For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PAN-Aadhaar link: మార్చి 31లోగా లింక్ చేయకుంటే భారీ షాక్, మళ్లీ అప్లై చేయొద్దు..

|

ఆధార్ - పాన్ కార్డు లింకింగ్ తేదీ దగ్గరకు వచ్చింది. ఈ నెలాఖరు నాటికి అంటే మార్చి 31వ తేదీకి ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకోవాలి. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ పలుమార్లు ఈ గడువును పొడిగించింది. ఈసారి పొడిగింపుపై ఆశలు లేవు. మార్చి 31, 2020 లోపు పాన్-ఆధార్ లింక్ చేయకుంటే మీకు షాక్ తప్పదు!

బ్యాంకులపై వచ్చే మూడేళ్లలో రూ.2.54 లక్షల కోట్ల భారం, ఎందుకంటే!బ్యాంకులపై వచ్చే మూడేళ్లలో రూ.2.54 లక్షల కోట్ల భారం, ఎందుకంటే!

రూ.10,000 జరిమానా

రూ.10,000 జరిమానా

గడువులోగా ఆధార్-పాన్ లింక్ పూర్తి చేయని పక్షంలో పాన్ కార్డు పని చేయదు. అంతేకాదు, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే రూ.10,000 జరిమానా విధించనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. పని చేయని పాన్ కార్డు వాడినట్లు తేలితే వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 272B కింద రూ.10,000 పెనాల్టీ విధిస్తారు. లింక్ చేయని పాన్ కార్డులు ఇన్ఆపరేటివ్ అవుతాయని గతంలో పేర్కొన్న ఐటీ శాఖ తాజాగా జరిమానా ఉంటుందని పేర్కొంది.

సాధారణంగా వీటికి ఫైన్ ఉండదు..

సాధారణంగా వీటికి ఫైన్ ఉండదు..

సాధారణంగా పాన్ కార్డు ఇన్ఆపరేటివ్‌గా మారినప్పుడు, వాటిని ఉపయోగిస్తే సెక్షన్ 272బీ ప్రకారం రూ.10,000 జరిమానా ఉంటుందని బ్యాంక్ బజార్ సీఈవో తెలిపారు. బ్యాంకు అకౌంట్ తీసినప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం వంటి పన్నురహిత సంబంధ అంశాలకు జరిమానా ఉండదు.

కానీ.. ఇలా చేస్తే జరిమానా

కానీ.. ఇలా చేస్తే జరిమానా

బ్యాంకు అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ తీసినప్పుడు పాన్ కార్డును ఉపయోగిస్తే సాధారణంగా జరిమానా ఉండదు. కానీ మార్చి 31, 2020 తర్వాత ఇన్ఆపరేటివ్ అయిన పాన్ కార్డుతో రూ.50,000కు మించి ట్రాన్సాక్షన్స్ జరిపే క్రమంలో రూ.10వేలు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆ తర్వాత పాన్ పని చేస్తుంది..

ఆ తర్వాత పాన్ పని చేస్తుంది..

ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే పాన్ కార్డు ఏప్రిల్ 1వ తేదీ నుండి పని చేయదు. కానీ అనుసంధానం పూర్తి చేసిన అనంతరం వారి పాన్ కార్డు వారికి తిరిగి పని చేస్తుంది. కాబట్టి పాన్ కార్డ్ ఇన్ఆపరేటివ్ అయితే మరోసారి దరఖాస్తు చేసుకోవద్దు. లింక్ చేస్తే సరిపోతుంది. మళ్లీ యాక్టివ్ అవుతుంది.

English summary

PAN-Aadhaar link: మార్చి 31లోగా లింక్ చేయకుంటే భారీ షాక్, మళ్లీ అప్లై చేయొద్దు.. | Link PAN with Aadhaar by the end of this month

You may face double trouble if you fail to link your Aadhaar with PAN by the end of this month. First, your PAN will become inoperative and second, you may be fined Rs 10,000 if you use an inoperative PAN
Story first published: Monday, March 2, 2020, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X