For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెన్షన్ నిబంధనల్లో భారీ మార్పులు, మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం

|

నరేంద్ర మోడీ ప్రభుత్వం హిస్టారికల్ నిర్ణయం తీసుకుంది. 01-01-2004 లోపు నియామకాలు ఖరారు చేయబడిన, వివిధ కారణాల వల్ల 01-01-2004న లేదా తర్వాత సర్వీసుల్లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చింది. మోడీ సర్కార్ నిర్ణయంతో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట దక్కనుంది.

భయంవద్దు, ధరలు పెరిగే పరిస్థితులు కనిపించట్లేదు: నిర్మలభయంవద్దు, ధరలు పెరిగే పరిస్థితులు కనిపించట్లేదు: నిర్మల

పెన్షన్ పరిధిని ఎంచుకోవచ్చు

పెన్షన్ పరిధిని ఎంచుకోవచ్చు

2004 జనవరి 1 లోపు ఉద్యోగంలో చేరిన లేదా వివిధ కారణాలతో ఆ తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులందరూ ఇప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)కు బదులుగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972 పరిధిలో ఉండేలా ఎంచుకోవచ్చు.

ఎంతో మందికి ఉపశమనం

ఎంతో మందికి ఉపశమనం

1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (CCS-పెన్షన్) రూల్స్ 1972 నిబంధనల పరిధిలో ఉండేందుకు చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించే సమయంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం ఎంతోమంది ఉద్యోగులకు ఉపశమనం కలిగించేదిగా ఉంటుంది.

కేంద్రమంత్రి ఏం చెప్పారంటే

కేంద్రమంత్రి ఏం చెప్పారంటే

ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు ఆనందాన్ని కలిగిస్తాయని, 2004కు ముందు నియమించబడిన ఉద్యోగులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972 లేదా NPSలో ఉండవచ్చునని తెలిపారు.

కొత్త ఆదేశాలు.. గడువు

కొత్త ఆదేశాలు.. గడువు

ఉద్యోగులు తమ పెన్షన్ విధానాన్ని ఎంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. మే 31, 2020 లోపు ఈ ఎంపిక ప్రక్రియను ఉపయోగించుకోవచ్చు. డెడ్ లైన్ లోపు తమ పెన్షన్ విధానాన్ని ఎంచుకోని పక్షంలో వారంతా NPS పరిధిలోకి వస్తారు.

English summary

పెన్షన్ నిబంధనల్లో భారీ మార్పులు, మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం | Modi cabinet makes big change in Pension Rules

The Modi government today took a landmark decision by meeting the long-standing demand of Central Government employees whose recruitment was finalized before 01/01/2004 but who had, for various reasons, joined the services on or after 01/01/2004.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X