For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలో చేతికి రూ.16 లక్షలు

|

ఇంట్లో కూర్చొని, మీ వద్ద ఉన్న పెట్టుబడితో మంచి రాబడిని పొందాలని భావిస్తున్నారా? తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ పథకాలు చాలా ఉన్నాయి. పలు పోస్టాఫీస్ పథకాల్లో రిస్క్ తక్కువ, రాబడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పెట్టుబడుల్లో ఒకటి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్. పెట్టుబడి అంటే వ్యాపార సంబంధిత పదం. లాభం లేదా ఫలితం కోసం కొంత మొత్తాన్ని ముందుగానే ఇన్వెస్ట్ చేయడం. రాబడి కోసం ముందస్తుగా పెట్టే మొత్తాన్ని పెట్టుబడి అంటారు. బ్యాంకులు, స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, క్రిప్టో మార్కెట్.. ఇలా వివిధ రకాల పెట్టుబడులు ఉన్నాయి.

పోస్టాఫీస్ ఆర్డీ పథకం

పోస్టాఫీస్ ఆర్డీ పథకం

పోస్టాఫీస్ RD డిపాజిట్ అకౌంట్ ద్వారా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, అధిక వడ్డీ రేటుతో మంచి రిటర్న్స్ పొందవచ్చు. మీరు కనీసం రూ.100 మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. RD డిపాజిట్ అకౌంట్ పరిమితి అయిదు సంవత్సరాలు. బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కాలపరిమితి ఆరు నెలలు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీని లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని అకౌంట్ హోల్డర్ ఖాతాలోకి జమ చేస్తారు.

వడ్డీ రేటు ఎంత

వడ్డీ రేటు ఎంత

ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పైన 5.8 శాతం వడ్డీ రేటు ఉంది. ప్రతి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును సవరిస్తుంది. అన్ని పోస్టాఫీస్ సేవింగ్స్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు సవరిస్తుంది.

లక్షల రాబడి

లక్షల రాబడి

ఉదాహరణకు ఈ స్కీంలో మీరు ప్రతి నెల రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత మీకు రూ.16 లక్షలు వస్తుంది. మీరు ప్రతి నెల పోస్టాఫీస్ FDలో రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు 5.8 శాతం వడ్డీ రేటుతో రూ.16 లక్షలు చేతికి వస్తుంది.

English summary

రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలో చేతికి రూ.16 లక్షలు | Post office scheme: You can become a millionaire by investing Rs 10,000

If you want to earn good amount of money by sitting at home then this article solely for you. You would be surprised to know that there are many post office schemes which can help you earn good returns with less risk.
Story first published: Sunday, November 14, 2021, 16:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X