For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌) ద్వారా పంపిన డ‌బ్బు ల‌బ్దిదారుకు జ‌మ అవ‌క‌పోతే ఎలా?

|

దేశంలో ఎల‌క్ట్రానిక్ ప‌ద్ద‌తిలో డ‌బ్బు పంపే విధానంలో నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్(ఎన్ఈఎఫ్‌టీ) చాలా ప్రాముఖ్య‌త క‌లిగి ఉంది. ఆర్‌బీఐ ఉప సంస్థ అయిన ఎన్‌పీసీఐ ఆధ్వ‌ర్యంలో ఎన్ఈఎఫ్‌టీ ప‌నిచేస్తుంది. దీని ద్వారా బ్యాచ్‌ల వారీగా డ‌బ్బును ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తారు. సాధార‌ణంగా దీని కోసం 30 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. ఒక్కోసారి ల‌బ్దిదారుకు డ‌బ్బు జ‌మ‌య్యేందుకు ఎక్కువ స‌మ‌యం కూడా ప‌డుతుంది. కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల అరుదుగా డ‌బ్బు ల‌బ్దిదారు ఖాతాకు చేర‌క‌పోవ‌చ్చు.

national electronic fund transfer

ఎన్ఈఎఫ్‌టీ(నెఫ్ట్) విధానంలో డ‌బ్బు ల‌బ్దిదారుడికి చేర‌కపోతే ఏం చేయాలి?
ల‌బ్దిదారుడి ఖాతాలో డ‌బ్బు జ‌మ‌కాక‌పోవ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. అయితే నెఫ్ట్ లావాదేవీ విఫ‌ల‌మ‌య్యే సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. సాంకేతిక కార‌ణాల‌యినటువంటి ఐఎఫ్ఎస్ కోడ్ వివ‌రాలు త‌ప్పుగా ఉండ‌టం వంటి కార‌ణాలు ప్ర‌ధానంగా ఉండ‌వ‌చ్చు. లేదా బ్యాంకు ఖాతా వివ‌రాలు, పేరు త‌ప్పుగా ఉండొచ్చు.

సాధార‌ణంగా, ల‌బ్ధిదారుడి ఖాతాలో డ‌బ్బు జ‌మ కాలేదంటే నెఫ్ట్‌ను ఇనిషియేట్ చేసిన వారికి వెన‌క్కి తిరిగివ‌స్తుంది. బ్యాంకు ఖాతాకు డ‌బ్బు తిరిగి రాలేదంటే ఏదో త‌ప్పు జ‌రిగి ఉండి ఉండొచ్చు. దీని కోసం అన్ని మార్గాల‌ను అన్వేషించాలి.

ల‌బ్దిదారుడి ఖాతాకు డ‌బ్బు జ‌మ అవ‌కుండా, డబ్బు వెన‌క్కి తిరిగి రాని సంద‌ర్బంలో స‌ద‌రు బ్యాంకుకు చెందిన నెఫ్ట్ క‌స్ట‌మ‌ర్ ఫెసిలిటేష‌న్ సెంట‌ర్‌ను సంప్ర‌దించాలి.

బ్యాంకు శాఖ‌లోకి వెళ్లి నెఫ్ట్ కోసం అభ్య‌ర్థించి ఉండి నెఫ్ట్ లావాదేవీ విఫ‌ల‌మైతే, ఆ బ్యాంకు శాఖ వారే ఈ స‌మ‌స్య‌ను తీర్చ‌గ‌లిగే అవ‌కాశం ఉంటుంది. ఆ లావాదేవీ ఆన్‌లైన్‌లో వ్య‌క్తులే చేసి ఉంటే, బ్యాంకు మాతృశాఖ‌ను సంప్ర‌దించేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ఈ రెండు ద‌శ‌ల్లో స‌మ‌స్య ప‌రిష్కారం కాకుండా ఉండ‌టం దాదాపు అసాధ్యం. లబ్దిదారుడికి డ‌బ్బు చేర‌కుండా, మీకు రీఫండ్ రాక‌పోతే ఆ స‌మ‌స్య‌ను ఆర్‌బీఐ దృష్టికి తీసుకుపోవ‌చ్చు. ఇందుకోసం రిజ‌ర్వ్‌బ్యాంక్‌లో ప్ర‌త్యేకంగా నెఫ్ట్ డెస్క్ ఉంటుంది. వారు మీ స‌మ‌స్య‌ను తీర్చేందుకు సాయం చేస్తారు.
అందుకు సంబంధించిన చిరునామా: నేష‌న‌ల్ క్లియ‌రింగ్ సెల్‌, ముంబ‌యి ప్రాంతీయ కార్యాల‌యం, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబ‌యి
నెఫ్ట్ లావాదేవీ పూర్త‌య్యేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది?

