For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Home loans: అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకులివే

|

దాదాపు 16 బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ.75 లక్షలకు పైగా హోమ్ లోన్‌ను ఏడు శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకు అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లోను ప్రయివేటు రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు, ప్రభుత్వరంగ పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో వడ్డీ రేటు 6.65 శాతం మాత్రమే. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 6.95 శాతం, ప్రయివేటు రంగ దిగ్గజం HDFCలో హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంది.

తక్కువ వడ్డీ రేటు బ్యాంకుకు

తక్కువ వడ్డీ రేటు బ్యాంకుకు

ఇప్పటికే హోమ్ లోన్ తీసుకొని హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్న వారు కూడా తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుకు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా వారు తమ వడ్డీ రేటు భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ 1, 2019కి ముందు హోమ్ లోన్ తీసుకున్న వారికి ఇది ప్రయోజనం. ఎందుకంటే ఆ తర్వాత వడ్డీ రేట్లు తగ్గిపోయాయి.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

రూ.75 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంటే కనుక వడ్డీ రేట్లు, ఈఎంఐ ఇలా ఉండవచ్చు.

కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేటు 6.65 శాతం, ఈఎంఐ రూ.56,582.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు వడ్డీ రేటు 6.65 శాతం, ఈఎంఐ రూ.56,582.

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 6.75 శాతం, ఈఎంఐ రూ.57,027.

బజాజ్ ఫిన్ సర్వ్ వడ్డీ రేటు 6.75 శాతం, ఈఎంఐ రూ.57,027.

పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 6.80 శాతం, ఈఎంఐ రూ.57,250.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.85 శాతం, ఈఎంఐ రూ.57,474.

ఐడీబీఐ బ్యాంకు వడ్డీ రేటు 6.85 శాతం, ఈఎంఐ రూ.57,474.

బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.85 శాతం, ఈఎంఐ రూ.57,474.

కెనరా బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.

యూనియన్ బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.

యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.

యూకో బ్యాంకు వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.

టాటా క్యాపిటల్ వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీ రేటు 6.90 శాతం, ఈఎంఐ రూ.57,698.

రెండేళ్లలో ఎంత తగ్గిందంటే...

రెండేళ్లలో ఎంత తగ్గిందంటే...

కరోనా నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును భారీగా తగ్గించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా క్షీణించాయి. 2019 సెప్టెంబర్ సమాయానికి అతి తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.40 శాతంగా ఉండటం గమనార్హం. ఇప్పుడు అయితే ఏకంగా 6.49 శాతం నుండి 6.95 శాతం మధ్య ఉన్నాయి. అంటే వడ్డీ రేట్లు దాదాపు రెండు శాతం మేర తగ్గాయి. అంటే నాటి వడ్డీ రేట్లతో పోలిస్తే నేటి వడ్డీ రేట్ల వల్ల మొత్తం ఇరవై ఏళ్ల కాలంలో లక్షలు ఆదా అవుతుంది.

English summary

Home loans: అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకులివే | These Banks and HFCS are offering cheapest home loans

Interest rates start from 6.65 percent in Kotak Mahindra Bank for Rs 75 lakh home loan with a 20 year tenure.
Story first published: Wednesday, July 14, 2021, 22:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X