ఇప్పుడు మీ యూఏఎన్ ఆధార్ సంఖ్యతో అనుసంధానం అయి ఉంటే ఈపీఎఫ్ఓ మీ క్లెయింలను త్వరగా పూర్తిచేస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం మారినప్పుడు సైతం చాలా సులువుగా ఉంటుంది.
దేశంలో పనిచేసే ఉద్యోగులందరికీ యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబరు లేదా సార్వత్రిక ఖాతా సంఖ్య) అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ డబ్బును బదలాయించుకోవడాన్ని(ట్రాన్స్‌ఫర్) యూఏఎన్ సులభతరం చేస్తుంది. ఆధార్ నంబరు సైతం ఇప్పుడు చాలా వాటికి అనుసంధానిస్తుండటం వల్ల దాని ప్రాముఖ్యత పెరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడు మీ యూఏఎన్ ఆధార్ సంఖ్యతో అనుసంధానం అయి ఉంటే ఈపీఎఫ్ఓ మీ క్లెయింలను త్వరగా పూర్తిచేస్తుంది. అంతేకాకుండా ఉద్యోగం మారినప్పుడు సైతం చాలా సులువుగా ఉంటుంది.
ఆధార్ ఆధారిత యూఏఎన్ ఉంటే కలిగే ప్రయోజనాలను కింద చూద్దాం.

1. నామినేషన్ ఆన్‌లైన్ అప్‌డేట్
మీరు యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకుని ఉంటే ఆన్‌లైన్‌లోనే ఎన్నిసార్లైనా నామినీని మార్చుకోవచ్చు. ఒకసారి ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేసిన తర్వాత దాన్ని ఉద్యోగి పనిచేసే సంస్థకు పంపిస్తారు.

2. డౌన్‌లోడ్ పాస్‌బుక్
ఒకసారి యూఏఎన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేసి ఉంటే, పీఎఫ్ వెబ్‌సైట్‌లో యూఏఎన్ లాగిన్ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా పీఎఫ్ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. http://uanmembers.epfoservices.in/
లాగిన్ అయిన తర్వాత డౌన్‌లోడ్ ట్యాబ్‌లో డౌన్‌లోడ్ పాస్‌బుక్‌ను నొక్కాలి.
పాస్‌బుక్ పీడీఎఫ్‌ను సైతం డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.

3. మీకు ఒకటి కంటే పీఎఫ్ ఖాతాలుంటే
ఒకటి కంటే ఎక్కువ పీఎఫ్ ఖాతాలున్నాసరే వాటన్నింటినీ యూఏఎన్‌తో లింక్ చేసుకోవాల్సిందిగా ఈపీఎఫ్ఓ కోరుతోంది. అదే విధంగా యూఏఎన్‌తో కేవైసీ వివరాలను సైతం అనుసంధానం చేయాలి.

4. కేవైసీ వివరాల అప్‌డేట్
మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ క్లిక్ చేయండి. అక్కడ 'అప్‌డేట్ కేవైసీ ఇన్ఫర్మేషన్' ను నొక్కండి. డాక్యుమెంట్లలో ఉన్న విధంగా సరైన పేరును ఎంటర్ చేయండి. అదే విధంగా రుజువుగా సమర్పిస్తున్న డాక్యుమెంట్ నంబరును పొందుపరచండి. స్కాన్‌డ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

5. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిం స్టేటస్
ఈపీఎఫ్ యూఏఎన్ మెంబర్ పోర్టల్‌లో సభ్యులైన వారు దీనికి అర్హులు. వీరంతా ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని ఎంచుకుంటే ఆ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు

6. వ్యక్తిగత వివరాల మార్పు
మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అయి మార్చుకోవచ్చు.
ఇందుకోసం ఎడిట్ మొబైల్ నం., ఎడిట్ ఈమెయిల్ ఐడీ ఆప్షన్లను ఉపయోగించాలి.

7. యూఏఎన్ కార్డ్ డౌన్‌లోడ్
లాగిన్ అయిన తర్వాత హోం పక్కన ఉన్న డౌన్‌లోడ్ ఆప్షన్‌లో ఈ ఆప్షన్ ఉంటుంది. అందులో 'డౌన్‌లోడ్ యూఏఎన్ కార్డు ' ను ఎంచుకోవడం ద్వారా మీ యూఏఎన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

8. ఇతరాలు
మీరు ఎప్పుడైనా మెంబర్ పోర్టల్‌లో యూఏఎన్ నంబరు గుర్తు ఉండి పాస్‌వర్డ్ మరిచిపోతే పాస్‌వర్డ్‌ను సత్వరమే రికవర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫర్‌గాట్ పాస్‌వర్డ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత యూఏఎన్ నంబరును, నమోదిత మొబైల్ నంబరును క్లిక్ చేస్తే మీ ఫోన్ నంబరులో పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేయడం ద్వరా మీరు మీ ఖాతాలో లాగిన్ అవ్వవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications