For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ అకౌంట్ కన్నా.. పోస్టాఫీసు అకౌంట్ బెటర్!

|

బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకు కన్నా పోస్టాఫీసు బెటర్. అవును, మీరు చదివింది నిజమే! ఇంకా చెప్పాలంటే.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడంకంటే కూడా పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేయడం బెటర్.

ఎందుకంటే, పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ద్వారా కూడా మీరు బ్యాంకు అకౌంట్‌ ద్వారా కలిగే ప్రయోజనాలన్నీ పొందవచ్చు. పైపెచ్చు మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు కూడా ఉండవు. బ్యాంకు మాదిరిగానే పోస్టాఫీసు అకౌంట్‌కు కూడా డెబిట్ కార్డు ఇస్తారు. దాంతో మీరు అవసరమైనప్పుడు ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

బ్యాంకుల కన్నా అధిక వడ్డీ రేటు...

బ్యాంకుల కన్నా అధిక వడ్డీ రేటు...

అవును, పోస్టాఫీసు అకౌంట్‌లో దాచుకున్న డబ్బుకు బ్యాంకు కంటే అధిక వడ్డీ లభిస్తుంది. పైగా అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందన్న ప్రాతిపదికతో సంబంధం లేకుండా 4 శాతం వడ్డీ లభిస్తుంది. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే సేవింగ్స్ అకౌంట్‌లో రూ.లక్ష వరకు 3.25 శాతం వడ్డీయే వస్తుంది. అదే మీ సేవింగ్స్ రూ.లక్ష దాటితే వడ్డీ రేటు ఇంకా తగ్గుతుంది. మరి ఇప్పుడు చెప్పండి.. బ్యాంకు అకౌంట్‌ కన్నా పోస్టాఫీసు అకౌంట్ బెటర్ కదూ!

‘మినిమం' బాదుడు ఉండదు...

‘మినిమం' బాదుడు ఉండదు...

మీ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌లో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే చార్జీలు చెల్లించాల్సిందే. ఈ మినిమం బ్యాలెన్స్ అనేది బ్యాంకు, బ్రాంచి ప్రాతిపదికన మారుతుంది. చార్జీలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అదే పోస్టాఫీసు అకౌంట్‌లో అయితే ఈ మినిమం బ్యాలెన్స్ గొడవే ఉండదు. మీ అకౌంట్‌లో జస్ట్ రూ.50 ఉంచితే చాలు. ఒకవేళ మీకు చెక్ బుక్ కావాలంటే మాత్రం మీ అకౌంట్‌లో మినిమం రూ.500 ఉంచాలి. అయినా కూడా బ్యాంకుల కంటే నయం కదూ!

బ్యాంకు మాదిరిగానే అన్ని సౌకర్యాలు...

బ్యాంకు మాదిరిగానే అన్ని సౌకర్యాలు...

బ్యాంకు అకౌంట్ మాదిరిగానే పోస్టాఫీసులో కూడా సింగిల్ లేదా జాయింట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ కూడా బ్యాంక్ అకౌంట్‌‌కు ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయి. చెక్‌బుక్, ఏటీఎం కార్డు ఇస్తారు. నామినేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇంకా అకౌంట్ ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సదుపాయాలు ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ట్యాక్స్ బెనిఫిట్ తదితర సౌకర్యాలన్నీ ఉంటాయి.

ఏటీఎం ద్వారా రోజుకు రూ.25 వేలు...

ఏటీఎం ద్వారా రోజుకు రూ.25 వేలు...

పోస్టాఫీసులో మీరు సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటే.. డెబిట్ కార్డుపై రోజుకు రూ.25 వేల వరకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఒక లావాదేవీపై గరిష్టంగా రూ.10 వేలు తీసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఏటీఎంలలో జరిపే నగదు, నగదు రహిత లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. రోజుకు 5 నగదు లావాదేవీలు ఉచితం. మెట్రో నగరాల్లో అయితే.. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3 లావాదేవీలు ఉచితం. ఇక నాన్ మెట్రో పట్టణాల్లో అయితే 5 లావాదేవీలు ఉచితం. ఒకవేళ ఈ లిమిట్ దాటి మీరు లావాదేవీలు నిర్వహిస్తేనే చార్జీ పడుతుంది. అది కూడా రూ.20, దీనికి పన్నులు అదనం.

ఇంకా ఏమేం చేయవచ్చంటే...

ఇంకా ఏమేం చేయవచ్చంటే...

పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు కూడా ఇంట్లో కూర్చునే అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. సింగిల్ అకౌంట్‌ను ఎప్పుడైనా జాయింట్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే డబ్బును ఒక పోస్టాఫీస్ అకౌంట్ నుంచి మరొక పోస్టాఫీస్ అకౌంట్కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంతేకాదు, మీరు ఇల్లు మారితే.. ఏకంగా మీ అకౌంట్‌ను సమీపంలోని పోస్టాఫీసుకు మార్చుకోవచ్చు. ఇంకా పన్ను ప్రయోజనాలు, వడ్డీపై పన్ను మినహాయింపు తదితర ప్రయోజనాలూ పొందవచ్చు.

English summary

ఎస్‌బీఐ అకౌంట్ కన్నా.. పోస్టాఫీసు అకౌంట్ బెటర్! | Post Office Savings Account is better than SBI Savings Account

Not many people know, but one can now open a savings account in a Post Office. With the Government of India pushing to make banking services available to all, especially those hailing from rural and semi-rural areas, Post Offices now are offering savings account schemes at attractive interest rates.
Story first published: Thursday, November 7, 2019, 18:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X