For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RDపై 8 శాతం వరకు వడ్డీ అందిస్తోన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులివే

|

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లపైన (FD) మాత్రమే కాదు, రికరింగ్ డిపాజిట్ల (RD) పైన కూడా అత్యధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. రికరింగ్ డిపాజిట్స్ అంటే ప్రతి నెల నిర్ణీత మొత్తం పెట్టుబడికి అవకాశం కల్పిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు. రికరింగ్ ప్రతి నెల కొంతమొత్తం చేస్తారు. ప్రధానంగా ప్రతి నెల కొంత మొత్తం సేవ్ చేయాలనుకునే వారు రికరింగ్ డిపాజిట్ వైపు మొగ్గు చూపుతారు. కనీసం రూ.100 నుండి సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా పైన చిన్న బ్యాంకులు అత్యధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.

ఆర్డీ పైన వడ్డీ రేటు

ఆర్డీ పైన వడ్డీ రేటు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 36 నెలల కాలపరిమితిపై రికరింగ్ డిపాజిట్ పైన అత్యధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 24 నెలల నుండి 36 నెలల కాలపరిమితిపై అత్యధికంగా 8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అత్యధిక కాలపరిమితి అయిదేళ్ల నుండి పదేళ్ల వరకు ఉంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో వీటిపై వడ్డీ రేటు కాస్త తక్కువ. 12, 15, 18, 21, 24 కాలపరిమితిలపై వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. మూడేళ్లు అలాగే, పదేళ్ల వరకు కాలపరిమితిపై వడ్డీ రేటు పైవిధంగానే ఉంది.

ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సుర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 36 నెలల నుండి 60 నెలల కాలపరిమితి రికరింగ్ డిపాజిట్స్ పైన అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది.

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెండేళ్ల కాలపరిమితిపై అత్యధికంగా 7.5 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వడ్డీ రేట్లు వివిధ కాలపరిమితిలపై 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉన్నాయి.

ఇవి గుర్తుంచుకోండి..

ఇవి గుర్తుంచుకోండి..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. అన్ని బ్యాంకుల నుండి కూడా ముందస్తుగా ఉపసంహరించుకోవచ్చు. కానీ ముందే తీసుకుంటే 1 శాతం పెనాల్టీ ఉంటుంది.

ఏదైనా బ్యాంకులో ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. చాలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కనీస కాల పరిమితి ఆరు నెలలు. గరిష్ట కాలపరిమతి పదేళ్లు. కనీస పెట్టుబడి రూ.100.

English summary

RDపై 8 శాతం వరకు వడ్డీ అందిస్తోన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులివే | Small finance banks offer up to 8 per cent rate on recurring deposit

Small finance banks not only offer higher interest rates on fixed deposits (FD), but also on recurring deposits (RD). Recurring deposits allow individuals to invest a fixed amount every month, whereas in a fixed deposit, a person invests a lump sum at one go.
Story first published: Monday, April 26, 2021, 15:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X