For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ITR మిస్ అయ్యారా? వారమే గడువు.. ఆ తర్వాత రూ.5,000 ఎక్కువ ఫైన్

|

2019-20 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు గడువు ఆగస్ట్ 31, 2019తో ముగిసింది. అంతకుముందు జూలై 31 ఉండగా, ఐటీ శాఖ దానిని నెల రోజుల పాటు పొడిగించి ఆగస్ట్ చివరి నాటికి వెసులుబాటు కల్పించింది. ఆగస్ట్ 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారికి పెనాల్టీ ఉంటుంది.

బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!

నెలాఖరులోగా దాఖలు చేస్తే పెనాల్టీ ఇంతే...

నెలాఖరులోగా దాఖలు చేస్తే పెనాల్టీ ఇంతే...

అయితే ఆగస్ట్ 31వ తేదీలోపు ఐటీ రిటిర్న్స్ దాఖలు చేయనివారు ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీలోపు రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేస్తున్నందుకు ఆగస్ట్ 31వ తేదీ తర్వాత నుంచి పెనాల్టీ ఉంటుంది. ఇప్పుడు ఈ నెలాఖరులోగా (డిసెంబర్ 31) దాఖలు చేయాలి. అప్పుడు రూ.5,000 జరిమానా మాత్రమే ఉంటుంది.

ముందే దాఖలు చేస్తే రూ.5,000 సేవ్ చేసినట్లే

ముందే దాఖలు చేస్తే రూ.5,000 సేవ్ చేసినట్లే

రెండోసారి... అంటే డిసెంబర్ 31వ తేదీ కూడా దాటితే మీకు పెనాల్టీ రెండింతలు అవుతుంది. ఆ తర్వాత నుంచి మార్చి 31, 2020 వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది. మరో వారం రోజుల్లో తొలి పెనాల్టీ గడువు కూడా ముగియనుంది. ఈ లోపు దాఖలు చేస్తే రూ.5,000 సేవ్ చేసినట్లే. లేదంటే రెండింతలు అవుతుంది.

సెక్షన్ 139 ప్రకారం ఐటీఆర్ తప్పనిసరి

సెక్షన్ 139 ప్రకారం ఐటీఆర్ తప్పనిసరి

ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయడంలో వైఫల్యం చెందితే ఫైన్ ఉంటుంది. వేతన జీవుల నుంచి టీడీఎస్ ద్వారా పన్ను వసూలు చేస్తున్నప్పటికీ వారు కూడా ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. జరిమానా తప్పించుకోవడానికి, ఐటీఆర్ ఫైలింగ్ ద్వారా వచ్చే ఇతర ప్రయోజనాలు పొందేందుకు గడువులోగా ఫైల్ చేయడం మంచిది. ట్యాక్సబుల్ ఇన్‌కమ్ కలిగిన వ్యక్తి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం ఐటీఆర్ దాఖలు చేయాలి.

వారికి జరిమానా వర్తించదు

వారికి జరిమానా వర్తించదు

- 31 డిసెంబర్ లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే రూ.5,000 జరిమానా

- ఆ తర్వాత రూ.10,000 జరిమానా ఉంటుంది.

- ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్య రుసుము రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే గరిష్టంగా రూ.1000.

- ఐటీఆర్‌ను స్వచ్చంధంగా దాఖలు చేసేవారు నిర్ణీత వ్యవధిలో దాఖలు చేయనప్పటికీ జరిమానా చెల్లించవలసిన అవసరం లేదు.

English summary

ITR మిస్ అయ్యారా? వారమే గడువు.. ఆ తర్వాత రూ.5,000 ఎక్కువ ఫైన్ | Missed ITR deadline? You can save Rs 5,000 by filing income tax return by December 31

The last date for filing the ITR for the assessment year 2019-20 was August 31, 2019, after it had got extended from July 31. However, for those who have not filed ITR within the due date, a delay in filing ITR comes at a cost.
Story first published: Monday, December 23, 2019, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X