For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC: డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీలు.. మార్పులు ఇలా! పాతవారికి నో టెన్షన్

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీల్లో కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తుంటుంది. పాలసీదారుల ప్రయోజనాలకు అనుగుణంగా IRDAI నియమ నిబంధనలు మారుస్తుంది. తాజాగా సంప్రదాయ, టర్మ్, యూనిట్ ఆధారిత బీమా, గ్రూప్ బీమా పాలసీల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. మన దేశంలో ఇన్సురెన్స్ వంటి ఆర్థిక పెట్టుబడి గురించి పట్టించుకునే వారి సంఖ్య ఇంకా తక్కువే. బీమా విస్తృతి పెంచేందుకు, పాలసీలను ఆకర్షణగా మార్చేందుకు IRDAI మార్గదర్శకాలు జారీ చేస్తుంటుంది. ఆరేళ్ల క్రితం 2013లో కీలక మార్పులు చేసింది. ఇప్పుడు మరోసారి కొత్త రూపు తీసుకు వస్తోంది. ఈ నేపథ్యంలో పాలసీల్లో పలు మార్పులు చోటు చేసుకోవచ్చు.

LIC షాక్: నవంబర్ 30 నుంచి ఎక్కువ బెనిఫిట్స్ కలిగిన ప్లాన్‌ల వెనక్కి, కారణమిదే!LIC షాక్: నవంబర్ 30 నుంచి ఎక్కువ బెనిఫిట్స్ కలిగిన ప్లాన్‌ల వెనక్కి, కారణమిదే!

పన్ను మినహాయింపు వద్దనుకుంటే...

పన్ను మినహాయింపు వద్దనుకుంటే...

ప్రస్తుత నిబంధనల మేరకు 45 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే చెల్లించిన ప్రీమియానికి 10 రెట్లు, 45 ఏళ్లు దాటిన వ్యక్తికి 7 రెట్ల వరకు బీమా ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే పాలసీల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రీమియానికి ఏడు రెట్ల వరకు బీమా తీసుకుంటే చాలు. అయితే పన్ను మినహాయింపు పొందాలంటే మాత్రం చెల్లించిన ప్రీమియానికి కనీసం 10 రెట్ల విలువైన పాలసీ ఉండాలి. పన్ను మినహాయింపు అవసరం లేదనుకుంటే మాత్రం 7 రెట్ల సెక్యూరిటీ పాలసీ తీసుకోవచ్చు. ఈ సమయంలో 5% టీడీఎస్ మినహాయించి మిగతాది చెల్లిస్తారు.

సరండర్ వ్యాల్యూ...

సరండర్ వ్యాల్యూ...

ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు, యూనిట్ ఆధారిత బీమా పాలసీలు కనీసం మూడేళ్లు ప్రీమియం చెల్లిస్తేనే వాటికి సరెండర్ వ్యాల్యూ లభిస్తుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే సంప్రదాయ పాలసీలకు కనీసం రెండేళ్లు ప్రీమియం చెల్లిస్తే సరెండర్ వ్యాల్యూ ఉంటుంది. రెండో ఏడాది 30 శాతం, మూడో ఏడాది 35 శాతం, నాలుగు, ఐదో ఏడాదిలలో 50 శాతం వరకు వెనక్కి వస్తుంది. యూనిట్ ఆధారిత పాలసీలలో ఏడాది వ్యవధి మాత్రమే ఉంది. చెల్లించిన ప్రీమియాన్ని పాలసీ తీసుకున్న తేదీ నుంచి అయిదేళ్ల తర్వాత మాత్రమే వెనక్కి వచ్చేలా నిబంధనల్లో మార్పులు చేశారు.

పాలసీ పునరుద్ధరణకు మరింత వెసులుబాటు

పాలసీ పునరుద్ధరణకు మరింత వెసులుబాటు

సంప్రదాయ, యూనిట్ ఆధారిత పాలసీలకు వరుసగా రెండేళ్ల పాటు ప్రీమియం చెల్లించకుంటే అవి ల్యాప్స్ అవుతాయి. వాటిని పునరుద్ధరించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు యూనిట్ ఆధారిత పాలసీలను మూడేళ్లకు, సంప్రదాయ పాలసీలను అయిదేళ్లకు పెంచారు. దీంతో పాలసీదారులకు లాభం చేకూరుతుంది. రెండు మూడేళ్ల పాటు డబ్బుల ఇబ్బందులతో ప్రీమియం చెల్లించలేని వారికి ఇది శుభవార్త.

ఇప్పటికే ఉన్న పాలసీదారులకు ఇబ్బంది లేదు

ఇప్పటికే ఉన్న పాలసీదారులకు ఇబ్బంది లేదు

IDRAI నిబంధనలు అన్ని బీమా సంస్థలకు వర్తిస్తాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే కొత్త నిబంధనలు.. కొత్త పాలసీలకే వర్తిస్తాయి. ప్రస్తుతం ఇన్సురెన్స్ సంస్థలు అందిస్తున్న పాలసీలకు పాత నిబంధనలు అలాగే ఉంటాయి. కాబట్టి పాత పాలసీలు ఉన్నవారికి ఎలాంటి చింతా లేదు. ఎల్ఐసీ తన జీవన్ ఆనంద్, జీవన్ లాభ్, జీవన్ లక్ష్య్, జీవన్ ఉమాంగ్ వంటి పాలసీలను కొత్తగా తీసుకు రానుంది. ఈ నేపథ్యంలో పాత పాలసీలను ఉపసంహరించుకోవచ్చు. కానీ పాత పాలసీలు అలాగే కొనసాగుతాయి.

English summary

LIC: డిసెంబర్ 1 నుంచి కొత్త పాలసీలు.. మార్పులు ఇలా! పాతవారికి నో టెన్షన్ | Why LIC plans to scrap high-yielding schemes from November 30

LIC will reportedly close more than two-dozen individual insurance products, eight group insurance schemes and seven eight riders from November 30.
Story first published: Wednesday, November 6, 2019, 14:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X