న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ గడువు దాఖలు చేయడానికి జనవరి 10, 2021 వరకు గడువును పొడిగించారు. ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇది సువర్ణావకాశం. దాదాపు మరో పది రోజుల గడువు దొరికింది. లేదంటే భారీగా పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ గడువును పలుమార్లు పొడిగించారు. ఇటీవలి వరకు డిసెంబర్ 31, 2020 వరకు అవకాశం కల్పించారు. అయితే పలు విజ్ఞప్తుల నేపథ్యంలో తాజాగా చివరి అవకాశంగా పది రోజుల గడువు ఇచ్చారు. అంటే జనవరి 10వ తేదీతో ఐటీ రిటర్న్స్ గడువు ముగియనుంది. ఆ గడువు దాటితే ఫైన్ ఉంటుంది.

రీఫండ్ ఇబ్బందులు
ఆడిట్ అవసరం లేకుండా ఐటీఆర్-1, ఐటీఆర్-4 ద్వారా రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. పన్ను చెల్లింపుదారు చివరి తేదీ వరకు వేచి ఉండరాదు. రీఫండ్ కావాలంటే పన్ను చెల్లింపుదారులు ముందుగానే రిటర్న్స్ దాఖలు చేయాలి. మొదట చేసిన ఐటీఆర్ ఫైలింగ్స్ ముందే ధృవీకరిస్తారు. తద్వారా వేగంగా రీఫండ్ వస్తుంది. ప్రాసెస్ చేసేందుకు ఆదాయ పన్ను శాఖకు నెల రోజులు, ఆ పైన పడుతుంది. జనవరి 10వ తేదీలోపు రిటర్న్స్ దాఖలు చేయకుంటే రీఫండ్ వర్తించదు.

ఐటీఆర్ ఫైలింగ్ జరిమానా
ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు జనవరి 10, 2021 వరకు ఉంది. ఈ గడువు జరిమానా ఉంటుంది. రూ.5 లక్షలకు లోపు ఆదాయం ఉన్నప్పటికీ రూ.1000 లేట్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. రూ.5 లక్షల ఆదాయం దాటితే మాత్రం అంతకు పదిరెట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఐటీ రిటర్న్స్ గడువులోగా దాఖలు చేస్తే ప్రయోజనాలెన్నో
ఐటీ రిటర్న్స్ గడువులోగా దాఖలు చేస్తే ఈజీ లోన్ అప్రూవల్స్, ట్యాక్స్ రీఫండ్ క్లెయిమ్ వంటి వెసులుబాట్లు ఉంటాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను మీ అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. మీ లాసెస్‌ను కూడా క్యారీ ఫార్వార్డ్ చేయవచ్చు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications