For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tax benefits: అద్దెకు ఉంటే బెటరా, ఇంటిని కొనుగోలు చేస్తే మంచిదా?

|

నగరాలు, పట్టణాలు, చిన్న సిటీలలో ఉద్యోగం చేసేవారు లేదా వ్యాపారులు లేదా ఇతరులు ఎక్కువగా అద్దెకు ఉంటారు. కొంతమంది అద్దెకు ఉండే బదులు హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుగోలు చేయడం బెట్టర్‌గా భావిస్తే, ఆ భారం మనం మోయలేం రెంట్ బెట్టర్ అని కొంతమంది భావిస్తారు. ఇంటిని కొనుగోలు చేయాలంటే ప్రతి నెల లోన్ భారం పడుతుంది. పైగా కొనుగోలు చేసే సమయంలో మన వద్ద కొంత మొత్తం ఉండాలి. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ బెట్టరా లేక అద్దెకు ఉండటం బెట్టరా అంటే..

SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్‌లోన్ స్కీం: ప్రయోజనమెలా?SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్‌లోన్ స్కీం: ప్రయోజనమెలా?

రెండింటికీ ఆదాయపు పన్ను మినహాయింపు

రెండింటికీ ఆదాయపు పన్ను మినహాయింపు

మీరు ఇంటిని కొనుగోలు చేసినా లేదా అద్దెకు ఉన్నా.. పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అద్దెకు ఉంటే మీరు ఇంటి యజమానికి చెల్లించిన అద్దెపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అలాగే ఇంటిని కొనుగోలు చేస్తే ఈఎంఐపై ఉంటుంది. గత కొంతకాలంగా వివిధ ప్రోత్సాహకాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

డిడక్షన్

డిడక్షన్

అద్దెకు ఉంటే లోన్ పేమెంట్, ఈఎంఐ వంటి చెల్లింపు బాధలు ఉండవు. హోమ్ లోన్ తీసుకోకుండా అద్దెకు ఉంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసీ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టాలి. వీటికి ట్యాక్స్ మినహాయింపు రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసి హోమ్ లోన్ చెల్లిస్తే ప్రిన్సిపల్ అమౌంట్ పైన డిడక్షన్ ఉంటుంది.

క్లెయిమ్ చేసుకోవచ్చు

క్లెయిమ్ చేసుకోవచ్చు

సెక్షన్ 80సీ కింద ప్రిన్సిపల్ రీపెయిడ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 24(బీ) కింద వడ్డీ రేటుపై ట్యాక్స్ రిలీఫ్ ఉంటుంది. ఏడాదికి రూ.2 లక్షల వరకు ఊరట ఉంటుంది.

మొదటిసారి ఇంటిని కొనుగోలు చేస్తే...

మొదటిసారి ఇంటిని కొనుగోలు చేస్తే...

ఏప్రిల్ 1, 2016 నుంచి మార్చి 31, 2017 మధ్య ఇంటిని కొనుగోలు చేసిన వారికి నాటి బడ్జెట్‌లో అదనంగా రూ.50,000 మినహాయింపు ఇచ్చింది మోడీ ప్రభుత్వం. రూ.50 లక్షల వ్యాల్యూ మించని ఇంటికి, రూ.35 లక్షల లోపు లోన్‌కు సెక్షన్ 80ఈఈ కింద ఈ మినహాయింపు ఇచ్చారు. సెక్షన్ 80ఈఈఏ కింద గత బడ్జెట్‌లోను ఇదే తరహా మినహాయింపును ఫస్ట్ టైమ్ హోమ్ బయ్యర్స్‌కు ఇచ్చారు. ఇది ఫస్ట్ టైమ్ ఇంటిని కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రాపర్టీ వ్యాల్యూ రూ.45 లక్షలుగా ఉంటే రూ.1.5 లక్షల మినహాయింపు ఉంటుంది.

అద్దెకు ఉంటే.. హోమ్ లోన్ అయితే..

అద్దెకు ఉంటే.. హోమ్ లోన్ అయితే..

అద్దెకు ఉన్నా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు రెంట్స్ పెరుగుతాయి. అయితే ఉద్యోగం మారినప్పుడు రెంట్ అయితే లొకేషన్ మార్చుకోవడం కూడా ఈజీ. కానీ ఇంటిని కొంటే అసెట్ అవుతుంది. ఆర్థిక భద్రత ఉంటుంది. ఇంటి వ్యాల్యు ఎప్పటికి అప్పుడు పెరుగుతుంది. హోమ్ లోన్ పైన పన్ను ప్రయోజనాలు మరింత ఎక్కువగా పొందవచ్చు. ఈఎంఐ స్థిరంగా ఉంటుంది. కానీ రెంట్ పెరుగుతుంటుంది.

హోమ్ లోన్ వర్సెస్ అద్దె

హోమ్ లోన్ వర్సెస్ అద్దె

ఉదాహరణకు మీరు రూ.30 లక్షల హోమ్ లోన్‌ను ఇరవై ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటే మీరు నెలకు రూ.28 వేలు చెల్లిస్తే మొత్తం 67 లక్షలు అవుతుంది. ఇదే ఇరవై ఏళ్లలో నెలకు రూ.10 వేల చొప్పున అద్దెగా తీసుకుంటే ఇరవై ఐదు లక్షలు అవుతుంది. అయితే ఏడాదికి ఏడాది అద్దె పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే ఇది రెండింతలు కావొచ్చు. కొనుగోలు కంటే అద్దె బెట్టర్ అనుకుంటే సగం భారం తగ్గుతుంది. అయితే ఇంటిని కొనుగోలు చేయకపోయినా ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనకరం. మన ఆర్థిక పరిస్థితి, అవసరాలను బట్టి ఇంటిని కొనుగోలు చేస్తే మంచిదా, అద్దెకు ఉంటే మంచిదా నిర్ణయం ఎవరికి వారే తీసుకోవాలి.

English summary

Tax benefits: అద్దెకు ఉంటే బెటరా, ఇంటిని కొనుగోలు చేస్తే మంచిదా? | Paying a home loan EMI or staying on rent? Know the tax benefits

Your residence – whether owned, rented or leased out can give you to a range of tax benefits. Be it interest paid and principal repaid on a housing loan or rent paid to your landlord, the Income Tax Act allows deductions and breaks under various sections.
Story first published: Friday, January 17, 2020, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X