పశ్చిమాసియా దేశాలు నివురు గప్పిన నిప్పులా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్దంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో సంక్షోభం ఏర్పడింది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్ మీద కూడా పడింది. పసిడి ధరలు అమాంతం ఎగబాకే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక పెట్టుబడిదారులు రిస్క్ ఆస్తులను వదిలేసి సేఫ్ హెవన్ ఆస్తుల మీద పడటంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పసిడి ధరలు యుద్ధంలాగే భగ్గుమంటున్నాయి.
మార్చి 10, 2026 నాటికి రెండు దేశాలు కలిసి మరో దేశం మీద చేస్తున్న యుద్ధం 11 వ రోజుకు చేరింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనపడటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం త్వరలో ముగియవచ్చని సూచించిన తర్వాత ముడి చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ వివిద దేశాల ఉత్పత్తి నియంత్రణ చర్యలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. COMEX బంగారం ఔన్సుకు దాదాపు 4 శాతం తగ్గి 5,166 డాలర్లకు చేరింది. భారత MCX బంగారం 10 గ్రాములకు రూ. 1.61 లక్షల కంటే తక్కువగా ఉంది. వెండి ధర కిలోకు రూ. 2.77 లక్షలకు కింద పడింది. ఇది గత 11 రోజుల్లో 4 శాతం కంటే ఎక్కువ తగ్గడం చూడవచ్చు.అయితే ఈ ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ AVP కైనత్ చైన్వాలా ప్రకారం.. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల మధ్య, US డాలర్ పుంజుకోవడం ఇంధన ధరలను మద్దతు ఇస్తోంది. పెరిగిన ఇంధన ఖర్చులు ద్రవ్యోల్బణాన్ని రీకౌంట్ చేయవచ్చు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. అదనంగా స్వల్పకాలిక మార్కెట్ అమ్మకాల కారణంగా బులియన్ లో తాత్కాలిక ఒత్తిడి ఏర్పడింది.
Gold ఔట్‌లుక్ 2026 విషయంలో.. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే డాలర్ బలం తగ్గవచ్చు, బులియన్ తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంది. అయితే ధరల దిశ వివాదం ఎలా అభివృద్ధి చెందుతుందనేదానిపై అది ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీర్ఘకాలిక అస్థిరత కొనసాగితే, ఆర్థిక మార్కెట్లలో, వస్తువుల ధరల్లో ఎక్కువ ప్రభావం చూపవచ్చన్నారు.
ప్రస్తుత బంగారం తాత్కాలిక బలహీనత ద్రవ్యత ఒత్తిళ్లు, బలవంతపు లిక్విడేషన్ల వల్ల మాత్రమే జరుగుతోంది. ప్రధాన మద్దతు కారకాలు ఏంటంటే.. కొనసాగుతున్న కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, అంతర్జాతీయ వాణిజ్యం, 2026 మధ్యతరహా US ఎన్నికలు, కరెన్సీ విలువల అస్థిరతలతో Gold ధరల పెరుగుదలకు భవిష్యత్తులో మద్దతు ఇస్తాయి. ప్రస్తుతం COMEX బంగారం, వెండి వరుసగా $5,010/oz, $87/oz చుట్టూ ట్రేడవుతున్నాయని తెలిపారు. ఇది భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
డాక్టర్ రెనిషా చైనాని (Agmont Research) ప్రకారం.. గత సంవత్సరం నుండి బంగారం ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి. స్వల్పకాలిక దిద్దుబాట్లు సహజం. అయితే 2026 చివరి నాటికి బంగారం 5,500 నుంచి 6 వేల డాలర్ల పరిధిలో కదలాడవచ్చని చెబుతున్నారు. పెట్టుబడిదారులు, రిటైల్ డిమాండ్ దీర్ఘకాలిక బుల్ మార్కెట్‌కు మద్దతు ఇస్తుందన్నారు.
ఇక పవన్ గుప్తా (PP Jewellers), కోటక్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి కూడా బంగారం దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉందని, కేంద్ర బ్యాంకులు నిల్వలను పెంచుతున్నందున, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నందున బంగారం ధరలకు మద్దతు ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
ఏదేమైనా ప్రస్తుతం స్వల్పకాలిక అస్థిరత ఉన్నప్పటికీ.. ప్రపంచ అనిశ్చితులు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు బంగారానికి స్థిరమైన మద్దతు ఇస్తున్నాయి. పెట్టుబడిదారులు బంగారాన్ని ఆర్థిక రక్షణా ఆస్తిగా చూస్తూ దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం సిద్ధంగా ఉన్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications