For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tips for Personal Finance: పర్సనల్ ఫైనాన్స్‌తో దీనిని ఎదుర్కోండి

|

కరోనా నేపథ్యంలో గత ఏడాది ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ పతనమైంది. కరోనా సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్, తాజాగా ఒమిక్రాన్ వంటివి వెలుగు చూస్తుండటంతో ఆర్థిక రికవరీపై ప్రభావం పడుతోంది. అయితే రికవరీ మందగించడం తప్ప, నెగిటివ్ ప్రభావం కనిపించడం లేదు. అంటే ఒమిక్రాన్ వెలుగుచూడటంతో రికవరీ కాస్త మందగించింది. గత ఏడాది కరోనా వెలుగు చూసిన తర్వాత వ్యక్తులకు పర్సనల్ ఫైనాన్సింగ్ అవగాహన పెరిగింది. పెట్టుబడుల కోసం ఆసక్తి చూపుతున్నారు. అలాగే లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ కొనుగోలు చేస్తున్నారు.

ద్రవ్యోల్భణ ప్రభావం

ద్రవ్యోల్భణ ప్రభావం

గవర్నమెంట్ ఫిస్కల్, మానిటరీ చర్యలు, భారీ ఖర్చులు, తక్కువ వడ్డీ రేట్లు అధిక ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపుతాయి. 2021 జూలై నెలలో ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ద్రవ్యోల్భణంతో పోలిస్తే ఇది రెండింతలు. దాదాపు నలభై ఏళ్లుగా ద్రవ్యోల్భణం అదుపులో ఉంది. అయితే ఈ కాలంలో కొనుగోలు శక్తి మాత్రం క్షీణించింది. మీ పర్సనల్ ఫైనాన్స్ చిట్కాలతో ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కోవచ్చు. ఇందుకు ఈ కింద కొన్ని అంశాలు చూడండి..

జీవనశైలి, ఖర్చు, పొదుపు అలవాట్లు

జీవనశైలి, ఖర్చు, పొదుపు అలవాట్లు

ద్రవ్యోల్భణాన్ని సాధారణంగా వినియోగదారు సూచీ లేదా సీపీఐ ద్వారా లెక్కిస్తారు. వినియోగదారులు వస్తువులు, సేవలకు గాను చెల్లించే ధరలలో కాలక్రమేణా సగటు మార్పును సీపీఐ సూచిస్తుంది. గణన సంక్లిష్టమైనప్పటికీ ఖర్చుల సగటును సూచిస్తుంది. ఇది మీ వ్యక్తిగత ద్రవ్యోల్భణం రేటుకు భిన్నమైనది. ఎందుకంటే మీ జీవనశైలి, ఖర్చు, పొదుపు అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి.

వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా

వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా

మీ పెట్టుబడి పోర్ట్‌‌పోలియోలో ద్రవ్యోల్భణానికి అనుకూలమైన పెట్టుబడులను చేర్చాలి. స్టాక్స్, ట్రెజరీ ఇన్-ఫ్లేషన్ ప్రొటెక్టెడ్ సెక్యూరిటీస్, ఐ-బాండ్స్, కమోడిటీస్ అండ్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కోవచ్చు.

గత 100 ఏళ్ల కాలంలో టాప్ యూఎస్ స్టాక్స్ ద్రవ్యోల్భణాన్ని సంవత్సరానికి దాదాపు ఏడు శాతం అధిగమించాయి. ఫుడ్, హెల్త్ ప్రొటెక్షన్, ఎనర్జీ, బిల్డింగ్ మెటిరీయల్ వంటి స్టాక్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రభుత్వం జారీ చేసే సెక్యూరిటీస్ ద్రవ్యోల్భణానికి అనుగుణంగా ఉంటాయి.

English summary

Tips for Personal Finance: పర్సనల్ ఫైనాన్స్‌తో దీనిని ఎదుర్కోండి | Tips for combating inflation with your personal finances

There's been a lot of discussion about inflation as we've seen the economy rebound in 2021.
Story first published: Thursday, December 9, 2021, 14:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X