For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన 7% వరకు వడ్డీ రేటును అందిస్తున్న 3 బ్యాంకులు

|

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కావాలని భావించినప్పుడు, అలాగే హామీ ఇచ్చే రాబడికి ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను ఎంచుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై హామీ కలిగిన రాబడి, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ప్రయోజనంతో పాటు DICGC డిపాజిట్ సేఫ్టీ హామీ, అయిదు సంవత్సరాల దీర్ఘకాలిక డిపాజిట్స్ వంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్, వడ్డీ కాస్త తక్కువ అయినా హామీ కలిగిన రాబడిని చూసేవారు ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను ఎంచుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే మీరు పరిమిత కాలానికి మీ మొత్తాన్ని ఫిక్స్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు అయిదేళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే ఈ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి.

సింగిల్ పాన్ కార్డు కింద డిపాజిటర్ గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్ (డొమెస్టిక్, ఎన్నార్వో) చేయవచ్చు. కానీ ఎన్ఆర్ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ కాదు. అరవై ఏళ్లు దాటిన ఇండియన్ సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అదనంగా 0.50 శాతం వడ్డీ రేటు ఉంటుంది. వడ్డీ రేట్ల ఆధారంగా భారత్‌లో నాలుగు టాప్ 3 బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఇక్కడ చూడండి. అవి ప్రస్తుతం మార్కెట్లో పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఉత్తమ, అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.

These private sector banks giving upto 7 percent interest rate on FD

యస్ బ్యాంకు

రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై యస్ బ్యాంకు ఆగస్ట్ 5, 2021న వడ్డీ రేట్లను సవరించింది. తాజా సవరణతో ఏడు రోజుల నుండి 14 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేట్లు 3.25 శాతంగా ఉన్నాయి. పదిహేను రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.5 శాతం, 46 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 4 శాతం ఉంది. యస్ బ్యాంకు వడ్డీ రేట్లు...

- 7 to 14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75%,
- 15 to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,
- 46 to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,
- 3 months to - 6 months to - 9 months to - 1 year - 18 Months to - 3 Years to - 5 Years to

ఆర్బీఎల్ బ్యాంకు

ఆర్బీఎల్ బ్యాంకు రూ.3 కోట్లు, అంతకంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ పైన 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఏడు రోజుల నుండి 14 రోజుల కాలపరిమితిపై 3.25 శాతం, పదిహేను రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 3.75 శాతం, నలభై ఆరు రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 241 రోజుల నుండి 360 రోజుల కాలపరిమితిపై 5.25 శాతం, 12 నెలల నుండి 36 నెలల కాలపరిమితిపై 6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

- 7 to 14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75%,
- 15 to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,
- 46 to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,
- 91 days to 180 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,
- 181 days to 240 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50%,
- 241 days to 364 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- 1 year to 24 Months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.25%,
- 24 Months to 36 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,
- 36 months to 60 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- 60 months to 120 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25%.
- 120 months to 240 months - రెగ్యులర్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25%.
- ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ (60 నెలలు) - రెగ్యులర్ వడ్డీ రేటు 6.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం వడ్డీ రేటు.

ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేటు

రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేటు 2.50 శాతం నుండి 6.00 శాతం వరకు ఉంది.

- 7 to 14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3,
- 15 to 30 days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.25%,
- 31 to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,
- 46 to 60 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75%,
- 61 to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.4%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.9%,
- 91 to 120 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,
- 121 to 180 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.75%,
- 181 to 210 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.6%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.1%,
- 211 to 269 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,
- 270 to 354 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6%,
- 355 to 364 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6%,
- 1 year - 18 Months to - 1 Year 7 months to - 2 Year to 2 years 6 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.5%,
- 2 Year 6 months to 2 years 9 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.5%,
- above 3 years upto 61 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.5%,
- 61 months and above - రెగ్యులర్ వడ్డీ రేటు 5.5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,
- Indus tax saver scheme(5 years) - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.5%.

English summary

ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన 7% వరకు వడ్డీ రేటును అందిస్తున్న 3 బ్యాంకులు | These private sector banks giving upto 7 percent interest rate on FD

When it comes to seeking tax benefits under Section 80C of the Income Tax Act, guaranteed returns, deposit safety provided by DICGC, long-term deposits of 5 years, and so on, investing in a tax-saving fixed deposit is a good choice of investment vehicle under the debt category.
Story first published: Sunday, September 19, 2021, 16:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X