For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభవార్త, హోమ్‌లోన్ వడ్డీ రేటును మరోసారి తగ్గించిన యూబీఐ

|

కస్టమర్లకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) గుడ్‌న్యూస్ చెప్పింది. కనీస హోమ్ లోన్ వడ్డీ రేటును 6.4 శాతానికి తగ్గింది. అంతకుముందు ఇది 6.8 శాతంగా ఉంది. పండుగ సీజన్ నేపథ్యంలో అన్ని రంగాలు కూడా దీనిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి. ఇప్పటికే పండుగ సీజన్‌లో వివిధ బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేటును దశాబ్దాల కనిష్టానికి తగ్గించాయి. ఇందులో భాగంగా యూబీఐ కూడా ఇదివరకు ఈ వడ్డీ రేటును 6.8 శాతానికి తగ్గించింది. తాజాగా మరోసారి మరో 40 బేసిస్ పాయింట్లు తగ్గించి, కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తాజాగా సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 27వ తేదీ నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆల్ టైమ్ కనిష్టం హోమ్ లోన్ వడ్డీ రేటు ఇది. కొత్తగా లోన్ తీసుకునే వారికి, ఇప్పటికే రుణాలు తీసుకొని, బ్యాలెన్స్ ట్రాన్సుఫర్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.

వడ్డీ రేటు తగ్గింపు

వడ్డీ రేటు తగ్గింపు

పండుగ సీజన్‌లో ఇళ్లు కొనుగోలు చేయడానికి పెరుగుతున్న డిమాండ్‌ను తాము గమనిస్తున్నామని, ఈ నేపథ్యంలో కస్టమర్లు ఈ ఆఫర్ నుండి ప్రయోజనం పొందుతారని, తగ్గిన ఈ వడ్డీ రేటుతో UBI హోమ్ లోన్ రేటు పరిశ్రమలో అత్యంత పోటీగా మారిందని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. పండుగ సీజన్‌లో కస్టమర్లకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఆలోచనతో పాటు హోమ్ లోన్స్‌కు మరింత డిమాండ్ తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ వడ్డీ రేటు తగ్గింపు కేవలం పండుగ సీజన్ కోసం మాత్రమే కాకుండా డిమాండ్ పెంచేందుకు అని బ్యాంకు తెలిపింది. వడ్డీ రేటు తగ్గింపు మార్జిన్స్ పైన ప్రభావం చూపుతుందని, అదే సమయంలో బిజినెస్ వ్యాల్యూమ్ పెరుగుతుందని తెలిపింది.

అన్ని బ్యాంకుల్లో 7 శాతం లోపే

అన్ని బ్యాంకుల్లో 7 శాతం లోపే

పండుగను దృష్టిలో పెట్టుకొని పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు హోమ్ లోన్ నుండి పర్సనల్ లోన్ వరకు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇతర రుణాల వడ్డీ రేట్లతో పోలిస్తే హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు ఎప్పుడు తక్కువగా ఉంటాయి. గతంతో పోలిస్తే వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టానికి తగ్గాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో రియాల్టీ మాత్రమే కాదు.. అన్నింటా డిమాండ్ పడిపోయింది. ఓ వైపు ఆర్థిక రికవరీ కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మరోవైపు పండుగ సీజన్ నేపథ్యంలో సేల్స్ పెంచుకోవడానికి, తద్వారా డిమాండ్ పెరగడానికి బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు వివిధ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, ఎల్ఐసీ హౌసింగ్, HDFC లిమిటెడ్, PNB హౌసింగ్, బజాజ్ ఫిన్ సర్వ్ వడ్డీ రేట్లను తగ్గించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరోసారి వడ్డీ రేటును తగ్గించింది. దాదాపు అన్ని బ్యాంకుల్లోను హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం దిగువనే ఉంది.

ఇది గుర్తుంచుకోండి

ఇది గుర్తుంచుకోండి

ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేటు పదిహేనేళ్ల కనిష్టం వద్ద ఉంది. వివిధ బ్యాంకులు పోటాపోటీగా వడ్డీ రేటును తగ్గించాయి. పండుగ సీజన్‌లో దాదాపు అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు 7 శాతానికి దిగువనే ఉంది. చాలా ఆర్థిక సంస్థలు ఇప్పటికే తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్నాయని, ఇంటి రుణం తీసుకోవాలనుకునే వారు ఈ పండుగ సీజన్‌లో బ్యాంకులు, ఎన్బీఎఫ్‌లలో సంప్రదించాలని సూచిస్తున్నారు. హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువగా ఉంది. అయితే ఈ వడ్డీ రేటు ఆయా ఆర్థిక సంస్థ ఆధారంగా, మీ క్రెడిట్ స్కోర్, నెలవారీ ఆదాయం, ఉద్యోగ ప్రొఫైల్, యజమాని ప్రొఫైల్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి హోమ్ లోన్ తీసుకోవాలని భావించేవారు వివిధ ఆర్థిక సంస్థల ఆన్‌లైన్ వెబ్ సైట్లను సందర్శించి, ఆఫర్లను పోల్చుకోవాలి. ఎందులో మీకు తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుందో తెలుసుకోవాలి. వివిధ ఆర్థిక సంస్థలు అందించే వడ్డీ రేట్లతో పాటు మీ క్రెడిట్, వేతన, ఉద్యోగ ప్రొఫైల్ ఆధారంగా ఎక్కడ మంచి డీల్ ఉందో చూసుకోవాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజులను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే, రుణ కాలపరిమితి మీ ఈఎంఐ, మొత్తం చెల్లింపు పైన ప్రభావం చూపుతుంది. ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే తక్కువ ఈఎంఐ ఉంటుంది. తక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే ఎక్కువ ఈఎంఐ వర్తిస్తుంది. ఉద్యోగి నెల ఆదాయంలో 50 శాతం లోపు రుణాలు ఇచ్చేందుకే బ్యాంకులు మొగ్గు చూపుతాయి. అందుకే దరఖాస్తు ఆన్‌లైన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి తెలుసుకోవాలి. ఈఎంఐ స్థోమత, అనివార్య ఆర్థిక లక్ష్యాలను పరిగణలోకి తీసుకొని అందుకు తగిన కాలపరిమితి లేదా ఈఎంఐ ఉండేలా చూసుకోవాలి.

English summary

శుభవార్త, హోమ్‌లోన్ వడ్డీ రేటును మరోసారి తగ్గించిన యూబీఐ | UBI cuts home loan rate to its lowest at 6.4 percent

Union Bank of India today announced a reduction in its home loan interest rates with a minimum interest rate starting from 6.40%.
Story first published: Wednesday, October 27, 2021, 9:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X