మిడిల్ ఈస్ట్ టెన్సన్ మధ్య పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. స్టాక్ మార్కెట్లో వచ్చే వారం ఐపీఓల పండగ రాబోతోంది. మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారంలో భారతీయ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో మొత్తం నాలుగు కొత్త IPOలు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే తెరిచి ఉన్న రెండు IPOలలో కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా నాలుగు కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వనున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్‌లో చురుకుదనం కనిపించనుంది.ఈ వారంలో మూడు IPOలు మెయిన్‌బోర్డ్ విభాగంలో ఉండగా.. ఒకటి SME విభాగంలో ఉంటుంది.
రాజ్‌పుతానా స్టెయిన్‌లెస్ IPO: మెయిన్‌బోర్డ్ విభాగంలోకి వచ్చే ఈ IPO పరిమాణం సుమారు రూ. 254.98 కోట్లు. ఈ పబ్లిక్ ఇష్యూ మార్చి 9న ప్రారంభమై మార్చి 11న ముగుస్తుంది. ఒక్కో షేర్ ధర రూ. 116 నుంచి రూ. 122 మధ్య నిర్ణయించారు. పెట్టుబడిదారులు కనీసం 110 షేర్ల లాట్‌లో దరఖాస్తు చేయాలి. ఈ కంపెనీ షేర్లు మార్చి 16న BSE,NSE స్టాక్ ఎక్స్చేంజ్‌లలో లిస్ట్ అవుతాయని అంచనా.

ఇన్నోవిజన్ IPO: ఈ IPO మార్చి 10న ప్రారంభమై మార్చి 12న ముగుస్తుంది. కంపెనీ ఈ ఇష్యూ ద్వారా రూ. 322.84 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది*. ఒక్కో షేర్ ధర రూ. 521 నుంచి రూ. 548 మధ్య నిర్ణయించారు. కనీస లాట్ సైజు 27 షేర్లు. ఈ కంపెనీ షేర్లు మార్చి 17న BSE, NSEలో లిస్ట్ అవుతాయి.
అప్సిస్ ఏరోకామ్ IPO: ఇది SME విభాగానికి చెందిన IPO. ఈ ఇష్యూ మార్చి 11న ప్రారంభమై మార్చి 13న ముగుస్తుంది. కంపెనీ రూ.35.77 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఒక్కో షేర్ ధర రూ. 104 నుంచి రూ. 110 మధ్య ఉంటుంది. పెట్టుబడిదారులు కనీసం 1,200 షేర్ల లాట్‌లో పెట్టుబడి పెట్టాలి. ఈ షేర్లు మార్చి 18న NSE SMEలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
రాజ్‌మార్గ్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ IPO: ఈ ఇష్యూ పరిమాణం సుమారు రూ. 6,000 కోట్లు. ఇది మార్చి 11న ప్రారంభమై మార్చి 13న ముగుస్తుంది. ఒక్కో యూనిట్ ధర రూ. 99 నుంచి రూ. 100 మధ్య నిర్ణయించారు. ఈ కంపెనీ యూనిట్లు మార్చి 24న BSE, NSEలో లిస్ట్ అవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే తెరిచి ఉన్న IPOలు: కొత్తగా వచ్చే IPOలతో పాటు ప్రస్తుతం రెండు IPOలు ఇప్పటికే పెట్టుబడులకు అందుబాటులో ఉన్నాయి.
ఎల్ఫిన్ ఆగ్రో ఇండియా IPO: ఈ IPO మార్చి 5న ప్రారంభమై మార్చి 9న ముగుస్తుంది. కంపెనీ రూ. 25.03 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేర్ ధర రూ. 47. కనీస లాట్ సైజు 3,000 షేర్లు. ఈ IPO ఇప్పటికే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. కంపెనీ షేర్లు మార్చి 12న BSE SMEలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
శ్రీనిబాస్ ప్రధాన్ కన్స్ట్రక్షన్స్ IPO: ఈ IPO పరిమాణం రూ. 20.32 కోట్లు. ఇది మార్చి 6న ప్రారంభమై మార్చి 10న ముగుస్తుంది. ఒక్కో షేర్ ధర రూ. 91 నుంచి రూ. 98 మధ్య ఉంది. కనీస లాట్ సైజు 1,200 షేర్లు. ఇప్పటివరకు ఈ IPOకు 9 శాతం సబ్‌స్క్రిప్షన్ మాత్రమే లభించింది. కంపెనీ షేర్లు మార్చి 13న NSE SMEలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
వచ్చే వారంలో లిస్టింగ్ కానున్న కంపెనీలు: కొత్త వారంలో మొత్తం నాలుగు కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి.
అసిటెక్ ఈ-కామర్స్: మార్చి 9న NSE SMEలో లిస్టింగ్
SEDEMAC మెకాట్రానిక్స్: మార్చి 11న BSE మరియు NSEలో మెయిన్‌బోర్డ్ విభాగంలో లిస్టింగ్
ఎల్ఫిన్ ఆగ్రో ఇండియా: మార్చి 12న BSE SMEలో లిస్టింగ్
శ్రీనిబాస్ ప్రధాన్ కన్‌స్ట్రక్షన్స్: మార్చి 13న NSE SMEలో లిస్టింగ్
ఏదేమైనా మార్చి రెండో వారంలో భారతీయ ప్రైమరీ మార్కెట్ పెట్టుబడిదారులకు మంచి అవకాశాలను అందించబోతోంది. కొత్త IPOలు, లిస్టింగ్స్ కలిపి మార్కెట్‌లో మంచి చురుకుదనం కనిపించే అవకాశముంది. పెట్టుబడిదారులు కంపెనీల ఆర్థిక పరిస్థితులు, వ్యాపార మోడల్ మరియు మార్కెట్ పరిస్థితులను పరిశీలించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications