For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ అకౌంట్స్‌పై ఎక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులివే

|

బ్యాంకు ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వారందరికీ ప్రాథమికంగా సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. సేవింగ్స్ అకౌంట్ ఉంటే అందులో నగదు డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు ఎంత ఉంటుందో తెలుసా? ఆర్థిక అత్యవసర సమయంలో నిధుల లభ్యతను కోరుకునే పెట్టుబడిదారుల్లో చాలామంది సేవింగ్స్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేస్తారు.

స్వల్పకాలిక పెట్టుబడి లక్ష్యం కోసం మంచి పెట్టుబడి మార్గం దొరకని వారు కూడా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. అధిక వడ్డీని ఇచ్చే బ్యాంకు సేవింగ్స్ ఖాతాను ఎంచుకుంటే అధిక రాబడి ఉంటుంది. ఆర్బీఎల్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, యస్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.

బంధన్ బ్యాంకు

బంధన్ బ్యాంకు

బంధ‌న్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ 3 శాతం నుండి 6 శాతం వ‌డ్డీని అందిస్తోంది. ఎంత వ‌డ్డీ రేటు వర్తిస్తుందనే అంశం ఖాతాలో నిర్వ‌హించే బ్యాలెన్స్ పైన ఆధార‌ప‌డి ఉంటుంది. బంధ‌న్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం రోజువారి బ్యాలెన్స్ రూ. 1ల‌క్ష లోపు నిర్వ‌హించే వారికి 3 శాతం, రూ.1 ల‌క్ష నుండి రూ.10 ల‌క్ష‌ల లోపు నిర్వ‌హించేవారికి 4 శాతం, రూ.10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ నిర్వ‌హించే ఖాతాదారుల‌కు 6 శాతం వార్షిక‌ వ‌డ్డీని అందిస్తోంది.

ఆర్బీఎల్ బ్యాంకు

ఆర్బీఎల్ బ్యాంకు

ఆర్బీఎల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ పైన అధిక వ‌డ్డీ రేటును ఇస్తుంది. ఆర్బీఎల్ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం పొదుపు ఖాతాల‌పై 4.5 శాతం నుంచి 6.25 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది. రోజువారి బ్యాలెన్స్ రూ.1 ల‌క్ష లోపు ఉన్న ఖాతాదారులకు 4.5 శాతం, రూ.1 ల‌క్ష కంటే ఎక్కువ, రూ.10 ల‌క్ష‌ల లోపు ఉంటే 6 శాతం, రూ.10 ల‌క్ష‌లకు పైన ఉంటే 6.25 చొప్పున వార్షిక వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది.

యెస్ బ్యాంకు

యెస్ బ్యాంకు

యెస్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో నిర్వ‌హించే బ్యాలెన్స్ ఆధారంగా 4 శాతం నుండి 5.5 శాతం వ‌డ్డీ రేటును అందిస్తోంది. రోజు వారి బ్యాలెన్స్ రూ.1 ల‌క్ష లోపు నిర్వ‌హించే వారికి 4 శాతం, రూ.1 నుండి రూ.10 ల‌క్ష‌ల లోపు ఉంటే 4.75 శాతం, రూ.10 ల‌క్ష‌ల‌కు మించి రూ.100 కోట్ల లోపు రోజు వారి బ్యాలెన్స్ నిర్వ‌హించే ఖాతాలకు 5.5 శాతం చొప్పున వార్షిక వ‌డ్డీ రేటు ఉంది.

English summary

సేవింగ్స్ అకౌంట్స్‌పై ఎక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులివే | Want highest savings account interest rate? Try these 3 banks

Savings account interest rate is one important information that a bank depositor needs to become aware of. Those investors who want availability of funds at the time of financial emergency, keeping money in a bank savings account is still a good option for them.
Story first published: Thursday, June 10, 2021, 14:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X