For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్: ఇది చూశాక మీరు ట్యాక్స్ కట్టడం మరిచిపోరు!

|

న్యూఢిల్లీ: ప్రతిరోజు చేసే పనులు మరిచిపోవడం చాలా తక్కువ. కానీ ఎప్పుడో ఓసారి చేసే పనులు చాలామంది మరిచిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో దీని వల్ల ఎక్కువ మొత్తంలో నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆదాయపు పన్ను చెల్లింపు అంశాన్నే తీసుకుంటే చివరి తేదీ వరకు గుర్తుకు రాకుంటే హడావుడి పడతారు. డేట్ అయిపోతే డెడ్‌లైన్ ముగిసిపోయిందని బాధపడతారు. అయితే ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి ఐటీ డిపార్టుమెంట్ నుంచి మీకు ఊరట. ఎందుకంటే అలాంటి వారి కోసం ఐటీ శాఖ సరికొత్త క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది.

BHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండిBHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండి

ఫైల్ ఇట్ యువర్ సెల్ఫ్.. ట్యాక్స్ పేయర్స్‌కు మెయిల్

ఫైల్ ఇట్ యువర్ సెల్ఫ్.. ట్యాక్స్ పేయర్స్‌కు మెయిల్

ఆదాయపు పన్ను కట్టే సమయాన్ని మరిచిపోకుండా ఉండేందుకు 2020 క్యాలెండర్‌ను రూపొందించింది. దీనిని ఇప్పటికే విడుదల చేసింది. ఏ రోజు పన్ను కట్టాలి, చివరి తేదీ ఎప్పుడు వంటి అంశాలను పొందుపరిచింది. File it yourself పేరుతో ఈ క్యాలెండర్‌ను రూపొందించింది. దీనిని ట్యాక్స్ పేయర్స్‌కు మెయిల్ చేసింది.

పన్ను చెల్లింపు, రిటర్న్స్, మరిన్ని సేవలు...

పన్ను చెల్లింపు, రిటర్న్స్, మరిన్ని సేవలు...

ఈ క్యాలెండర్‌ను ఆదాయపు పన్ను శాఖ తన ట్విట్టర్ ఖాతాలోను పోస్ట్ చేసింది. పన్ను చెల్లింపు, ఐటీ రిటర్న్స్ దాఖలును మరింత సులభతరం చేసేందుకు ఈ క్యాలెండర్‌ను రూపొందించింది. ఈ క్యాలెండర్‌లో పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్న వివిధ సేవలను పొందుపరిచింది.

క్యాలెండర్‌లో...

క్యాలెండర్‌లో...

- ఈ క్యాలెండర్‌లో... జనవరి నెలలో డిసెంబర్ 31, 2019 క్వార్టర్‌కు సంబంధించిన టీసీఎస్, టీడీఎస్ డిపాజిట్ డ్యూడేట్‌ను పొందుపరిచింది.

- మార్చి 15న 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగో/చివరి ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ డేట్‌ను గుర్తు చేసింది.

- 2019-20 అసెస్మెంట్‌కు సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలును మార్చి 31న గుర్తు చేసింది.

- టీసీఎస్ 2019-20 నాలుగో క్వార్టర్ టీసీఎస్ స్టేట్మెంట్ సబ్‌మిష్ తేదీ మే 15.

- ఇండివిడ్యువల్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీని జూలై 31గా పొందుపరిచింది.

- ఈ క్యాలెండర్‌లో ఆదాయపు పన్ను శాఖ గురించిన వివిధ అంశాలను పొందుపరిచింది. చివరలో ఐటీ రిటర్న్స్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో కూడా తెలియపరిచింది.

క్యాలెండర్ కోసం దీనిని క్లిక్ చేయండి

English summary

ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్: ఇది చూశాక మీరు ట్యాక్స్ కట్టడం మరిచిపోరు! | IT department issues new 2020 calendar for taxpayers with all deadlines

The income tax department has issued a new calendar for the year 2020 having a list of all the important tax related deadlines. Designed as the File it yourself calendar to help taxpayers file their income tax returns easily, the e-calendar maps your ITR filing journey.
Story first published: Sunday, January 5, 2020, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X