For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: పాలసీదారులకు LIC సూపర్ ఆఫర్, 2 ఏళ్లకు పైన ల్యాప్స్ ఐతే పునరుద్ధరించుకోవచ్చు

|

ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పాలసీదారులకు సోమవారం ఓ శుభవార్త చెప్పింది. రెండేళ్లకు పైగా ల్యాప్స్ అయినా పాలసీలను పునరుద్ధరించుకోవచ్చునని స్పష్టం చేసింది. తద్వారా ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఓ అవకాశం ఇచ్చింది. గతంలో ఇలాంటి సదుపాయం కల్పించలేదు. ఇది ఎల్ఐసీ పాలసీదారులకు ఎంతో ప్రయోజనకరం.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

ల్యాప్స్ అయిన పాలసీలు పునరుద్ధరించుకోవచ్చు

ల్యాప్స్ అయిన పాలసీలు పునరుద్ధరించుకోవచ్చు

రెండేళ్లకు పైగా ల్యాప్స్ అయినా లేదా అంతకుముందు పునరుద్ధరణకు అనుమతించబడని పాలసీలు పునరుద్ధరించుకోవచ్చునని తెలిపింది. 2013 irdai ప్రాడక్ట్స్ రెగ్యులేషన్స్ 2013 ప్రకారం 2014 జనవరి 1వ తేదీ నుంచి కేవలం రెండేళ్ల లోపు ల్యాప్స్ అయిన పాలసీలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇదివరకు రెండేళ్లకు పైగా ల్యాప్స్ అయిన వాటికి అనుమతి లేదు. ఇప్పుడు ఆ అవకాశం కల్పిస్తోంది.

పాలసీ ప్రయోజనాలు..

పాలసీ ప్రయోజనాలు..

ఎల్ఐసీ నిబంధనల ప్రకారం సంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీ పునరుద్ధరణకు అయిదేళ్ల వరకు గడువు ఉంది. యూనిట్ లింక్డ్ పాలసీలకు మూడేళ్ల గడువు ఇచ్చింది. పాలసీ ల్యాప్స్ అయిన వారికి ఇది ఊహించని శుభవార్త అని చెప్పవచ్చు. దీంతో పాలసీదారులు వారి పాలసీల్ని తిరిగి పునరుద్ధరించుకోవచ్చునని తెలిపింది. పాలసీ ప్రయోజనాలను మళ్లీ యథావిధిగా పొందవచ్చు.

ఎల్ఐసీ చెల్లింపు

ఎల్ఐసీ చెల్లింపు

ఎల్ఐసీ ఒక నెల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. పాలసీదారులు వారి ప్లాన్ ప్రీమియం మొత్తాన్ని గడువులోగా చెల్లించలేని పరిస్థితుల్లో నెల రోజుల్లోగా చెల్లించాలి. గ్రేస్ పీరియడ్ లోగా ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఇప్పటి దాకా ల్యాప్స్ అయిన పాలసీలను రెండేళ్ల లోపు మాత్రమే చెల్లించే అవకాశముండగా, ఇప్పుడు నాన్ లింక్డ్ పాలసీలను అయిదేళ్లలోపు పునరుద్ధరించుకోవచ్చు. యూనిట్ లింక్డ్ పాలసీలకు మూడేళ్లు అవకాశముంది.

English summary

గుడ్‌న్యూస్: పాలసీదారులకు LIC సూపర్ ఆఫర్, 2 ఏళ్లకు పైన ల్యాప్స్ ఐతే పునరుద్ధరించుకోవచ్చు | LIC policyholders can now revive policies lapsed for above 2 years

State owned Life Insurance Corporation (LIC) on Monday permitted its policyholders to revive their lapsed policies of over 2 years, a move that will help improve persistency ratio.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X