For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ ఖాతాదారులకు భారీ ఊరట, అదనపు ఛార్జీ లేకుండా ఉపసంహరణ

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లు అదనపు ఛార్జీలు చెల్లించకుండానే మరింత నగదును ఉపసంహరించుకోవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తమ కస్టమర్లకు భారీ ఊరట కలిగించే నిర్ణయం ఇది. ఒకరోజులో ఖాతా నుండి నగదు ఉపసంహరణ పరిమితిని ఇటీవల పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం మీ పొరుగు శాఖకు వెళ్లి ఒకరోజులో ఉపసంహరణ ఫారం సహాయంతో రూ.25,000 వరకు తీసుకోవచ్చు. బ్యాంకు తెలిపిన వవరాల ప్రకారం ఉపసంహరణ ఫామ్ ద్వారా మరొక శాఖకు వెళ్లినప్పుడు కస్టమర్లు తమ సేవింగ్స్ ఖాతా నుండి రూ.25వేల వరకు ఉపసంహరించుకోవచ్చునని తెలిపింది.

అదే మరో శాఖ అయితే చెక్కు ద్వారా రూ.1 లక్ష వరకు తీసుకోవచ్చు. థర్డ్ పార్టీ నగదు ఉపసంహరణ పరిమితిని రూ.50వేలకు పెంచారు. ఈ కొత్త నిబంధనలు 30 సెప్టెంబర్ 2021 వరకు వర్తిస్తాయి. నగదు ఉపసంహరించుకునే కొత్త నిబంధనతో పాటు, బ్యాంకు కూడా షరతులను అమలు చేసింది. థర్డ్ పార్టీ ఉపసంహరణ ఫామ్ ద్వారా నగదును ఉపసంహరించలేరని ప్రకటనలో తెలిపింది. థర్డ్ పార్టీకి కేవైసీ అవసరం.

 SBI Customers Can Now Withdraw More Money Without Paying Extra Charges

ఎస్బీఐ తన రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలలో ఎనిమిది ఉచిత ట్రాన్సాక్షన్స్‌ను అందిస్తోంది. ఇందులో 5 ఎస్బీఐ ఏటిఎంలు, మరో మూడు బ్యాంక్ ఎటిఎంల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నాన్ మెట్రో నగరాల్లో పది ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. ఇందులో ఐదు ట్రాన్సాక్షన్స్ ఎస్బీఐతో పాటు మరో ఐదు ట్రాన్సాక్షన్స్ వేరే బ్యాంకుల ఏటీఎంల ద్వారా తీసుకునే సదుపాయం కల్పించింది.

English summary

ఎస్బీఐ ఖాతాదారులకు భారీ ఊరట, అదనపు ఛార్జీ లేకుండా ఉపసంహరణ | SBI Customers Can Now Withdraw More Money Without Paying Extra Charges

SBI Withdrawal limit per day: Now, SBI customers can withdraw Rs 25,000 cash per day for self using "withdrawal form" and accompanied by "savings bank passbook" at "non-home" branches.
Story first published: Monday, June 7, 2021, 8:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X