For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF అకౌంట్ నుండి డబ్బులు తీసుకున్నారా? ఐటి రిటర్న్స్‌లో ఇది తప్పనిసరి!

|

2019-20 ఆర్థిక సంవత్సరంలో మీరు మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ నుండి డబ్బుని ఉపసంహరించుకుంటే మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉందనే అంశంతో సంబంధం లేకుండా ఈ మొత్తాన్ని పేర్కొనాలి.

FY20 ITR forms: ఐటీఆర్ ఫామ్‌లో ఈ ఏడాది కీలక మార్పులు.. ఇవీFY20 ITR forms: ఐటీఆర్ ఫామ్‌లో ఈ ఏడాది కీలక మార్పులు.. ఇవీ

ఇలాంటి సందర్భంలో ఉపసంహరణ

ఇలాంటి సందర్భంలో ఉపసంహరణ

రికగ్నయిజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ (RPF)కు సంబంధించి ఉద్యోగి అయిదేళ్ల పాటు సేవలు అందించిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తానికి మినహాయింపు ఉంటుంది. అలాగే ఉద్యోగి సేవలు అయిదేళ్ల లోపు ఉన్న సందర్భంలో అనారోగ్యం కారణంగా లేదా ఉద్యోగి సేవలు నిలిపివేయడం వల్ల ఉపసంహరించుకున్నట్లయితే ఉపసంహరణకు పన్ను మినహాయింపు ఉంటుంది. కరోనా నేపథ్యంలో ప్రావిడెంట్ ఫండ్ నుండి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏ ఉద్యోగి అయినా పీఎఫ్ అకౌంట్లోని 75 శాతం లేదా మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తం.. ఏది తక్కువైతే దానిని ఉపసంహరించుకోవచ్చు.

ఉపసంహరించుకోవచ్చు..

ఉపసంహరించుకోవచ్చు..

ఉదాహరణకు మీ ఖాతాలో రూ.1 లక్ష బ్యాలెన్స్ ఉంటే, అలాగే మీ ప్రాథమిక వేతనం ప్లస్ అలవెన్స్ రూ.20వేలుగా ఉంటే... మీరు రూ.60వేలు ఉపసంహరించుకోవడానికి అర్హులు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగి 5 సంవత్సరాల సేవను పూర్తి చేయకపోయినా కోవిడ్ రిలీఫ్ కింద ఉపసంహరించుకోవచ్చు. దీనికి పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఉపసంహరించుకున్న మొత్తాన్ని పేర్కొనాలని చెబుతున్నారు.

అసమతుల్యంగా ఉండకుండా..

అసమతుల్యంగా ఉండకుండా..

పన్ను చెల్లింపుదారు ఆదాయాన్ని ట్యాక్స్ డిపార్టుమెంట్ మ్యాప్ చేస్తే మినహాయింపు ఆదాయాన్ని ప్రకటించకుంటే అది అసమతుల్యంగా ఉంటుంది. మినహాయింపు ఆదాయాన్ని ట్యాక్స్ ఫాంలో చూపించేందుకు ప్రత్యేక కాలం ఉంది. కాబట్టి దానిని చూపించాలి. ట్యాక్స్ మినహాయింపు నేపథ్యంలో ఎలాంటి పెనాల్టీ ఉండదని చెబుతున్నారు. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ సెక్షన్ 10(12) కింద మినహాయింపు ఆదాయంలో భాగంగా పీఎఫ్ ఉపసంహరించుకోవాలి.

English summary

PF అకౌంట్ నుండి డబ్బులు తీసుకున్నారా? ఐటి రిటర్న్స్‌లో ఇది తప్పనిసరి! | Withdrawn money from EPF account? Remember to report it in your IT returns

In case you have withdrawn money from the employee's provident fund (EPF) during FY2019-20, you will have to report while filing your income tax returns. It is important to report the amount irrespective of the fact that the amount is tax exempt under certain conditions.
Story first published: Monday, November 30, 2020, 21:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X