For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి

|

ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పై చదువులకోసం ఎడ్యుకేషన్ లోన్ అత్యుత్తమ మార్గం. విద్యా రుణం ద్వారా మీరు భారత్‌లో లేదా అంతర్జాతీయంగా ఎక్కడైనా చదువుకోవచ్చు. వివిధ బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి. బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్‌కు సంబంధించి ధృవీకరించబడిన కోర్సులు, సంస్థల జాబితాను ప్రచురిస్తాయి.

మీరు తీసుకోవాలనుకుంటున్న కోర్సు, మీరు వెళ్లే విద్యా సంస్థ బ్యాంకు డేటా బేస్‌లో ఉంటే మీ అర్హత ప్రమాణాల ఆధారంగా ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మార్కెట్లోను వడ్డీ రేట్లను పరిశీలించాలి. వడ్డీ రేట్లు 6.8 శాతం నుండి అందిస్తోన్న టాప్ 10 బ్యాంకులను ఇక్కడ తెలుసుకుందాం.

ఎడ్యుకేషన్ లోన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్

ఎడ్యుకేషన్ లోన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్స్

విద్యారుణం కోసం కొన్ని పత్రాలను బ్యాంకులకు ఇవ్వవలసి ఉంటుంది. అవేమిటంటే... గత విద్యాసంస్థల నుండిమార్క్ షీట్స్, విద్యార్థి వయస్సు ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అవసరం. మూడు నెలల శాలరీ స్లిప్. గత ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు. వ్యాలిడ్ వీసా.

పరిగణించే అంశాలు

పరిగణించే అంశాలు

విద్యా రుణం కోసం దరఖాస్తు చేసే సమయంలో పరిగణించవలసిన అంశాలు... పై చదువుల కోసం స్టడీ లోన్ కోసం విస్తృత డిమాండ్ ఉంది. అర్హత కలిగిన విద్యార్థులకు ఉన్నత విద్యను చదవడానికి అవసరమయ్యే రుణాలు బ్యాంకులు ఇస్తాయి. ఈ ఎడ్యుకేషన్ లోన్స్ విద్యార్థుల కెరీర్‌కు ఎంతో ఉపయోగపడతాయి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉపయోగపడతాయి. అయితే అందరూ ఈ రుణాలకు అర్హులు కాదు. రుణాల కోసం కొన్ని షరతులు ఉంటాయి.

- విద్యార్థి యొక్క అనుభవం, ఆధారాలు.

- గ్రేడ్స్, క్రెడిట్స్, సాధించిన ట్రాక్ రికార్డులు పరిగణలోకి తీసుకుంటారు.

- కోర్సు నిర్వహించే విద్యా సంస్థకు ప్రాధాన్యత కలిగి ఉండాలి.

- ఎంచుకునే విశ్వవిద్యాలయం లేదా కళాశాల ధృవీకరించబడినదై ఉండాలి. ప్రసిద్ధి చెందినదై ఉండాలి.

- రుణ సామర్థ్యాన్ని బ్యాంకు పరిగణలోకి తీసుకుంటుంది.

అలాంటి బ్యాంకులను ఎంచుకోవచ్చు

అలాంటి బ్యాంకులను ఎంచుకోవచ్చు

ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ద్వారా మీ ఈఎంఐ ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. రుణ దరఖాస్తు ఒకే అయితే, రుణ దరఖాస్తు ఫారంలోను అన్ని నిబంధనలు, షరతులు చదవాలి. అనుకోని పరిస్థితుల్లో మీరు చెల్లించలేని పరిస్థితి తలెత్తినప్పుడు ఈఎంఐ విరామం ఇచ్చే బ్యాంకులను ఎంచుకోవడం కాస్త ప్రయోజనకరం. మీకు రుణ మొత్తం చేతికి రాదు. ప్రతి సెమిస్టర్‌కు నేరుగా విద్యా సంస్థకు వెళ్తుంది.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.80, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 వడ్డీ రేటు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 వడ్డీ రేటు, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.85 వడ్డీ రేటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 వడ్డీ రేటు, పంజాబ్ నేషనల్ బ్యాంకు 6.90, IDBI బ్యాంకు 6.90 వడ్డీ రేటు, కెనరా బ్యాంకు 6.90 వడ్డీ రేటు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.05 వడ్డీ రేటు, ఇండియన్ బ్యాంకు 7.15 వడ్డీ రేటు ఉన్నాయి.

English summary

ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి | Top 10 Banks Offering The Cheapest Rates On Education Loans

An education loan is the most cost-effective way to obtain higher education without jeopardising the financial situation. You can finance your courses in India or abroad through an education loan.
Story first published: Sunday, March 21, 2021, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X