ప్రయివేటురంగ కొటక్ మహీంద్రా బ్యాంకు తన సేవింగ్స్ బ్యాంకు రేటులో 0.5 శాతం మేర కోత విధించింది. రూ.1 లక్షకు పైనా జమ ఉన్న సేవింగ్స్ బ్యాంకు అకౌంట్స్‌పై 4 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని తెలిపింది. అంతకుముందు ఇది 4.5 శాతంగా ఉండేది. రూ.1 లక్షలోపు వారికి 3.5 శాతం వడ్డీనే వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది. ఈ సవరింపులు ఎన్నారైలకు వర్తించవని వెల్లడించింది. మే 25వ తేదీ నుండి ఇవి అమలులోకి వచ్చాయి.

7 శాతం నుండి 4 శాతానికి తగ్గింపు
కొటక్ మహీంద్ర బ్యాంకు గత నెలలో రెండుసార్లు సేవింగ్స్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించింది.ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లతో పాటు రుణ వృద్ధి లేనందున బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ రేట్లు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఎస్బీఐ అత్యంత తక్కువగా 2.75 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్, డీబీఎస్, కొటక్ మహీంద్రా వంటి బ్యాంకులు ఓ దశలో కొన్నేళ్లపాటు 7 శాతం వరకు ఇచ్చాయి. ఇప్పుడు ఈ బ్యాంకులు కూడా తగ్గిస్తున్నాయి.ఇప్పుడు 4 శాతానికి తగ్గించింది.

సేవింగ్ అకౌంట్స్ వడ్డీ రేట్లు ఇలా...
డొమెస్టిక్ వడ్డీ రేట్లు - రూ.1 లక్షకు పైన ఉంటే ఏడాదికి 4 శాతం. రూ.1 లక్ష లోపు ఉంటే 3.5 శాతం వడ్డీ. సీనియర్ సిటిజన్లకు కూడా ఇదే వర్తిస్తుంది.
- బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్స్/స్మాల్ అకౌంట్ - రూ.1 లక్షకు పైన ఉంటే ఏడాదికి 4 శాతం. రూ.1 లక్ష లోపు ఉంటే 3.5 శాతం వడ్డీ. సీనియర్ సిటిజన్లకు కూడా ఇదే వర్తిస్తుంది.
- నాన్ రెసిడెంట్స్ - ఏడాదికి 3.50 శాతం వడ్డీ రేటు. సీనియర్ సిటిజన్లకు కూడా ఇదే వడ్డీ రేటు.

తగ్గిన స్టాండాలోన్ ప్రాఫిట్
కొటక్ మహీంద్రా బ్యాంకు స్టాండాలోన్ ప్రాఫిట్ మార్చి 2020కి ముగిసిన క్వార్టర్‌లో రూ.1,266.6 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా 10 శాతం తగ్గుదలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో స్టాండాలోన్ ప్రాఫిడ్ రూ.1,407.80 కోట్లుగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications