For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేటు తగ్గింపు: ఈ 3 బ్యాంకులు ఎంత తగ్గించాయంటే?

|

బ్యాంకులు వరుసగా సేవింగ్స్ డిపాజిట్లపై (SB) వడ్డీ రేటును తగ్గిస్తున్నాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI), ప్రయివేటురంగ ఐసీఐసీఐ బ్యాంకులు తమ SBలపై వడ్డి రేట్లు మరింత తగ్గించాయి. మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రెపో ఆధారిత వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలాగే జూలై 1వ తేదీ నుండి సేవింగ్స్ డిపాజిట్స్‌పై 3.25 శాతం వడ్డీని అందిస్తున్నట్లు తెలిపింది.

Covid 19తో పదేళ్ల దెబ్బ: అమెరికా పరిస్థితి దారుణం.. 2030 వరకు అంతేCovid 19తో పదేళ్ల దెబ్బ: అమెరికా పరిస్థితి దారుణం.. 2030 వరకు అంతే

SBI వడ్డీ రేటు కోత, మే 31 నుండి అమలు

SBI వడ్డీ రేటు కోత, మే 31 నుండి అమలు

సేవింగ్స్ ఖాతాల్లోని నిధులపై అందించే వడ్డీరేటును ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.7 శాతానికి పరిమితం చేసింది. ఇదివరకు 2.75 శాతంగా ఉంది. మే 31వ తేదీ నుండి ఈ కొత్త రేటు అమలులోకి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది. గత నెల 27వ తేదీ నుండి వివిధ కాలపరిమితుల డిపాజిట్లపై కూడా ఎస్బీఐ 40 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటును తగ్గించింది.

ఐసీఐసీఐ వడ్డీ రేటు కోత, జూన్ 4వ తేదీ నుండి అమల్లోకి

ఐసీఐసీఐ వడ్డీ రేటు కోత, జూన్ 4వ తేదీ నుండి అమల్లోకి

ఐసీఐసీఐ బ్యాంకు రూ.50 లక్షల లోపు మొత్తాలపై వడ్డీ రేటును 3.25 శాతం నుండి 3 శాతానికి తగ్గించింది. రూ.50 లక్షలకు పైన ఉన్న మొత్తాలపై 3.75 శాతం నుండి 3.5 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల 4వ తేదీ నుండి అమలులోకి వస్తాయి.

ఐసీఐసీఐ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు

ఐసీఐసీఐ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు

ఐసీఐసీఐ అన్ని కాలపరిమితులతో కూడిన రుణాలపై వడ్డీ రేట్లను కూడా 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్ 1వ తేదీ నుండి ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. దీంతో ఇండ్ల తనఖా, వాహన తదితర రుణాలపై వడ్డీ రేటు 7.70 శాతంగా ఉంటుంది. 6 నెలల వ్యవధి కలిగిన రుణాలపై 7.65 శాతం, 3 నెలల కాల పరిమితి రుణాలపై 7.50 శాతం, నెల రోజుల వ్యవధి కలిగిన రుణాలపై 7.45 శాతం చొప్పున వడ్డీ ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు రెపో ఆధారిత వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6.65 శాతానికి చేరుకుంది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఆ ప్రయోజనాన్ని కసమర్లకు పూర్తిగా బదలీ చేస్తున్నట్లు తెలిపింది. ఎంసీఎల్ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది.

అలాగే, జూలై 1వ తేదీ నుండి సేవింగ్స్ డిపాజిట్స్ పైన వడ్డీని 3.25 శాతం అందిస్తున్నట్లు తెలిపింది. మూడేళ్లకు లోపు వ్యవధితో ఉన్న రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.50 శాతం, 3 నుండి పదేళ్ల ఏళ్ళ వ్యవధి డిపాజిట్లపై 5.40 శాతం వడ్డీని ఇస్తున్నట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్లకు 75 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీని ఇస్తున్నట్లు తెలిపింది.

English summary

సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీరేటు తగ్గింపు: ఈ 3 బ్యాంకులు ఎంత తగ్గించాయంటే? | SBI and ICICI cut interest rates on savings deposit

On Tuesday, SBI and ICICI cut interest rates on savings deposit. The new interest rate regime will come into effect from Thursday.
Story first published: Wednesday, June 3, 2020, 8:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X