For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిన్న బ్యాంకులో FD, RD, సేవింగ్స్ అకౌంట్ పైన అదిరిపోయే వడ్డీ రేటు

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా తొమ్మిదోసారి వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది. రెపో రేటు, రివర్స్ రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోయాయి. బ్యాంకుల నుండి రుణం తీసుకునే కస్టమర్లకు వడ్డీ రేట్లు తగ్గాయి. ఇది రుణగ్రహీతలకు ప్రయోజనకరం. అదే సమయంలో బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం వడ్డీ ప్రయోజనం తగ్గింది. ఏడాదిన్నరగా ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్ పైన వచ్చే వడ్డీ రేటు తగ్గింది.

అయితే కరోనా నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటం, ఆర్థిక రికవరీ వేగవంతం కావడంతో పలు బ్యాంకులు ఫిక్స్డి డిపాజిట్స్ వడ్డీ రేటును ఇటీవల స్వల్పంగా పెంచాయి. ప్రయివేటు దిగ్గజ బ్యాంకు HDFC, ఎన్బీఎఫ్‌సీలు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటివి వడ్డీ రేట్లను పెంచాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోను వడ్డీరేట్లు ఎక్కువగానే ఉన్నాయి. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను సవరించారు. ఈ బ్యాంకులో ఆకర్షణీయ వడ్డీ రేటు ఉంది. వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి....

సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేటు

సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేటు

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు డిసెంబర్ 1, 2021 నుండి సవరించారు. రూ.2 కోట్ల నుండి రూ.7 కోట్ల వరకు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ పైన ఈ బ్యాంకులో 7 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తున్నారు.

- Balance upto 1 Lac - 3.50%,

- Above 1 Lac to 5 Lacs - 3.50%,

Above 5 Lacs to 10 Lacs 3.50%,

- Above 10 Lacs to 25 Lacs 4.00%,

- Above 25 Lacs to 50 Lacs 4.00%,

- Above 50 Lacs to 1 Crore 4.50%,

- Above 1 Crore to 2 Crore 5.00%,

- Above 2 Crore to 5 Crore 7.00%,

- Above 5 Crore to 7 Crore 7.00%,

- 7 Crore and above 7.00%.

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు ఇలా ఉంది. 548 రోజుల నుండి 998 రోజుల కాలపరిమితిపై 6.75 శాతం వడ్డీ రేటు ఉంది.

- 7 days to 14 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 3.50%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 3.75%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 3.75% 4.00%,

- 15 days to 29 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 3.75%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 4.00%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.25%,

- 30 days to 90 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 4.25%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 4.50%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.75%,

- 91 days to 179 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 4.75%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 5.00%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.25%,

- 180 days to 269 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 5.50%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 5.75%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00%,

- 270 days to 364 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 5.50%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 5.75%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00%,

- 365 days to 547 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 5.75%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 6.00% 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.25%,

- 548 days to 729 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 6.25%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 6.75%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%,

- 730 days to 998 days రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 6.25%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 6.75%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%,

- 999 days and above రూ.25 లక్షల లోపు వడ్డీ రేటు 5.50%, రూ.25 లక్షల నుండి రూ.2 కోట్ల లోపు వడ్డీ రేటు 5.75%, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00%.

రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు

రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. గరిష్టంగా 18 నెలల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

- 6 months to less than 9 months - సాధారణ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,

- 9 months to less than 12 months - సాధారణ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,

- 1 year to less than 18 months - సాధారణ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.25%,

- 18 months to less than 2 years - సాధారణ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,

- 2 years to less than 3 years- సాధారణ వడ్డీ రేటు, 6.25% - సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,

- 3 years to 10 years - సాధారణ వడ్డీ రేటు 5.50%- సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు, 6.00%.

English summary

ఈ చిన్న బ్యాంకులో FD, RD, సేవింగ్స్ అకౌంట్ పైన అదిరిపోయే వడ్డీ రేటు | This Small Finance Bank Alters Interest Rates On FD, RD & Savings Account

The Monetary Policy Committee (MPC) chose to hold the repo rate at the existing pace, according to Governor Shaktikanta Das. Despite the fact that large banks, such as HDFC Bank, and NBFCs, such as Bajaj Finance Ltd, have already hiked interest rates on their fixed deposits ahead of today's bi-monthly monetary policy conference held today, small finance banks have also entered the queue.
Story first published: Thursday, December 9, 2021, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X