌కం ఇష్టంలేని చాలా మంది డెబిట్‌,క్రెడిట్ కార్డుల సాయంతోనే చెల్లింపులు చేస్తున్నారు. ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల‌లో ఆఫ‌ర్లు ఆన్‌లైన్ పేమెంట్ సైట్లు క్రెడిట్ కార్డు ద్వారా జ‌రిపే కొనుగోళ్ల‌కు, చేసే చెల్లింపుల‌కు ఆఫ‌ర్లు, రాయితీలు క‌ల్పిస్తుండ‌టంతో క్రెడిట్ కార్డు వాడ‌కం సాధార‌ణ‌మైపోయింది. అయితే చిన్న విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు ముఖ్యం. అలా క్రెడిట్ కార్డుల‌కు సంబంధించి వార్షిక రుసుము గురించి అందరికీ తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు. క్రెడిట్ కార్డుల్లో అస‌లు వార్షిక రుసుమే లేని కొన్ని ఉత్త‌మ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

1) ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ కోర‌ల్ క్రెడిట్ కార్డ్‌

1) ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ కోర‌ల్ క్రెడిట్ కార్డ్‌

ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌పీసీఎల్ కోర‌ల్ క్రెడిట్ కార్డు మీ ఇంధ‌న(పెట్రోల్‌, డీజిల్‌) ధ‌ర‌లను క్యాష్ బ్యాక్ సాయంతో త‌గ్గించ‌డంతో పాటుగా ఫ్యూయెల్ స‌ర్‌చార్జ్ రాయితీల ద్వారా ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తుంది.

  • హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూ. 100 పై 5 పే బ్యాక్ పాయింట్లు వ‌స్తాయి.
  • రూ. 500 ఇంధ‌న కొనుగోళ్ల‌పై 2000 వ‌ర‌కూ పేబ్యాక్ పాయింట్ల‌ను వాడుకోవ‌చ్చు.
  • హెచ్‌పీసీఎల్ బంకుల్లో చేసే ఇంధ‌న కొనుగోళ్ల‌కు 2.5 క్యాష్‌బ్యాక్‌, 2.5 % స‌ర్‌చార్జ్ రాయితీ లాంటివి పొందే వీలుంది.
  • బుక్‌మైషోలో 2 సినిమా టిక్కెట్లపైన రూ. 100 వర‌కూ త‌గ్గింపు ఉంటుంది.
  • 800 రెస్టారెంట్ల‌లో క్యులిన‌రీ ట్రీట్స్ కోసం 15% వ‌ర‌కూ రాయితీలు పొందే అవ‌కాశం ఉంటుంది.
  • మొద‌టి ఏడాది వార్షిక రుసుము ఉండ‌దు. రెండో ఏడాది నుంచి రూ. 199* + సేవా ప‌న్ను ఉంటుంది.
  • ఎవ‌రైనా ఏడాది కాలంలో రూ. 50 వేల మించి క్రెడిట్ కార్డు బిల్లు చేస్తే ఆ త‌ర్వాతి ఏడాది వార్షిక రుసుము ఉండ‌దు
  •  2) హెచ్ఎస్‌బీసీ ప్లాటిన‌మ్ క్రెడిట్ కార్డ్‌

    2) హెచ్ఎస్‌బీసీ ప్లాటిన‌మ్ క్రెడిట్ కార్డ్‌

    కార్డు జారీ అయిన మొద‌టి 90 రోజుల్లో చేసే చెల్లింపుల‌కు 10 శాతం క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. ఇది కొన్ని ఎంపిక చేసిన కార్డుల‌కు మాత్ర‌మే. క‌నీసం రూ. 10 వేలు ఖ‌ర్చు చేసి ఉండాలి. గ‌రిష్ట క్యాష్ బ్యాక్ రూ. 3 వేలు మాత్ర‌మే. ఈ ఆఫ‌ర్ జ‌న‌వ‌రి 2016 నుంచి 31 డిసెంబ‌రు, 2016 వ‌ర‌కూ మాత్ర‌మే.

    ఈ క్రెడిట్ కార్డుకు ఎలాంటి ప్ర‌వేశ రుసుము, వార్షిక రుసుములు లేవు.

    3) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మ‌నీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌

    3) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మ‌నీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌

    బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేస్తే ఇది లైఫ్ టైమ్ ఫ్రీ కార్డు. వ్య‌క్తులు రివార్డు పాయింట్ల‌ను మ‌నీబ్యాక్ క్రెడిట్ కార్డులో క్యాష్ బ్యాక్ రూపంలో పొంద‌వ‌చ్చు.(100 రివార్డు పాయింట్లు రూ. 40 కి స‌మానం)

    మొద‌టి 90 రోజుల్లో రూ. 10 వేలు ఖ‌ర్చు పెడితే, మొద‌టి ఏడాది రుసుము వెన‌క్కి వ‌స్తుంది. రెన్యువ‌ల్ తేదీకి ముందే రూ. 50 వేలు ఖ‌ర్చు చేస్తే రెన్యువ‌ల్ రుసుము వెన‌క్కి వ‌స్తుంది.

