English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవ‌డం ఎలా?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ అంటే ఈపీఎఫ్ ఖాతాలో ఉండే నిల్వ‌. మీ వేత‌నంలో నుంచి నెల‌వారీగా మిన‌హాయించే డ‌బ్బుతో పాటు కంపెనీ జ‌మ‌చేసేదంతా మీ పీఎఫ్ ఖాతాలో ఉంటుంది. ఈ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవ‌డం ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి ఎంత డ‌బ్బు పొదుపు అవుతుంద‌నేది తెలుసుకోవ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధికి ఆ డ‌బ్బు స‌రిపోద‌ని భావిస్తే త‌గిన ప్ర‌ణాళిక వేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఏయే ప‌ద్ద‌తుల్లో మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవ‌చ్చో చూద్దాం.

1. మిస్‌డ్ కాల్ ద్వారా

1. మిస్‌డ్ కాల్ ద్వారా

మిసేడ్ కాల్ కోసం ఈ 011-22901406 number కి డైల్ చేసి మిసేడ్ కాల్ ఇస్తే ఈపీఎఫ్‌ఓ మీ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ నంబర్, పేరు, పుట్టిన తే ది వంటి వివరాలను ఎస్‌ఎంఎస్ చేస్తుంది. అప్పుడు మీరు మీ యూఏఎన్ నంబర్‌ను మీ ఆధార్ లేదా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనిని మీ సంస్థ చేస్తుంది. ఇలా అనుసంధాన ప్రక్రియ పూర్తైన తర్వాత మీరు మిస్‌డ్ కాల్ ఇచ్చిన ప్రతిసారీ ఈపీఎఫ్‌వో మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను తెలియజేస్తుంది.

2. మొబైల్ నుంచి సంక్షిప్త సందేశాల(మెసేజ్‌ల‌) ద్వారా

2. మొబైల్ నుంచి సంక్షిప్త సందేశాల(మెసేజ్‌ల‌) ద్వారా

మొబైల్ మెసేజ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు EPFHO అని టైపు చేసి స్పేస్ ఇచ్చి ACT అని టైపు చేసి కామా పెట్టిన తర్వాత UAN number ని 22 డిజిట్ PF నెంబర్ ని 7738299899 కి మెసేజ్ చేసి ఆక్టివేట్ చేస్కోవచ్చు. నెక్స్ట్ స్టెప్ EPFHO అని టైపు చేసి స్పేస్ ఇచ్చి UAN అని టైపు చేసి స్పేస్ ఇచ్చి ఈ ఎన్ జి అని ఎంటర్ చేసి పైన చెప్పిన నెంబర్ కి SMS పంపాలి. ఇప్పుడు బాలన్స్ వివరాలు SMS ద్వారా మీ సెల్ కి వస్తాయ్.

3. యూఏఎన్ ద్వారా

3. యూఏఎన్ ద్వారా

అన్నింటి కంటే స‌ర‌ళ‌మైన విధానం యూఏఎన్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్‌చేసుకోవ‌డం. యూఏఎన్ అంటే సార్వ‌త్రిక ఖాతా సంఖ్య‌. ప్ర‌తి సంస్థ త‌మ ఉద్యోగుల‌కు ఈ నంబ‌రును కేటాయించాలి. మీరు ఉద్యోగం మారినా ఈ సంఖ్య మార‌దు. ఒక‌సారి మీరు యూఏఎన్‌కు న‌మోదు చేసుకుని ఉంటే మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌రుకు పీఎఫ్ బ్యాలెన్స్ స‌మాచారం సంక్షిప్త సందేశాల్లో వ‌స్తుంది.

ఈ విధంగా చేయండి

1.https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ఓపెన్ చేయండి

2. యూఏఎన్ ఖాతా నంబ‌రు, పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయండి

3. మీ క్రెడెన్సియ‌ల్స్‌తో సైన్ ఇన్ అవండి.

4. అక్క‌డ ఉండే ట్యాబ్‌ల్లో డౌన్‌లోడ్ ఆప్ష‌న్‌ను ఎంచుకోండి.

5. పాస్ బుక్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీ పీఎఫ్ ఖాతా ప్ర‌స్తుత స్థితి మీకు తెలుస్తుంది.

4. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మొబైల్లో

4. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మొబైల్లో

ఆండ్రాయిడ్ app లో కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం http://www.epfindia.com కి వెళ్ళి download చేసుకోవ‌చ్చు. వెబ్‌సైట్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న త‌ర్వాత అందులో మెంబ‌ర్‌, పెన్ష‌న‌ర్‌, ఎంప్లాయ‌ర్ అనే మూడు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.

మెంబ‌ర్ ఆప్ష‌న్‌

మెంబ‌ర్ ఆప్ష‌న్‌

అందులో నుంచి మీరు దేనికి చెందితే ఆ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. సాధార‌ణంగా ఉద్యోగి అయి ఉండి ప్ర‌స్తుతం ఉద్యోగం చేస్తున్న‌ట్ల‌యితే మెంబ‌ర్(ఉద్యోగి) ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

బ్యాలెన్స్‌/ పాస్‌బుక్

బ్యాలెన్స్‌/ పాస్‌బుక్

అక్క‌డ యాక్టివేట్ యూఏఎన్, బ్యాలెన్స్‌/ పాస్‌బుక్ రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు బ్యాలెన్స్‌/ పాస్‌బుక్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

యాక్టివేటెడ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ఎంటర్ చేయడం ద్వారా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి పీఎఫ్ యూఏఎన్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేశారా?

ముగింపు

ముగింపు

ఈపీఎఫ్‌ఓ ప్రతి ఉద్యోగికీ యూఏఎన్‌ను కేటాయిస్తోంది. ఉద్యోగులు వారి సంస్థ నుంచి ఈ నంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈపీఎఫ్ సంబంధించి అన‌ధికార యాప్‌లు ఉన్నాయి. ప్లేస్టోర్‌లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేస్తే ఎమ్‌-ఈపీఎఫ్ అనేది క‌నిపిస్తుంది. ప‌వ‌ర్‌డ్ బై ఐఎస్‌-డివిజన్‌,ఈపీఎఫ్ ఇండియా అని ఉండేది మాత్ర‌మే ప్ర‌భుత్వం అధికారికంగా విడుద‌ల చేసిన యాప్ దీన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించుకోండి.డిజిట‌ల్ చెల్లింపుల‌కు న‌గ‌దు బ‌హుమానాలు

Read more about: pf, provident fund
English summary

How to check pf balance using UAN and in mobile

EPFO had taken giant steps in improving its benefit delivery methods and mechanisms. Leveraging Information technology, a host of measures were introduced for greater customer satisfaction. There are 4 different ways to check EPF balance.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC