For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాపారులకు గుడ్‌న్యూస్: డబ్బుల్లేకుండా వస్తువులు కొనొచ్చు, క్యాష్ బ్యాక్-రివార్డ్స్ కూడా

|

హైదరాబాద్: బెస్ట్ ప్రైస్ (Best Price) సభ్యుల కోసం వాల్‌మార్ట్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సోమవారం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకు వచ్చాయి. మోడర్న్ హోల్‌సేల్ B2B క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్ అయిన బెస్ట్ ప్రైస్ సభ్యుల కోసమే దీనిని లాంచ్ చేశారు. హైదరాబాదులోని శివరాంపల్లి బెస్ట్ ప్రైస్ స్టోర్‌లో ఈ కార్డును వాల్ మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేమెంట్స్ బిజినెస్ చీఫ్ పరాగ్ రావు విడుదల చేశారు.

'మోడీ అతిపెద్ద కలకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అడ్డంకి!''మోడీ అతిపెద్ద కలకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అడ్డంకి!'

50 రోజుల వరకు ఎప్పుడైనా చెల్లించవచ్చు

50 రోజుల వరకు ఎప్పుడైనా చెల్లించవచ్చు

ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై 18 రోజుల నుంచి 50 రోజుల వరకు ఎప్పుడైనా చెల్లింపులు చేయవచ్చు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న 27 హోల్‌సేల్ స్టోర్స్‌లలో ఒకేసారి దీనిని విడుదల చేసినట్లు వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. కిరాణా దుకాణదారుల కోసం ప్రత్యేకంగా ఈ కార్డు తెచ్చినట్లు తెలిపారు.

ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు

ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు

బెస్ట్ ప్రైస్ వినియోగదారులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశ్యంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్రిష్ తెలిపారు. ఈ కార్డు తీసుకున్న వారు ఎంతైనా షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. గత 13 నెలల కాలంలో వివిధ పట్టణాల్లో ఏడు కొత్త స్టోర్స్ ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 50 బెస్ట్ ప్రైస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఎక్కువగా వినియోగిస్తే క్యాష్ బ్యాక్

ఎక్కువగా వినియోగిస్తే క్యాష్ బ్యాక్

బెస్ట్ ప్రైస్‌లో సభ్యత్వం ఉన్న వ్యాపారులు ఎలాంటి మూలధన అవసరం లేకుండా వస్తువులు కొనుగోలు చేసేందుకు ఈ కార్డు సాయపడుతుంది. అలాగే, 18-50 రోజుల ఉచిత క్రెడిట్ సౌకర్యం లభిస్తుంది. దీనిని ఎక్కువగా వినియోగిస్తే క్యాష్ బ్యాక్ ఉంటుంది.

కొన్ని పరిమితుల మేరకు క్రెడిట్ కార్డ్స్

కొన్ని పరిమితుల మేరకు క్రెడిట్ కార్డ్స్

సిబిల్ రేటింగ్ ఉన్నవారితో పాటు లేనివారికి కూడా కొన్ని పరిమితుల మేరకు క్రెడిట్ కార్డులు అందిస్తున్నారు. స్టోర్స్‌తో పాటు బెస్ట్ ప్రైస్ ఆన్‌లైన్ సైట్‌లో కూడా వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఆయా స్టోర్లలో ఈ కార్డు కోసం హెచ్‌డీఎఫ్‌సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

రివార్డ్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు..

రివార్డ్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు..

ఈ కో-బ్రాండెడ్ కార్డుపై రివార్డ్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుందని HDFC బ్యాంకు ప్రతినిధి పరాగ్ రావు తెలిపారు. రెండు రకాలుగా లభించనున్న ఈ కార్డులపై ఏడాదికి రూ.500, రూ.1,000 వరకు ఫీజును వసూలు చేస్తున్నట్లు చెప్పారు.

English summary

వ్యాపారులకు గుడ్‌న్యూస్: డబ్బుల్లేకుండా వస్తువులు కొనొచ్చు, క్యాష్ బ్యాక్-రివార్డ్స్ కూడా | Walmart launches credit card in partnership with HDFC Bank

Walmart India, in partnership withHDFC Bank, on Monday launched a co-branded credit card exclusively for members of its Best Price Modern Wholesale "B2B Cash & Carry" stores, offering "free credit up to 50 days.
Story first published: Tuesday, December 3, 2019, 13:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X