    4) ఎస్‌బీఐ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డ్‌

    4) ఎస్‌బీఐ సింప్లీ సేవ్ ఎస్‌బీఐ కార్డ్‌

    మొద‌టి ఏడాది వార్షిక రుసుము రూ. 499 కాగా, 2000 బోన‌స్ పాయింట్ల ద్వారా రూ. 500 విలువ చేసే క్యాష్ బ్యాక్ వ‌స్తుంది.

    • త‌ర్వాతి ఏడాది నుంచి మీ మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు రూ. 75 వేల‌కు త‌గ్గితే రూ. 499 రుసుమును వ‌సూలు చేస్తారు.
    • దేశ‌వ్యాప్తంగా అన్ని పెట్రోలు బ్యాంకుల్లో సున్నా శాతం ఫ్యూయెల్ స‌ర్‌చార్జ్ ఉంటుంది.
    • ప్ర‌తి సారి ఇంధ‌నాన్ని నింపుకున్న త‌ర్వాత 2.5 శాతం ఫ్యూయెల్ స‌ర్‌చార్జీని వెనక్కి పొంద‌వ‌వ‌చ్చు.
    • డైనింగ్‌, సినిమాలు, డిపార్ట్‌మెంట‌ల్ స్టోర్స్‌, కిరాణా కొనుగోళ్లు వంటి వాటిపై 2.5 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది.
    • ప్ర‌తి లావాదేవీ పైన క్యాష్ పాయింట్ల‌ను రాబ‌ట్టుకోవ‌డంతో పాటు రివార్డుల‌ను రిడీమ్ చేసుకోవ‌చ్చు.
    •  5) యాక్సిస్ ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్‌

      5) యాక్సిస్ ఇన్‌స్టా ఈజీ క్రెడిట్ కార్డ్‌

      మీ క్రెడిట్ కార్డు ప‌రిమితిని మీరే నిర్ణ‌యించుకునే సౌల‌భ్యాన్ని పొందండి. ఎఫ్‌డీ అస‌లు విలువ‌లో 80 శాతం ప‌రిమితి వ‌ర‌కూ నిర్ణ‌యించే స్వేచ్చ కార్డు వాడ‌కం దారుకే ఉంటుంది. మొద‌టి రోజు నుంచి క్యాష్ విత్‌డ్రాయ‌ల్ స‌దుపాయం ఉంది.

      క్రెడిట్ కార్డు ద్వారా దేశంలో జ‌రిపే కొనుగోళ్ల‌కు ప్ర‌తి రూ. 200కు 6 పాయింట్ల‌ను గెలుచుకోవ‌చ్చు

      అంత‌ర్జాతీయంగా చేసే ఖ‌ర్చుల విష‌యంలో ప్ర‌తి రూ. 200కు 12 పాయింట్లు వ‌స్తాయి

      మొద‌టి ఆన్‌లైన్ లావాదేవీకి 100 పాయింట్ల‌ను పొందండి

      మీ పుట్టిన రోజు ఉన్న నెలలో రెండింత‌ల పాయింట్ల‌ను పొందే అవ‌కాశం

      మ‌న జీవ‌న శైలి బ‌ట్టి క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. మ‌న‌కు స‌రిగా ఉండే క్రెడిట్ కార్డును తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఇక్క‌డ ఇచ్చిన క్రెడిట్ కార్డుల స‌మాచారం కేవ‌లం అవగాహ‌న కోసం మాత్ర‌మే. క్రెడిట్ కార్డు తీసుకునేట‌ప్పుడు నియ‌మ‌, నిబంధ‌న‌ల‌ను జాగ్ర‌త్త‌గా చ‌దివి మంచి క్రెడిట్ కార్డు తీసుకోండి. దీర్ఘ‌కాలం కార్డును వాడేందుకు స‌మ‌యానికి చెల్లింపుల‌ను జ‌ర‌పండి.

English summary

వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డు.. మీ కోస‌మే... | 5 Best Credit Cards With No Annual Fees In India

Credit card concepts are like shop now and pay later. However, if you miss your payment date it may lead to shedding an extra amount on the bill. Individuals fail to avail credit card due to many fees and charges involved with them. Here are few best credit cards which do not attract the annual charge for the first year.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X