SBI పండుగ ఆఫర్, మూడ్రోజుల పాటు అదిరిపోయే క్యాష్ బ్యాక్
ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) విభాగం ఎస్బీఐ కార్డ్స్ పండుగ సీజన్‌లో తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దసరా, దీపావళి వంటి పండుగ సమయంలో బ్యాంకుల నుండి ఈ కామర్స్ కంపెనీలు, వివిధ దుకాణాల వరకు భారీ ఆఫర్లు ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఎస్బీఐ కార్డ్స్ యూజర్లకు ఆఫర్‌ను ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి పది శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పైగా ఏ ఈ-కామర్స్ సంస్థ నుండి కొనుగోలు చేసినా ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. మొబైల్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, హోమ్ డెకార్, కిచెన్ అప్లియెన్సెస్ ఇలా ఏ కేటగిరీలో వస్తువులు కొనుగోలు చేసినా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంతేకాదు, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే కొనుగోలు చేసే సమయంలోనే దీనిని ఎంచుకోవాలి.
ఈ పరిమితకాల ఆఫర్ అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమై 5వ తేదీన ముగుస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే వర్తిస్తుంది. ఆ మూడు రోజుల సమయంలో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కూడా కల్పిస్తామని వెల్లడించింది. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది. కస్టమర్లు తమ కొనుగోలుపై పది శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చునని తెలిపింది.

మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్, టీవీ, లార్జ్ అప్లియెన్సెస్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, హోమ్ ఫర్నీషింగ్, కిచెన్ అప్లియెన్సెస్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్, స్పోర్ట్స్ అండ్ ఫిట్ నెస్ వంటి వాటిపై ఆఫర్లు వర్తించినప్పటికీ, ఇన్సురెన్స్, ట్రావెల్, వ్యాలెట్, జ్యువెల్లరీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, యుటిలిటీ మర్చంట్స్ వంటి వాటి పైన మాత్రం ఆఫర్ వర్తించదు.