For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం పరుగు, అంతకంటే వేగంగా వెండి జంప్

|

ఇటీవల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ, పసిడి కంటే వెండి ఫ్యూచర్ భారీగా ఎగిసిపడుతోంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ఓ సమయంలో రూ.12,400 తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ పెరిగి ప్రస్తుతం రూ.8500 తక్కువగా ఉంది. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో పోలిస్తే ఓ సమయంలో రూ.60,000 దిగువకు పడిపోయింది. అంటే దాదాపు రూ.20 వేలు క్షీణించింది. కానీ అంతలోనే రూ.11,000 పెరిగి రూ.71,000ను క్రాస్ చేసింది. అంటే సగం కంటే ఎక్కువగా పెరిగింది. బంగారం మాత్రం ఆ మేరకు పెరగలేదు.

క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.165.00 (0.35%) రూ.47760.00 వద్ద క్లోజ్ అయింది. గత వారం రూ.1000 వరకు పెరిగింది. అదే సమయంలో వెండి క్రితం సెషన్లో స్వల్పంగా రూ.180 తగ్గినప్పటికీ రూ.71,500 పైన ఉంది. రూ.3000 వరకు ఎగిసింది.

Is silver ready to outshine gold, after rising 6 percent?

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1850 డాలర్ల దిశగా పరుగెడుతోంది. రెండు రోజుల క్రితమే 1800 డాలర్లు క్రాస్ చేసింది. ఈ వారం చివరి సెషన్‌లో 16.25 (+0.89%) ఎగిసి 1,831.95 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 28 డాలర్ల దిశగా వెళ్తోంది. క్రితం సెషన్లో 0.081 (+0.29%) పెరిగి 27.558 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 29 డాలర్లకు సమీపంలో ఉంది. అదే సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2072తో పోలిస్తే 250 డాలర్ల దూరంలో ఉంది. ఇటీవల బంగారం కంటే వెండి ధరలు వేగంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది

English summary

బంగారం పరుగు, అంతకంటే వేగంగా వెండి జంప్ | Is silver ready to outshine gold, after rising 6 percent?

The Relative Strength Index sustaining above mid-level of 50 and MACD above zero line indicating strength in price.
Story first published: Saturday, May 8, 2021, 21:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X