For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎం స్టాక్ ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? పుంజుకుంటుందా, భారీ కరెక్షనా?

|

మెగా ఐపీవో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ లిస్టింగ్ నేడు నిరాశపరిచింది. స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్ ఇష్యూ ధరను రూ.2150గా నిర్ణయించగా, 9 శాతం క్షీణించి రూ.1950 వద్ద లిస్ట్ అయింది. అలాగే, ఇష్యూ ధరతో 27 శాతం మేర నష్టపోయి రూ.1560 వద్ద ముగిసింది. పేటీఎం లిస్టింగ్ సమయంలో శర్మ ఉద్వేగానికి గురయ్యారు. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అతను కన్నీళ్ల పర్యంతమయ్యారు. యువ భారతం ఆశలు, ఆకాంక్షలను తాను స్టాక్ మార్కెట్‌కు తీసుకు వెళ్తున్నట్లుగా ఉందని, పదకొండేళ్లలో కోల్ నుండి ఫిన్ టెక్ వరకు భారత్ ఎంతో మార్పు చెందిందన్నారు. అయితే బలహీన లిస్టింగ్, స్టాక్ పైన కూడా శర్మ స్పందించారు. నేటి కంపెనీ షేర్ ధర కంపెనీ నిజమైన వ్యాల్యూను ప్రతిబింబించదని అభిప్రాయపడ్డారు.

ఆ ధర ఆ రోజుకు మాత్రమే

ఆ ధర ఆ రోజుకు మాత్రమే

నేటి షేర్ ధర లేదా ఏ రోజు షేర్ ధర అయినా తమ అవకాశాలకు, తమ కంపెనీ వ్యాల్యూను నిజంగా ప్రతిబింబించదన్నారు. ఇది కేవలం ఆనాటి లేదా ఆ సమయంలో (మార్కెట్ కొనుగోలు, అమ్మకం సమయం) కొనుగోలుదారు, విక్రేత అభిప్రాయం మాత్రమే అన్నారు. అంటే స్టాక్ మార్కెట్‌లో ఓ స్టాక్ కొనుగోలు ఆ సమయంలో కొనుగోలుదాలు, విక్రేత అభిప్రాయం మాత్రమే స్టాక్ వ్యాల్యూను ప్రతిబంబిస్తుందని, కానీ అది అసలు వ్యాల్యూ కాదన్నారు. పేటీఎం ఉత్పత్తి గురించి ప్రజలకు తెలిసినప్పటికీ కంపెనీ వ్యాపార నమూనాను వారు అర్థం చేసుకోలేకపోవచ్చునని చెప్పారు. తమ వ్యాపార నమూనాన అర్థం చేసుకోవడానికి ప్రజలకు కాస్త సమయం పడుతుందన్నారు. పేమెంట్ కంపెనీ నిర్మాణానికి ఇది కచ్చితమైన సమయంగా తాను భావిస్తున్నానని చెప్పారు. పేటీఎం చెల్లింపు పద్ధతిని ప్రారంభించినప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుందన్నారు. వ్యాపారం అంటే ప్రజలు నేర్చుకునేలా చేయడం తమ బాధ్యత అన్నారు.

వేచిచూడాలి

వేచిచూడాలి

రూ.2150 ఇష్యూ ధరగా ఉన్న పేటీఎం రూ.1950 వద్ద లిస్ట్ అయినప్పటికీ ఆ తర్వాత రూ.1560 స్థాయికి పడిపోయింది. లిస్టింగ్‌తో పోల్చినా, ఇష్యూ ధరతో పోల్చినా భారీగా క్షీణతతో ముగిసింది. ఈ స్టాక్ ఇష్యూనే భారీ ధరతో జారీ అయిందని, అందుకే ఆదరణ ఊహించినంతగా రాలేదని, ఇప్పటికే లిస్టింగ్ రోజునే భారీగా నష్టపోయిన స్టాక్, మరికొంత దిద్దుబాటుకు గురి కావొచ్చునని అంటున్నారు. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయడానికి మరికొంత కాలం వేచి చూడవచ్చునని సూచిస్తున్నారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉంటే, మరికొంత కాలం అట్టిపెట్టుకోవాలని, ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతానికి వేచి చూడాలని చెబుతున్నారు.

44 శాతం వరకు కరెక్షన్

44 శాతం వరకు కరెక్షన్

స్టాక్ ఇష్యూ రూ.2050తో పోలిస్తే భారీగా తగ్గి రూ.1950 వద్ద లిస్ట్ అయింది. నేటి ముగింపు సమయానికి దానిని కూడా నిలుపుకోలేక రూ.1560 వద్ద ముగిసింది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద 25 శాతం కంటే ఎక్కువగా నష్టపోయారు. ఐపీవో ధర నుండి 44 శాతం వరకు కరెక్షన్ ఉండవచ్చునని ఫారెన్ బ్రోకరేజీ ఫర్మ్ మకారీ అంచనా వేసింది.

English summary

పేటీఎం స్టాక్ ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? పుంజుకుంటుందా, భారీ కరెక్షనా? | Today's paytm share price not a true reflection of co's scale, will bounce back soon?

Even as shares of One97 Communications continued to trade sharply lower after a weak market debut, Paytm Founder Vijay Shekhar Sharma said that today's stock price is not a true reflection of the company's opportunity and scale.
Story first published: Thursday, November 18, 2021, 20:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X