నెఫ్ట్ లావాదేవీల‌న్నీ స్విఫ్ట్ ప‌ద్ద‌తిలో జ‌రుగుతాయి. ఇవి సాధార‌ణ ప‌రిస్థితుల్లో 15 నిమిషాల్లో పూర్త‌వుతాయి. ఒక్కోసారి గ‌రిష్టంగా 2 గంట‌ల వ‌ర‌కూ స‌మ‌యం తీసుకోవ‌చ్చు. ఎప్పుడో కానీ ఇలా జ‌ర‌గ‌దు. మామూలుగా అయితే 15 నిమిషాల నుంచి ఒక గంట‌లోపు ల‌బ్దిదారుడికి డ‌బ్బు ఖాతాలో జ‌మ అవుతుంది లేదా తిరిగి వ‌స్తుంది.

నెఫ్ట్ లావాదేవీ జ‌రిపేందుకు బ్యాంకులు రుసుములు వ‌సూలు చేస్తాయి. రూ. 10 వేల లోపు లావాదేవీకి రూ. 2.50 చెల్లించాల్సి ఉంటుంది. రూ. 10 వేల‌కు మించిన లావాదేవీల విష‌యంలో సైతం ఇది చాలా త‌క్కువ మొత్తంలో, డిమాండ్ డ్రాఫ్ట్ రుసుముల కంటే త‌క్కువ‌గా ఉంటుంది. బ్యాంకు శాఖ‌కు వెళ్లి అక్క‌డ నెఫ్ట్ కోసం అభ్య‌ర్థించే కంటే ఆన్‌లైన్‌లోనే నెఫ్ట్ లావాదేవీ పూర్తిచేయ‌డం సుర‌క్షితమే కాకుండా స‌మ‌యాన్ని ఆదా చేస్తుంది.

ల‌బ్దిదారుడికి డ‌బ్బు జ‌మ అయిన‌ట్లు మీరు ఎలా తెలుసుకోవ‌చ్చు?
ల‌బ్దిదారుడికి డ‌బ్బు జ‌మ అయిన విష‌యాన్ని బ్యాంకు ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ రూపంలో తెలియ‌జేస్తుంది. ఇందుకోసం ఖాతా తెరిచినప్పుడు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అల‌ర్ట్స్‌కు న‌మోదు చేసుకుని ఉండాలి. ఒక‌వేళ ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా స‌మాచారం అంద‌క‌పోతే ల‌బ్దిదారుడికి ట‌చ్‌లో ఉండి స‌మాచారాన్ని క‌నుక్కోవ‌డం మంచిది.

English summary

ఎన్ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌) ద్వారా పంపిన డ‌బ్బు ల‌బ్దిదారుకు జ‌మ అవ‌క‌పోతే ఎలా? | If NEFT Transaction is Failed, What We Have To Do

National Electronic Funds Transfer (NEFT) is transfer of funds online by a financial institution, mainly for the banks in India. NEFT is an electronic fund transfer system that operates on a Deferred Net Settlement (DNS) basis which settles transactions in batches. NEFT has no limit either minimum or maximum - on the amount of funds that could be transferred using NEFT.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X