For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంజాబ్ నేషనల్ బ్యాంకు శుభవార్త: హోమ్, కారు వడ్డీ రేటు మరింత తగ్గింపు

|

ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పండుగ సమయంలో వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు శుభవార్త చెబుతున్నాయి. PNBబెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 0.05 అదనంగా తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 6.50 శాతానికి తగ్గింది. రెపో అనుసంధానిత వడ్డీ రేటును(RLLR) 6.55 శాతం నుండి 6.5 శాతానికి తగ్గించినట్లు బ్యాంకు ప్రకటనలో తెలిపింది. ఈ తగ్గింపు వడ్డీ రేట్లు ఈ నెల 8వ తేదీ నుండి అమల్లోకి వస్తున్నాయి. PNB హోమ్ లోన్, కార్ లోన్, స్టడీ లోన్, పర్సనల్ లోన్స్ పైన తాజా తగ్గింపు రేటు వర్తిస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీనే బ్యాంకు RLLRను 6.80 శాతం నుండి 6.55 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మరోసారి కస్టమర్లకు ఊరట కల్పించింది.

PNB ప్రయోజనాలు

PNB ప్రయోజనాలు

బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటు. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ఎలక్ట్రిక్/గ్రీన్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలలో భాగం పంచుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు తన EV, సీఎన్జీ వాహనాల పైన వడ్డీరేటును 6.65 శాతానికి తగ్గించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, PNB వన్ మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు ఈ ప్రయోజనం పొందవచ్చు. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఇల్లు, వాహనం, వ్యక్తిగత, బంగారం, ఆస్తి రుణాలపై సర్వీస్ ఛార్జీలు/ప్రాసెసింగ్ ఫీజులను కూడా రద్దు చేసింది.

రుణాలపై...

రుణాలపై...

PNB కారు లోన్స్ పైన వడ్డీ రేటును 6.65 శాతం కనిష్టానికి తగ్గించింది. హోమ్ లోన్ వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గించింది. అయితే వాహన వడ్డీ రేటు విషయానికి వస్తే ఈవీ, సీఎన్జీ వాహన వడ్డీ రేటు 6.65 శాతం, ఇతర కార్ల వడ్డీ రేటు 6.75 శాతం నుండి ప్రారంభమవుతుంది. పర్సనల్ హోమ్ లోన్ వడ్డీ రేటు ఐదు బేసిస్ పాయింట్లు తగ్గి 8.90 శాతం వద్ద ఉంది. అలాగే పర్సనల్ హోమ్ లోన్ పరిమితిని రూ.20 లక్షలకు, 72 నెలలకు రివైజ్ చేసింది. అక్టోబర్ 2019లో RLLRను ఇంట్రొడ్యూస్ చేసింది.

వివిధ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటు

వివిధ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటు

కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి, హోమ్ లోన్ ట్రాన్సుఫర్ చేసుకునే వారికి పలు బ్యాంకులు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్స్‌ను అందిస్తున్నాయి. రుణగ్రహీత కనీసం 650 నుండి 700 క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద వివిధ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. సెక్షన్ 24 ప్రకారం ఏడాదికి రూ.2 లక్షల పన్ను ప్రయోజనం ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ట్యాక్స్ డిడక్షన్ ఉంది. సెక్షన్ 80ఈఈ ప్రకారం రూ.50,000 వరకు మినహాయింపు ఉంది.

English summary

పంజాబ్ నేషనల్ బ్యాంకు శుభవార్త: హోమ్, కారు వడ్డీ రేటు మరింత తగ్గింపు | Punjab National Bank cuts benchmark lending rate to 6.50 percent

State owned Punjab National Bank on Wednesday announced a cut in its benchmark lending rate by 5 basis points to 6.50 per cent.
Story first published: Friday, November 5, 2021, 9:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X