For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంగంలోకి ఆర్థిక శాఖ, శాశ్వత బాండ్స్ వ్యాల్యుయేషన్ ప్రమాణాలు సులభతరం

|

శాశ్వత బాండ్స్‌గా భావించే అడిషనల్ టైర్-1(AT-1) బాండ్స్ పర్పెచ్యువల్ బాండ్స్ వ్యాల్యుయేన్ కోసం కాలపరిమితిని 100 ఏళ్లుగా పరిగణించాలనే నిబంధనపై మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI) వెనక్కి తగ్గింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31, 2022 వరకు బేస్-3 ఏటీ-1 బాండ్స్ కాలపరిమితి పదేళ్లుగా ఉంటుందని, తర్వాత ఆరు నెలల్లో దానిని 20, 30 ఏళ్లకు పెంచుతామని తెలిపింది.

కొత్త నిబంధనలు

కొత్త నిబంధనలు

దీంతో ఏప్రిల్ 1, 2023 నుండి ఏటీ-1 బాండ్స్ కాలపరిమితి వంద సంవత్సరాలుగా ఉండనుంది. బేస్-III టైర్ 2 బాండ్స్ కాలపరిమితిని మార్చి 2022 వరకు పదేళ్లుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఒప్పందంలో పేర్కొన్న కాలపరిమితి కొనసాగుతుంది. ఏటీ-1 బాండ్స్ వ్యాల్యుయేషన్‌కు సంబంధించి కొత్త నిబంధనలను సెబి మార్చి 10న విడుదల చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రావాలి.

మ్యూచువల్ ఫండ్స్ అభ్యంతరం

మ్యూచువల్ ఫండ్స్ అభ్యంతరం

వంద ఏళ్ల నిబంధనపై మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పర్పెచ్యువల్ బాండ్స్ రీవ్యాల్యుయేషన్ వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని ఆందోళన చేశాయి. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ సమాఖ్య సెబిని సంప్రదించింది.

రంగంలోకి ఆర్థిక శాఖ

రంగంలోకి ఆర్థిక శాఖ

ఆ తర్వాత ఇది వివాదంగా మారింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగి పర్పెచ్యువల్ బాండ్స్ వ్యాల్యుయేషన్ కోసం జారీ చేసిన వందేళ్ల నియమాన్ని ఉపసంహరించుకోవాలని సెబిని ఆదేశించింది. వ్యాల్యుయేషన్ కోసం చేర్చిన ఆ నియమం తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని లేఖలో పేర్కొంది.

English summary

రంగంలోకి ఆర్థిక శాఖ, శాశ్వత బాండ్స్ వ్యాల్యుయేషన్ ప్రమాణాలు సులభతరం | Sebi eases valuation norms for perpetual bonds on FinMin push

Capital market regulator Sebi has eased valuation rule pertaining to perpetual bonds. The move comes after the finance ministry asked Securities and Exchange Board of India (Sebi) to withdraw its directive to mutual fund houses to treat additional tier-I (AT-1) bonds as having maturity of 100 years as it could disrupt the market and impact capital-raising by banks.
Story first published: Tuesday, March 23, 2021, 14:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X